ప్రతిభా భారతికి చంద్రబాబు మొండిచేయి: iగతంలో శిరీషకు సైతం...

First Published Oct 21, 2020, 5:17 PM IST

ప్రతిభాభారతిని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా చేసినప్పటికీ... ఆమెను పొలిట్ బ్యూరో నుండి తప్పించడంపై ఆమె, ఆమె అనుచరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నూతనంగా ఏర్పాటు చేసినటీడీపీ కమిటీలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా పార్టీ సీనియర్ నేత ప్రతిభాభారతి అలకపూనారు. ఆమెకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించకుండా.... కిమిడి కళా వెంకట్రావు కి స్థానం కల్పించడంపై ఆమె ఆగ్రహంగా ఉన్నట్టుగా సమాచారం.
undefined
ప్రతిభాభారతిని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా చేసినప్పటికీ... ఆమెను పొలిట్ బ్యూరో నుండి తప్పించడంపై ఆమె, ఆమె అనుచరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రకరకాల పార్టీలు మారి వచ్చిన కిమిడి కళావెంకట్రావును పార్టీ అధ్యక్షా బాధ్యతల నుంచి తప్పించి అచ్చెన్నాయుడికి అప్పగించినందుకు.... ఆయనను పొలిట్ బ్యూరోలో చేర్చేందుకు ప్రతిభాభారతిని బలిపశువును చేసారని ఆమె మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
undefined
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌తో పాటు పలు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన కావలి ప్రతిభా భారతి టీడీపీలో సీనియర్‌ నేత. అయితే ఆ పార్టీలోని రకరకాల రాజకీయ సమీకరణాల వల్లఆమె స్థాయికి తగ్గ గౌరవం లభించడంలేదు. మొన్నటి ఎన్నికల్లో ఏకంగా అసెంబ్లీ సీటునుకూడా ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ. ఏదో కొద్దికాలంపాటు ఉండే శాసనమండలి పదవిని ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
undefined
ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి గౌతు శ్యామ సుందర్‌ శివాజీ కుమార్తె గౌతు శిరీషను ఎలాగైతే మాటైనా చెప్పకుండా మార్చేశారో అదేవిధంగా ప్రతిభా భారతికి కూడా చె ప్పకుండా పొలిట్‌ బ్యూరో నుంచి తప్పించారని ఆమె అనుచరులు వాపోతున్నారు.నిన్న గౌతుశిరీషకు ఎలాగైతే అవమానం జరిగిందో, నేడు ప్రతిభా భారతికి కూడా తనప్రాధాన్యతనుతగ్గించడం ద్వారా అదే విధంగాఅన్యాయం చేశారని స్థానిక కార్యకర్తలు వాపోతున్నారు. పార్టీనే నమ్ముకొని పార్టీ కోసం కృషి చేసిన ప్రతిభాభారతికి ఈ విధమైన పరిణామం ఎదురవ్వడం వల్ల ఒక్కసారిగా ఉత్తరాంధ్ర నాయకులూ షాక్ కి గురయ్యారు.
undefined
click me!