పవన్ కల్యాణ్ 'తిరుపతి' పట్టు: బిజెపికి తలబొప్పి, జగన్ కు ఊరట

First Published Nov 14, 2020, 11:54 AM IST

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ జనసేనతో కలిసి నడుస్తుంది. జనసేన సైతం తిరుపతి సీటుపైన్నే అధిక ఆశలు పెట్టుకోవడంతోనే వచ్చింది అసలు సమస్య. తిరుపతి పార్లమెంటు సీటు పరిధిలో తమకు అనుకూల సమీకరణాలు ఉన్నాయని భావిస్తుంది జనసేన. 

దుబ్బాకలో బీజేపీ అనూహ్య విజయం ఆ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపింది. అధికారంలో ఉన్న తెరాస ను తన కంచుకోటలో మట్టికరిపించి గెలుపు జెండా ఎగురవేయడం అంతసాదాసీదా అంశం మాత్రం కాదు. దీనితో బీజేపీలో సహజంగానే నూతన జోష్ నిండింది. ఇదే జోష్ ను ఆంధ్రప్రదేశ్ లో కూడా కొనసాగించాలని బీజేపీ భావిస్తుంది.
undefined
దుబ్బాక జోష్ తో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో గెలిచి తీరాలని బీజేపీ భావిస్తుంది. ఎస్సి రిజర్వుడ్ సీటు అయిన తిరుపతి పార్లమెంటు సీటును 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది. ఇక్కడి నుండి ఎంపీగా ఎన్నికైన బల్లి దుర్గ ప్రసాద్ కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతుండగా గెండెపోటుతో సెప్టెంబర్ 16నమరణించారు. ఆయన మరణించడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమయింది.
undefined
బహుశా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే ఆస్కారం ఉంది. దీనితో అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికకు సంబంధించిన వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఇప్పటికే క్యాడర్ కి ఈ ఉపఎన్నికకు సంబంధించిన దిశానిర్దేశం కూడా చేశారట. రాయలసీమ ప్రాంతమవడం, సిట్టింగ్ సీటు అవడం, జగన్ గాలి బలంగా వీస్తున్న నేపథ్యంలో అధికార వైసీపీ ఈ సీటుపై ధీమాగా ఉంది.
undefined
ఇక దుబ్బాకను రిపీట్ చేసి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి షాక్ ఇవ్వాలని భావిస్తుంది బీజేపీ. ఇప్పటికే ఆ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు నిర్వహించి మరి ఈ విషయాన్నీ స్పష్టం చేయడమే కాకుండా.... నాయకులంతా సమాలోచనలు సైతం జరుపుతూ.... రావెలకిషోర్ బాబు పేరును సైతం తెరమీదకు తీసుకొచ్చినట్టు సమాచారం.
undefined
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ జనసేనతో కలిసి నడుస్తుంది. జనసేన సైతం తిరుపతిసీటుపైన్నే అధిక ఆశలు పెట్టుకోవడంతోనే వచ్చింది అసలు సమస్య. తిరుపతి పార్లమెంటు సీటు పరిధిలో తమకు అనుకూల సమీకరణాలు ఉన్నాయని భావిస్తుంది జనసేన.
undefined
తిరుపతి పార్లమెంటు సీటు పరిధిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక వర్గ ఓటర్లు కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు. అంతే కాకుండా... జనసేనాని సోదరుడు మెగాస్టార్ చిరంజీవి తిరుప్తియాహి నుండి ఎమ్మెల్యే గా కూడా గెలుపొందారు.
undefined
ఈ ఈక్వేషన్లను పరిగణలోకి తీసుకొని జనసేన ఈ సీటును డిమాండ్ చేస్తుంది. అంతే కాకుండా.... బీజేపీకి ఇక్కడ సరైన అభ్యర్థి లేడని, బీజేపీ గనుక పోటీ చేస్తే ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలకు కనీస పోటీ కూడా ఇవ్వలేమని వారు అంటున్నారు.
undefined
మరోవైపు బీజేపీ ఏమో జనసేనను సంప్రదించకుండానే ఈ సీటులో తాము పోటీచేస్తాము అని అంటుంది. 2019 ఎన్నికల్లో ఈ సీటులో జనసేన పోటీచేయకుండా అప్పుడు పొత్తులో భాగంగా బీఎస్పీకి వదిలేసింది. ఎప్పటిలాగానే మరోమారు తమకు వదిలేయాలని వారు అంటున్నారు.
undefined
ఒకపక్క దుబ్బాక రిపీట్ చేసి ఏపీలో బలపడాలని బీజేపీ చూస్తుంటే.... మరోపక్క 2019 ఎన్నికల తరువాత పోయిన గౌరవాన్ని, ఏపీ రాజకీయాల్లో సముచిత స్థానాన్ని తిరిగి సంపాదించుకొని తన అస్థిత్వాన్ని నిలుపుకోవాలని చూస్తుంది జనసేన.
undefined
click me!