అమరావతి రైతులకు పవన్ కల్యాణ్ షాక్: కేసీఆర్ కున్న తెగవ లేదా?

Published : Aug 19, 2020, 06:37 PM ISTUpdated : Aug 19, 2020, 10:46 PM IST

అమరావతి ప్రాంత రైతులు, అమరావతి పరిరక్షణ సమితి వారు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ను పదే పదే కోరినప్పటికీ... జనసేన వర్గాలు మాత్రం వారికి మొండిచేయినే చూపెడుతున్నాయట. ఎన్ని సార్లు అడిగినప్పటికీ... కుదరడంలేదని వారు వాపోతున్నారు. 

PREV
115
అమరావతి రైతులకు పవన్ కల్యాణ్ షాక్: కేసీఆర్ కున్న తెగవ లేదా?

యాంగ్రీ యంగ్ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో పెద్దగా రాజకీయ చిత్రపటంపై కనిపించడంలేదు. ఆయన బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన నితిన్ పెళ్లి సందర్భంగా బయట కనిపిస్తే మరల మొన్న స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. 

215

రాజకీయంగా ఆయన  లేఖల ద్వారా అటెండన్స్ వేయించుకుంటున్నారు తప్ప ప్రభావశీలంగా, క్రియాశీలకంగా మాత్రం లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మూడు రాజధానుల అంశం కుదిపేస్తున్న తరుణంలో ఆయన మాత్రం ఒక సమీక్ష సమావేశం వంటిది నిర్వహించి చేతులు దులుపుకున్నారు. 

315

వాస్తవానికి అమరావతి రైతులు పవన్ కళ్యాణ్ పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. తమపై లాఠీచార్జి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆఫీస్ బయట ఆడపడుచులు బారులు తీరారు. వారిని చూసి పవన్ కళ్యాణ్ కన్నీళ్లను కూడా పెట్టుకున్నాడు. 

415

కానీ ఆ తరువాత పవన్ కళ్యాణ్ ఎందుకో మాత్రం అమరావతి అంశంపై పెద్దగా స్పందించినట్టుగా కనబడడమా లేదు. అమరావతికి మద్దతిస్తామని చెప్పిన తరువాత మాత్రమే తాను బీజేపీతో జత కట్టనని చెప్పుకొచ్చాడు. కానీ అటువంటి పవన్ కళ్యాణ్... ఇప్పుడు అమరావతి విషయంలో అంటి ముట్టనట్టుగా ఉంటున్నాడు. 

515

అమరావతి ప్రాంత రైతులు, అమరావతి పరిరక్షణ సమితి వారు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ను పదే పదే కోరినప్పటికీ... జనసేన వర్గాలు మాత్రం వారికి మొండిచేయినే చూపెడుతున్నాయట. ఎన్ని సార్లు అడిగినప్పటికీ... కుదరడంలేదని వారు వాపోతున్నారు. 

అమరావతి ప్రాంత రైతులు, అమరావతి పరిరక్షణ సమితి వారు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ను పదే పదే కోరినప్పటికీ... జనసేన వర్గాలు మాత్రం వారికి మొండిచేయినే చూపెడుతున్నాయట. ఎన్ని సార్లు అడిగినప్పటికీ... కుదరడంలేదని వారు వాపోతున్నారు. 

615

బహుశా కరోనా వైరస్ వల్ల ఆయన ఈ మాట అంటున్నాడేమో అని అనేవారు కూడా లేకపోలేదు. ఒకవేళ అదే కారణం అయితే ఆయన వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడవచ్చు. అమరావతి ప్రాంత రైతులు తమ నిరసనలకు రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా కూడా వారు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే మాట్లాడారు. 

715

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వారికి సమయమే ఇవ్వకుండా కనిపించకుండా తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాన్ తొలినాళ్లలో అమరావతి ఉద్యమానికి మద్దతిచ్చినప్పటికీ... బీజేపీ ఎప్పుడైతే ఈ విషయంలో జోక్యం అనవసరమని భావించిందో... అప్పటినుండి పవన్ బీజేపీకి ఇబ్బంది కలగకుండా చాలా తెలివిగా ఆ విషయాన్ని పక్కనపెట్టాడు. 

