జగన్ ను ఫాలో అవుతున్నకేసీఆర్: చింతమనేనికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి!

First Published Mar 16, 2020, 5:47 PM IST

రేవంత్ రెడ్డిని బయటకు రానీయకుండా జైల్లోనే ఉంచేందుకు కెసిఆర్ జగన్ ను ఫాలో అవుతున్నట్టుగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుంది. 

కరోనా ఎఫెక్ట్, ఏపీలో స్థానిక ఎన్నికల రగడ, తెలంగాణ అసెంబ్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానము ఇవన్నీ వెరసి మిగిలిన రాజకీయ విషయాలకు మీడియాలో అంత ప్రాముఖ్యత దక్కడం లేదు. ఇలా వాస్తవానికి ఒక హాట్ టాపిక్ గా మరలకేసిన ఒక విషయం.... వీటి దెబ్బకు మరుగున పడిందంటే అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారమే!
undefined
కేసీఆర్ తనయుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగురవేసిన కేసులో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కోర్టు బెయిల్ నిరాకరించింది. వాస్తవానికి మిగిలిన అందరితోపాటు రేవంత్ కి కూడా బెయిల్ వస్తుందని అందరూ భావించినప్పటికీ... రేవంత్ కి మాత్రం బెయిల్ రాలేదు.
undefined
గోపనపల్లి భూముల వ్యవహారంలో రేవంత్ పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన తనకున్న కిల్లర్ ఇన్స్టింక్ట్ తో కేటీఆర్ ని కూడా లాగుదామనుకొని, ఆయ్నఫార్మ్ హౌస్ పై డ్రోన్ ఎగురవేసి 111 జీవో కి తూట్లు పొడిచాడంటూ వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే!
undefined
రేవంత్ ఈ పని చేయడంపై కాంగ్రెస్ లోని సీనియర్ నేతలే ఆయనకు మద్ధతు పాలుకాకుండా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇది పీసీసీ పీఠం కోసం గొడవ. ఈ విషయాన్నీ పక్కనుంచితే... రేవంత్ కి బెయిల్ ప్రస్తుతానికి రాకున్నప్పటికీ.... ఆయనకు బెయిల్ ఇంకొద్ది రోజుల్లోనయినా వచ్చేలా కనబడుతుంది.
undefined
అప్పుడు ఆయన బయటకు వచ్చే ఆస్కారం ఉంది. ఇందుకోసమని రేవంత్ రెడ్డిని బయటకు రానీయకుండా జైల్లోనే ఉంచేందుకు కెసిఆర్ జగన్ ను ఫాలో అవుతున్నట్టుగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుంది.
undefined
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని ఎలాగయితే జైలుకి పంపించిన తరువాత ఉన్న పాత కేసులన్నీ తిరగదోడి ఆయనను లోపలే ఉంచారో.... ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టుగా కనబడుతుంది.
undefined
చింతమనేనిని ఒక కేసులో గనుక బెయిల్ వస్తే వెంటనే పిటి వారెంట్ తీసుకొని మరొక కేసులో అరెస్టు చేసేవారు. ఇలా చింతమనేనిని దాదాపుగా 66 రోజులపాటు జైలులోనే ఉంచారు. చింతమనేని విషయంలో జగన్ ప్రయోగించిన ఫార్ములానే కెసిఆర్ కూడా ప్రయోగిస్తున్నట్టు కనబడుతుంది.
undefined
టీవీ9 ఛానల్ రేవంత్ రెడ్డిపై ఉన్న కేసుల చిట్టాను చెబుతూ దాదాపు 63 కేసులు ఉన్నట్టుగా లెక్కతేల్చింది. జూబ్లిహిల్స్ హౌజింగ్‌ సొసైటీలో ఫోర్జరీ చీటింగ్‌ కేసులు, ట్రెస్‌పాస్‌, వివిధ ప్రాంతాల్లో భూకబ్జాలకు సంబంధిన కేసులు రేవంత్‌పై ఉన్నాయని ఆ మీడియా ఛానల్ లెక్కగట్టింది.
