జగన్ మీద పోరు: ఎజెండా సెట్ చేయలేని చంద్రబాబు

First Published | Sep 28, 2020, 1:09 PM IST

చంద్రబాబు నాయుడితో పాటు ఆయన కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఎక్కువగా హైదరాబాదులోనే ఉంటున్నారు. కార్యకర్తలకే కాదు, పార్టీ నాయకులకు కూడా వారు దగ్గరగా ఉండడం లేదు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మీద పోరాటం చేయడానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తగిన ఎజెండాను సెట్ చేయలేకపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ మీద పోరాటానికి కార్యకర్తలను కదిలించడంలో అందుకే ఆయన విఫలమవుతున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్రంలోని వివిధ సమస్యలపై ఆయన మాట్లాడుతున్నారే గానీ తగిన పోరాట రూపాన్ని రూపొందించి ముందుకు సాగలేకపోతున్నారు.
undefined
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే అందుకు కారణం. చంద్రబాబు నాయుడితో పాటు ఆయన కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఎక్కువగా హైదరాబాదులోనే ఉంటున్నారు. కార్యకర్తలకే కాదు, పార్టీ నాయకులకు కూడా వారు దగ్గరగా ఉండడం లేదు. జూమ్ కాల్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నప్పటికీ అది ఫలితం ఇచ్చే అవకాశం లేదు. అధినేత ముందు వరుసలో ఉండాల్సిన అవసరం ఉంటుంది.
undefined

Latest Videos


సమస్యలను లేవనెత్తడంలో మాత్ర టీడీపీ ముందు వరుసలోనే ఉంటోంది. దళితులపై దాడులు, అమరావతి ఆందోళనలు, తదితర అంశాలపై చంద్రబాబు ఎప్పటికప్పుడు మీడియా సమావేశాల ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ప్రజలను కదిలించలేకపోతున్నారు. అలా కదిలించాల్సిన అవసరాన్ని కూడా గుర్తించినట్లు లేదు.
undefined
వైఎస్ జగన్ మీద పోరాటానికి బాధితులను ప్రోత్సహిస్తున్నారు. డాక్టర్ సుధాకర్ విషయం నుంచి మొదలు పెడితే అదే జరుగుతోంది. వారు పోరాటంలో దిగిన తర్వాత వారికి మద్దతు లభించడం లేదు. టీడీపీ వంటి బలమైన రాజకీయ పార్టీ ముందుండి ఆందోళనకు దిగితే కానీ ఫలితం ఉండదు. బాధితులు ఒంటరిగా పోరాటం చేయడం అంత సులభం కాదు. ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించారా, లేదా అనేది చెప్పలేం. అందుకే మీడియా సమావేశాల వల్ల లాభం లేదని పార్టీ ఎంపీ కేశినేని నాని వంటివాళ్లు అంటున్నారు.
undefined
పార్టీ నేతలు ఒక్కరొక్కరే కేసుల్లో ఇరుక్కుంటూ ఉంటే కూడా దాన్ని ప్రతిఘటించే కార్యాచరణ కూడా పకడ్బందీగా సాగడం లేదు. అచ్చెన్నాయుడు, కూన రవి కుమార్, జెసీ ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ వంటి వాళ్లపై కేసులు నమోదవుతున్నాయి. కోర్టుల ద్వారా వారు ఊరట పొందుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కక్షపూరితంగా, తమ పార్టీని దెబ్బ తీయడానికి కేసుల్లో ఇరికిస్తున్నారని అంటున్నారే తప్ప ప్రజాందోళనలకు శ్రీకారం చుట్టడం లేదు.
undefined
చంద్రబాబు తగిన కార్యాచరణను రూపొందించి ప్రజల్లోకి వెళ్తే తప్ప కదలిక రాదు. చంద్రబాబుకు వీలు కాకపోతే నారా లోకేష్ అయినా ఆ పనిచేయాలి. మిగతా పార్టీ నేతల్లో ఎవరో ఒకరు ముందుకు దూకి ఆందోళనలు సాగించే స్థితిలో లేరు. అశోక గజపతి రాజు వంటి సీనియర్ నాయకులు మౌనంగా ఉండిపోతున్నారు.
undefined
చివరకు, టీడీపీకి కూడా ఏపీలో ఏ మాత్రం బలం లేదని భావించిన బిజెపి ఎజెండాను ఇస్తోంది. దేవాలయాలపై దాడుల విషయంలో సోము వీర్రాజు నాయకత్వంలోని బిజెపి ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. సోము వీర్రాజు ముందుండి ఆందోళనలకు దిగడం వల్ల మిగతా నాయకులు కూడా ముందుకు వస్తున్నారు. బిజెపి వెనకనే ఈ విషయంలో టీడీపీ నడవాల్సిన పరిస్థితిలో పడింది.
undefined
click me!