తెలుగు టీవీ సీరియళ్ల ఫార్ములా: ఒక్క మగాడు, ఇద్దరు ఆడాళ్లు

First Published Mar 5, 2021, 1:19 PM IST

ఎక్కువగా పాపులర్ అయిన కార్తికదీపం సీరియల్ నుంచి ప్రేమ ఎంత మధురం సీరియల్ వరకు అదే ఫార్ములాను అనుసరిస్తున్నాయి.

తెలుగు టీవీ సీరియళ్లు దాదాపుగా ఒకే ఫార్ములాతో రూపొందినట్లు కనిపిస్తున్నాయి. పాపులర్ సీరియల్స్ అన్నీ ఒకే ఫార్ములాను అనుసరిస్తున్నట్లు అనిపిస్తోంది. సంఘటనలు మాత్రం విభిన్నంగా ఉంటాయి. ఎక్కువగా పాపులర్ అయిన కార్తికదీపం సీరియల్ నుంచి ప్రేమ ఎంత మధురం సీరియల్ వరకు అదే ఫార్ములాను అనుసరిస్తున్నాయి
undefined
ఒక్క మగాడి చుట్టూ ఇద్దరు ఆడవాళ్లు తిరిగే ఫార్ములా అది. కార్తికదీపంలో దీప, కార్తిక్ చిన్న అనుమానంతో విడిపోయి పదేళ్లు అవుతుంది. విహారీ అనే కవితో దీపకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కార్తిక్ ఆమెను దూరం పెడుతాడు. ఆ అనుమానం కలగడానికి మోనిత అనే గైనకాలిజస్టు పథక రచన చేసి అమలు చేస్తుంది. దీప తన అత్తతో కలిసి కార్తిక్ అనుమానాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తుంటే, మోనిత ఆ అనుమానాన్ని పెంచి పోషిస్తూ ఉంటుంది. నమ్మకానికి, అపనమ్మకానికి మధ్య జరిగే ఈ సీరియల్ మలుపు తీసుకుంటూ చాంతాడులో సాగుతూనే ఉన్నది.
undefined
ఇక మరో సీరియల్ గృహలక్ష్మి. ఈ సీరియల్ లో పచ్చిన తులసి కాపురంలో లాస్య చిచ్చు పెడుతోంది. తులసి భర్త నందును ఆమె వలలో వేసుకుంటుంది. పైగా, లాస్యను తన భర్తతో పాటు తన ఇంట్లోనే తులసి ఉండనిస్తుంది. లాస్యకు, తులసికి మధ్య ఘర్షణ, వారిద్దరి పట్ల నందు అనే వ్యక్తికి ఉండే అభిప్రాయం కారణంగా సీరియల్ ముందుకు సాగుతూ ఉంది. తులసికి విడాకులు ఇప్పించి లాస్య నందును పెళ్లి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు, చెప్పాలంటే కుట్రలతో సీరియల్ కొనసాగుతూ ఉంటుంది.
undefined
గట్టిగా మాట్లాడితే, ఉద్వేగానికి గురైతే గుండెపోటు వచ్చే నందును లాస్య తన సొంతం చేసుకోవాలనుకోవడం కొంచెం ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. అదే సమయంలో గృహలక్ష్మి అంటే అన్ని కష్టాలనూ భరిస్తూ, భర్త మరో స్త్రీతో తన ఇంట్లోనే ఉంటున్నా భరిస్తూ అపారమైన సహనం వహించే స్త్రీ అనే అర్థం వచ్చేలా సీరియల్ సాగుతూ ఉంటుంది. దానికి కుట్రతో శ్రుతి అనే అమ్మాయిని ప్రేమికుడి నుంచి విడదీసి తాను పెళ్లి చేసే వ్యక్తి కథ కూడా తోడైంది.
undefined
మరో సీరియల్ కల్యాణ వైభోగం. ఇద్దరు కవల అమ్మాయిల స్టోరీ ఇది. జై అనే అత్యంత ధనవంతుడి చుట్టూ ఆ ఇద్దరు ప్రేమ కథ నడుస్తూ ఉంటుంది. ఇందులో ట్విస్ట్ ఓ కవల అమ్మాయి పుట్టుకతోనే తల్లికి దూరమవుతుంది. జైకి ఇచ్చి పెళ్లి చేసి, తొలి రాత్రి సంభోగం జరగగానే భార్య మరణిస్తుంది. దానివల్ల తన కూతురి లాగే ఉండే మరో అమ్మాయితో పెళ్లి చేయించి, ఆమె చనిపోయిన తర్వాత తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనుకునే ఓ ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త ప్లాన్ చేస్తుంది. అయితే, ఆ అమ్మాయిని చంపేసి జై పక్కన చేరాలని ఆ మహిళా పారిశ్రామికవేత్త కూతురు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇద్దరు యువతులు ఒకే పురుషుడిని కోరుకునే కథతో మలుపులు తీసుకుంటూ నెలల తరబడిగా కొనసాగుతోంది.
undefined
మరో సీరియల్ ప్రేమ ఎంత మధురం. తిరుగులేని బిజినెస్ మ్యాన్ ఆర్య కోసం ఇద్దరు యువతులు పోటీ పడే కథ. ఆర్య కార్యాలయంలో పనిచేసే మీరా అతన్ని కోరుకుంటుంది. అయితే, అనుకోకుండా ఓ యువతి ఆమెకు ఆటంకంగా మారుతుంది. ఆ యువతిని ఆర్య ఇష్టపడుతుంటాడు. ఆ యువతిని పక్కకు తప్పించడానికి మీరా అడుగడుగునా ప్రయత్నాలు సాగిస్తూ ఉంటుంది. ఇలా మలుపులు తిరుగుతూ ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ సాగుతూనే ఉంది.
undefined
వీటిలో చాలా వరకు పురుషుడు కోరుకునే మహిళ ఒకతే ఉంటుంది. వారిద్దరు దగ్గర కాకుండా మరో స్త్రీ అడ్డుపడుతూ ఉంటుంది. ఒక్క గృహలక్ష్మిలో మాత్రం నందు అనే పురుషుడు బార్య తులసిని అమితంగా ఇష్టపడుతూనే లాస్య అనే మహిళను కోరుకుంటూ ఉంటాడు. ఇది నందు అనే పురుషుడు ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి రాకపోవడం వల్ల కథ మూందుకు సాగుతూ ఉంటుంది.
undefined
ఇటువంటి సీరియల్స్ ఇంకా ఉండవచ్చు. కానీ అమితంగా తెలుగులో పాపులర్ అయిన సీరియల్స్ ను మాత్రమే ప్రస్తావించడమైంది. దేవత కూడా దాదాపుగా ఇటువంటి కథే. ఈ సీరియల్స్ వచ్చే సమయాల్లో దాదాపు అన్ని ఇళ్లలోనూ స్త్రీలు టీవీలకు అతుక్కుపోతుండడం పరిపాటిగా మారింది. దానివల్ల సీరియల్స్ ఎప్పుడు ముగుస్తాయో తెలియదు. ఎన్ని ఏళ్లు సాగుతాయో కూడా అర్థం కాదు. రేటింగ్ తగ్గితే వాటి ప్రసార సమయాలను మారుస్తూ ఉంటారు. ఏమైనా టీవీ సీరియల్స్ వల్ల గతంలో పాపులర్ గా సాగే పత్రికల సీరియల్స్ కు ఎసరు పడింది.
undefined
click me!