undefined
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 7 కేసులు, ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘనపై మరో కేసు, కొడంగల్‌లో 9, సైఫాబాద్ 10, గచ్చిబౌలి 4, జూబ్లిహిల్స్‌3, బంజారాహిల్స్‌ 3, అబిడ్స్ 3, సుల్తాన్‌ బజార్‌ 3, మద్దూర్ 3, పంజాగుట్ట 3, ఓయు పోలీస్‌ స్టేషన్‌లో మరో కేసు రేవంత్‌పై నమోదై విచారణ దశలో ఉన్నాయి.
undefined
ఇన్ని కేసుల నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఈ కేసులో బెయిల్ మంజూరయినప్పటికీ ఆయనను పిటి వారెంట్ పైన అదుపులోకి తీసుకొని మరల జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమండ్ కు తరలించే వీలుంటుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అయి 63 కేసుల్లో ఏదో ఒక కేసును ముందుకు తెచ్చి ప్రతిసారి ఇలా బెయిల్ రాగానే జైలుకు పంపించే యోచనలో ఉంది సర్కార్.
undefined
ఇన్ని కేసుల నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఈ కేసులో బెయిల్ మంజూరయినప్పటికీ ఆయనను పిటి వారెంట్ పైన అదుపులోకి తీసుకొని మరల జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమండ్ కు తరలించే వీలుంటుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అయి 63 కేసుల్లో ఏదో ఒక కేసును ముందుకు తెచ్చి ప్రతిసారి ఇలా బెయిల్ రాగానే జైలుకు పంపించే యోచనలో ఉంది సర్కార్.
undefined
పిటి వారెంట్ అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్. ఒక కేసులో శిక్షను అనుభవిస్తున్న లేదా ముద్దాయిగా ఉన్న వ్యక్తిని వేరే కేసులో కోర్టులో ప్రవేశ పెట్టడానికి కోర్టు ఈ వారెంట్ ను జారీ చేస్తుంది. ఈ వారెంటును తీసుకొని జైలు అధికారులకు చూపిస్తే వారు సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగిస్తారు. వారు వేరే కేసులో అతడిని న్యాయస్థానం ముందు ప్రవేశ పెడతారు.
undefined
ఇలా పిటి వారెంట్ ను తీసుకొని రేవంత్ కు బెయిల్ వచ్చే అవకాశం ఉందంగానే వేరే కేసులో జడ్జి ముందు ప్రవేశపెట్టి మళ్ళీ రిమండ్ కు తరలించాలని కేసీఆర్ సర్కార్ ఆలోచనలు చేస్తుంది.
undefined
ఇలా గనుక ఏదైనా కేసులో అతడు నేరస్తుడిగా ప్రూవ్ అయి ఒకవేళ గనుక రెండు సంవత్సరాల శిక్ష పడితే... ఆయన తన ఎంపీ పదవిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ విషయంగా కూడా తెరాస వర్గాలు తీవ్రమైన ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
undefined
మొత్తానికి ఇప్పటివరకు కేసీఆర్ ను జగన్ ఫాలో అవుతూ వచ్చారు. కానీ జగన్ ఫార్ములాను కూడా కేసీఆర్ ఫాలో అవుతుండడం విశేషం. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే.... రేవంత్ కి ఇప్పుడప్పుడు కష్టాలు తప్పేలా లేవు. ఆయన చుట్టూ ఉచ్చు బలంగా బిగుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో తెరాస సర్కార్ ఇలా బలమైన సాక్ష్యాలను సేకరిస్తున్న తరుణంలో సొంత పార్టీ నేతలెవ్వరూ కూడా ఆయనకు బాసటగా నిలవకపోవడం కాంగ్రెస్ లోని వర్గపోరు ఏ లెవెల్ లో ఉందొ మనకు అర్థమవుతుంది.
undefined
click me!