తాజాగా జగన్ మోహన్ రెడ్డి సర్కారు మండలిలో ఖాళీ అవుతున్నస్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆరు ఖాళీలకుగాను పేర్లను ప్రకటించారు. మర్రి రాజశేఖర్, అప్పిరెడ్డి వంటి వారి పేర్లు లేకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించినప్పటికీ.... దానికన్నా మహమ్మద్ ఇక్బాల్ ని తిరిగి మరోమారు మండలి సభ్యత్వానికి ఖరారు చేయడం జగన్ రాజకీయ దూరదృష్టిని, వ్యూహాలను మన కండ్లకు కట్టినట్టుగా చూపెడుతుంది.
undefined
ఈ వ్యూహం మనకు అర్థం కావాలంటే... 2019 ఎన్నికల ఫలితాలను మనం ఒకసారి పరిశీలించాలి. ఆ ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో అపూర్వ విజయాన్ని సాధించింది. రాయలసీమలో అయితే మూడు స్థానాలు మినహా మిగతావన్నీస్వీప్ చేసింది. రాయలసీమలో టీడీపీ నుండి గెలిచింది చంద్రబాబు నాయుడు, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ మాత్రమే. జేసీ సోదరులు, పరిటాల కుటుంబీకులు వంటి రాజకీయ ఉద్దండులే జగన్ ఫ్యాన్ గాలిలోకొట్టుకుపోయారు.
undefined
ఇక ఈ ముగ్గురిలో కూడా గత పర్యాయం ఓడిన పయ్యావుల ఈ దఫా గెలిచారు. చంద్రబాబు మెజారిటీ సైతం గణనీయంగా తగ్గింది. కానీ అనూహ్యంగా బాలకృష్ణ మెజారిటీ మాత్రం పెరిగింది. 2014 కన్నా మెజారిటీని 1000కి పైగాపెంచుకొని,దాదాపుగా 17,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సహజంగా టీడీపీకి హిందూపురం కంచుకోట. దానితోపాటుగా బాలకృష్ణ ప్రజాసమస్యలపై సారించిన దృష్టి ఈ విజయానికిమరో కారణం.
undefined
ఇకపోతే రాయలసీమలో పూర్తిగా ఫ్యాన్ గాలి వీచేలా చేసిన జగన్ మోహన్ రెడ్డికి హిందూపురం నియోజకవర్గం ఒక్కటే కొరకరాని కొయ్యగా మారింది. 2014, 2019 రెండు దఫాల్లో కూడా దాన్నిబాలకృష్ణకు చేజార్చుకోవడంతో... ఎలాగైనా అక్కడ వైసీపీ జెండాను రెపరెపలాడించాలని కంకణం కట్టుకున్నారు. అందుకే ఇక్బాల్ పేరును మరోమారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు.
undefined
ఇక్బాల్ విషయానికి వస్తే ఆయనొక మాజీ పోలీస్అధికారి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసారు. ఈ రిలేషన్ దృష్ట్యా టీడీపీలో చేరుతారని అంతా భావించారు కానీ ఆయన వైసీపీలో చేరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 2019లో హిందూపురం నుండి పోటీ చేసి ఓటమి చెందారు. ఇప్పుడు మరోమారు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. మున్ముందు ఆయనను మంత్రిని చేసి బాలయ్యను ఢీకొట్టాలనేది జగన్ ఆలోచనగా కనబడుతుంది.
undefined
హిందూపురం టీడీపీకి పెట్టని కోట. దానితోపాటుగా బాలకృష్ణ అక్కడి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ వారితో బాగానే మమేకమయ్యారు. ఆయన నేరుగా నియాజికవర్గాన్ని సందర్శించకున్నప్పటికీ... సమస్యల పరిష్కారానికి ఒక చిన్నపాటి వ్యవస్థనే ఏర్పాటు చేసారు. చూడాలి జగన్ మోహన్ రెడ్డి ఇక్బాల్ కి పదవిని ఇచ్చి అక్కడ బలం పుంజుకునేలా చేయడం ద్వారా బాలకృష్ణకు చెక్ పెట్టగలుగుతారో లేదో..!
undefined