వైఎస్ షర్మిల పొలిటికల్ ఎంట్రీ: కేసీఆర్, జగన్ దోస్తీకి గండి?

First Published Feb 25, 2021, 9:42 AM IST

ఆంధ్ర మూలాలు ఉన్న షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడమేమిటనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది.  

తెలంగాణలో వైఎస్ కూతురు వైఎస్ షర్మిల రాజకీయాల్లోకి ప్రవేశించడంపై చర్చ ముమ్మరంగానే సాగుతోంది. ఆమె రాజకీయ ప్రవేశం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికిప్పుడు దాన్ని అంచనా వేయడం అంత సులభం కాదనప్పటికీ స్థూలంగా ఓ అంచనాకు రావచ్చు. టీఆర్ఎస్ ను ఎదుర్కునే బలమైన శక్తిగా బిజెపి అవతరిస్తున్న తరుణంలో ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు.
undefined
కేసీఆర్ వదిలిన బాణమా, బిజెపి వదలిన బాణమా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో షర్మిల చేత ఎవరో ఒకరు పార్టీ పెట్టిస్తున్నారని, ఇది ఆమె మదిలో మెదిలిన సొంత నిర్ణయమని భావించడం లేదు. దీంతో ఇది షర్మిల ముందరి కాళ్లకు బంధం వేసే విషయంగా మారింది. షర్మిల తెలంగాణలో ఓ బలమైన శక్తిగా అవతరించడానికి ఇది అటంకంగా మారింది.
undefined
షర్మిల మూలాలను కూడా ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర మూలాలు ఉన్న షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఆ విషయంపై ధాటిగానే వ్యాఖ్యలు చేశారు. జగన్ వదిలిన బాణం ఇప్పుడు వస్తుందని, ఆ తర్వాత జగన్, చంద్రబాబు వస్తారని ఆయన అన్నారు. వరుసగా షర్మిలపై ఆ విధమైన వ్యాఖ్యలు చేసిన గంగుల కమలాకర్ ఆ తర్వాత మౌనం వహించారు. ఆయన షర్మిలపై మౌనం వహించడానికి కారణమేమిటనేది స్పష్టంగా తెలియడం లేదు.
undefined
తన ఆంధ్రమూలాలను ప్రశ్నిస్తున్నవారికి షర్మిల సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాను తెలంగాణ కోడలిని అని, తనకు తెలంగాణలో రాజకీయాలు చేసే హక్కు ఉందని ఆమె చెబుతున్నారు. అదే సమయంలో కేసీఆర్, విజయశాంతి తెలంగాణవాళ్లా అని ఆమె ప్రశ్నించారు. తన ఆంధ్రమూలాలపై వస్తున్న విమర్శలకు సమాధానాలు చెప్పడానికే ఎక్కువ సమయం ఆమెకు పట్టే అవకాశాలున్నాయి.
undefined
తాను తెలంగాణలో పార్టీ పెట్టడం తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని షర్మిల అంటున్నారు. అయితే, దీన్ని ప్రజలు ఎంత వరకు నమ్ముతారనేది ప్రశ్న. తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న షర్మిలకు వ్యతిరేకంగా ఆయన పనిచేస్తారా అనేది ప్రశ్న. ఇప్పటి వరకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తెలంగాణలో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ వచ్చారు. అంతేకాకుండా కేసీఆర్ విజయం కోసం ఇక్కడి నాయకులు పనిచేశాయి కూడా.
undefined
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణుల మద్దతును కేసీఆర్ కోల్పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ వైఖరి ఎలా ఉంటుందనేది ప్రశ్న. ఈ స్తితిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, జగన్ కు మధ్య ఉన్న సంబంధాలు బెడిసికొట్టే అవకాశం లేకపోలేదు. పొరుగు రాష్ట్రం తెలంగాణతో సఖ్యత కోసం వైసీపీని తెలంగాణలో బలోపేతం చేయడం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. కానీ, షర్మిల కారణంగా ఆ సఖ్యత దెబ్బ తినే ప్రమాదం లేకపోలేదు.
undefined
click me!