జగన్ అఖండ మెజారిటీతో విజయం సాధించిన తరువాత వైసీపీ లోకి వలసలు మొదలయ్యాయి. టీడీపీ నేతలు భారీ స్థాయిలోనే చేరారు. ఎమ్మెల్యేలు సైతం వైసీపీ ఖండువా కప్పుకున్నప్పటికీ... టెక్నికల్ గా టీడీపీ రెబెల్స్ గా కొనసాగుతున్నారు. తొలుత వల్లభనేని వంశీ చేరికతో ఇది మొదలయింది.
ఇక ఆనాటి నుండి వంశీ నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడి మీద టీడీపీ మీద విపరీతంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. ఆయన వ్యాఖ్యలు ఎప్పుడు కూడా సంచలనాన్ని సృష్టించాయి. కానీ ఆయన తాజాగాచేసినవ్యాఖ్యలు ఆయన రాజకీయ భవిష్యత్తుపైన్నే దెబ్బకొట్టేలా కనబడుతుంది.
రాష్ట్రంలోని పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంలోకుల సమీకరణాలను కూడా వాడుతూనే ఉంటారు. అవతలి పార్టీలో ఏ కులస్థుడు మాట్లాడితే... అదే కులస్తుడితో కౌంటర్ ఎటాక్ చేపించడంఅనేది మనకు కనబడుతూనే ఉంటుంది.
తాజగా రమేష్ ఆసుపత్రి విషయంలో హీరో రామ్ జోక్యం చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేయడంతో... వల్లభనేని వంశీ రంగంలోకి దిగి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.సినీ హీరో రామ్ విజయవాడ రమేష్ ఆస్పత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివాడని, రామ్ సినిమాలు ఒక్క కమ్మవాళ్లు మాత్రమే చూస్తారా అని వంశీ అన్నారు. వేరేవాళ్లు రామ్ సినిమాలు చూడరా అని అడిగారు. వేరే కులం వారిని సినిమాలు చూడవద్దని చెప్పమనండని ఆయన అన్నారు. చంద్రబాబు వల్ల కమ్మ సామాజిక వర్గానికి ప్రమాదం జరిగే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలు ఆయనకు ఇప్పుడు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చి పెడుతున్నాయి. వల్లభనేని వంశీ అదే కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత. ఆయన నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గ ఓటర్లు అధిక శాతం. ఈయన వ్యాఖ్యల వల్ల ఇప్పుడు ఆ సామాజికవర్గం వారు మరింత కోపంగా ఉన్నారని టాక్.
ఇప్పటికే వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. టీడీపీ శ్రేణులు ఆయనపట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. సొంత క్యాడర్ కూడా వెంట రానిపరిస్థితి నెలకొందంటున్నారు. ఇక లోకల్ వైసీపీ నేతలు వల్లభనేని పై కారాలు మిరియాలు నూరుతున్నారు.
యార్లగడ్డ కు డిసిసిబి చైర్మన్ పదవి ఇవ్వడంతో తనకు ఇక లైన్ క్లియర్ అయింది అని వంశి అనుకుంటున్న తరుణంలో దుట్టా స్క్రీన్ మీదకు వచ్చారు. ఆయన తన అల్లుడిని అక్కడ రాజకీయంగా నిలబెట్టడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. వంశి విషయంలో ఏకంగా జగన్ వద్దే పంచాయితీ పెట్టాడు కూడా.
ఇప్పుడు దుట్టా యార్లగడ్డను కూడాకలిసి ఆయనను కూడా తనకే మద్దతివ్వవలిసిందిగా కోరాడు. ఆయనను ఇప్పుడు దుట్టా కలుపుకుపోతుండడం వంశీకి కొత్త ఇబ్బంది తెచ్చిపెడుతుంది. వంశి తాజగా చేసిన మరో వ్యాఖ్య ఇప్పుడు అక్కడ రాజకీయ వాతావరణం మొత్తం వేడెక్కింది. నేనే గన్నవరం ఎమ్మెల్యే, నేనే వైసీపీ ఇంచార్జి అంటూ చేసిన వ్యాఖ్యలపట్ల వైసీపీ లోకల్ నేతలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నిక గనుక జరిగి వంశీకి టికెట్ వస్తే వంశీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వైసీపీలో వర్గపోరు ఇప్పుడు ఆయనకు పొగబెడుతున్న వేళా సామాజికవర్గ మద్దతు కూడా ప్రశ్నార్థకంగా మరీనా వేళా గన్నవరం ఉప ఎన్నిక వంశీకి కత్తిమీద సామే!