కడియం శ్రీహరికి తీపి కబురు: ఈ ఎన్నికలు కేటీఆర్ కు కత్తి మీద సామే

First Published Oct 1, 2020, 1:26 PM IST

ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను నెలకొల్పుతుంది. ఈ స్థానం ప్రస్తుతం తెరాస ఖాతాలోనే ఉంది. గత దఫా ఇక్కడినుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. ఈసారి ఆ సీట్ ను నిలబెట్టుకోవడం తెరాస కు కత్తిమీద సాము వంటిది.

తెరాస కు ఎమ్మెల్సీ ఎన్నికల తలనొప్పి పట్టుకుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కరోనా వల్ల దెబ్బతిన్న బ్రతుకులు అన్ని వెరసి ఈ ఎన్నికల్లో తెరాస కు విజయం సాధించడం అంత తేలికైన పనిగా మాత్రం కనబడడం లేదు. ఈ విషయాన్నీ గుర్తెరిగిన తెరాస అధిష్టానం, కేటీఆర్ ఈ దిశగా సమాలోచనలు మొదలుపెట్టారు.
undefined
ఆయా స్థానాలను గెలవాలంటే అజాత శత్రువును, అన్ని వర్గాలకు చేరువైన, విద్యావంతుల సమస్యలపైనా పట్టున్న ఒక నేతను ఈ ఎన్నికల బరిలో దింపాలని యోచిస్తున్నారు తెరాస నాయకులు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ ఖమ్మంవరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను నెలకొల్పుతుంది.
undefined
ఈ స్థానం ప్రస్తుతం తెరాస ఖాతాలోనే ఉంది. గత దఫా ఇక్కడినుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. ఈసారి ఆ సీట్ ను నిలబెట్టుకోవడం తెరాస కు కత్తిమీద సాము వంటిది. ప్రొఫెసర్ కోదండరాం అక్కడినుండి బరిలో దిగబోతున్నారంటూ వార్తలు వస్తున్న వేళ ఈ సీట్ తెరాస కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
undefined
ఈ తరుణంలో ఇక్కడినుండి నిలబెట్టే అభ్యర్థి బలమైన అభ్యర్థి అయి ఉండాలని వారు భావిస్తున్నారు. ఇందుకోసం మాజీ మంత్రి తెలంగాణాలో సీనియర్ నేత కడియం శ్రీహరిని ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా అర్థమవుతుంది.
undefined
కడియం శ్రీహరికి తెలంగాణాలో మంచి పేరుంది. టీడీపీ హయాం నుండి ఆయన తెలంగాణాలో పేరున్న నాయకుడిగా చెలామణి అవుతున్నాడు. కోదండరాం మీద దళితుడనే అస్త్రాన్ని కూడా బలంగా ప్రయోగించవచ్చు అని యోచిస్తున్నారు తెరాస నాయకులూ.
undefined
తెలంగాణ ఏర్పడ్డాక ఉపముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా విద్యావంతుల సమస్యలపై ఆయనకు మంచి పట్టుంది. అన్ని సమస్యలను ఆయన దగ్గరుండి చూసినవారు. ఈ నేపథ్యంలోనే ఆయనను నిలబెట్టాలని యోచిస్తోంది తెరాస. ఇందుకు సంబంధించి ఆయనను పిలిచి మాట్లాడారు కేటీఆర్.
undefined
అయితే ఆయన కేటీఆర్ వద్ద వచ్చే ఎన్నికల్లో తన కూతురు కావ్యకు అసెంబ్లీ టికెట్ ని కోరినట్టు తెలియవస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆయన కోరినప్పటికీ... అప్పటి పరిస్థితుల దృష్ట్యా రాజయ్య కు సటికెట్ ను కేటాయించారు. ఇప్పుడు మాత్రం కడియం శ్రీహరి అందుకు సంబంధించి అధిష్టానాన్ని గట్టిగానే అడిగినట్టుగా తెలియవస్తుంది.
undefined
కేటీఆర్ సైతం అందుకు హామీని కూడా ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ తో భేటీ అనంతరం బయటకు వచ్చిన కడియం శ్రీహరి మొహం వెలిగిపోతుండడంతో ఆయనకు ఈ విషయంగా తగిన హామీ లభించినట్టుగా అర్థమవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం అవ్వాలని ఆయనకు కేటీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది.
undefined
చూడాలి రానున్న ఎన్నికల్లో ఈ విషయం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో. కేటీఆర్ కి పట్టాభిషేకం అని వార్తలు వస్తున్న వేళా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కేటీఆర్ కు, తెరాస కు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ఒకపక్క రంగారెడ్డి-మహబూబ్ నగర్-హైదరాబాద్ పరిధిలో ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇటుపక్క ఖమ్మం నల్గొండ వరంగల్ పరిధిలో కోదండరాం లు బరిలో ఉండనుండడంతోపోరు ఆసక్తికరంగా మారింది.
undefined
click me!