815

అమరావతి ఉద్యమం 200 రోజులను పూర్తిచేసుకున్న సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ అందులో పాల్గొనలేదు. పవన్ కళ్యాణ్ బాటలో ఇప్పుడు మొత్తం జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పయనిస్తున్నట్టుగా అర్థమవుతుంది. సోషల్ మీడియాలో వారంతా అమరావతిని టీడీపీ ప్రాజెక్ట్ గా చూపెడుతూ... దీనివల్ల లాభపడేది కేవలం చంద్రబాబు వర్గీయులే అని అంటున్నారు. 

915

ఇంకొందరు జనసేన అభిమానులు, పవన్ అభిమానులయితే... ఏమి మాట్లాడుతున్నారో అర్థం, కాకుండా మాట్లాడుతున్నారు. జనసేనకు వోట్ వేయనందుకు అమరావతి రైతులకు తగిన శాస్తి జరిగిందని అంటున్నారు. 

1015

తమకు వోట్ వేసినవారికి మాత్రమే తాము అండగా ఉంటాము, వారికోసమే అన్ని అన్నట్టుగా చేస్తే... ఆ రాజాకీయ నాయకుడు ఏనాడూ నిలదొక్కుకోలేడు. ఓటములు విజయానికి మెట్లు. ప్రజలు ఓట్లేయలేదు కదా అని ప్రజలను నిందించలేరు కదా. 

ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తరువాత కూడా పవన్ కళ్యాణ్ ఓటమి చెందడంతో... ప్రజల విచక్షణతను ప్రశ్నిచారు తప్ప... తమ నేత ప్రజలను గెలిచేంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు అని అనుకోలేదు. 

1115

ఇలాంటి వైఖరి రాజకీయ నాయకుడనేవాడికి శరాఘాతమే అవుతుంది. నాయకుడని వాడు ప్రజలకోసం పోరాడుతుండాలి. ప్రజాసమస్య అన్నప్పుడు ప్రశ్నించాలి. అలా పోరాడుతూ, ప్రశ్నిస్తూ ముందుకుసాగినప్పుడు మాత్రమే తన లక్ష్యాలను అందుకొని ప్రజానేతగా నిలుస్తాడు. 

1215

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ను గనుక పరిశీలిస్తే... అనేక అవమానాలు పడ్డాడు. ఓటమి చెందాడు, పట్టుమని పది సీట్లు కూడా గెలవలేకపోయారని అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర్ రెడ్డి ఎద్దేవా చేసారు కూడా. అలా తనను కించపరిచారు అని ఆయన దిగాలు పడిపోలేదు. 

1315

ఆయన తమ పార్టీ నేతలు, ఓటమి చెందారని ప్రజలను నిందించలేదు. ఆయన తన అలుపెరుగని పోరాటాన్ని సాగించారు. ఆయన పోరాటం సాగిస్తూ ప్రజలందరినీ కలుపుకొని పోయారు. ప్రజలే ఉద్యమరథసారథులన్నారు. అంతే తప్ప తెరాస ఓటమి చెందిందంటే... తెలంగాణ ఆకాంక్ష నీరుగారిపోయిందని ఆయన భావించలేదు. 

1415

ఉద్యమించాడు, పోరాడాడు, చివరకు ప్రజలంతా కలిసి వచ్చారు. ఆయన పోరాటాన్ని గుర్తించిన ప్రజలు ఆయనను సరైన సమయంలో అధికారాన్ని కట్టబెట్టి ఆయననే తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆనాడు కేసీఆర్ గనుక తాను ఓటమి చెందానని కృంగిపోయుంటే ఇది వీలుపడేది కాదు. 

1515

ఇక్కడ ఇప్పుడు జనసేనాని చేయాలిసింది కూడా అదే. ప్రజలను కలుపుకుపోవడం ఇక్కడ చేయవలిసిన పని. జనసేనాని స్వయంగా ప్రజలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకున్నప్పటికీ... అత్యుత్సాహవంతులైన ఆయన అభిమానులు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే... ఈ వ్యాఖ్యలను పవనే  చేపిస్తున్నాడు అని అనుకునే ప్రమాదం కూడా లేకపోలేదు.  

click me!

Recommended Stories