చంద్రబాబు మాస్టర్ ప్లాన్: ఏపీ పాలిటిక్స్ లోకి నారా బ్రాహ్మణి, సంకేతాలివే...

First Published | Mar 3, 2020, 12:00 PM IST

నెక్స్ట్ పార్టీ బాధ్యతలను ఎవరి చేతుల్లో పెట్టాలనే దానిపై తీవ్ర కసరత్తులు చేస్తున్నారు చంద్రబాబు. లోకేష్ ని ప్రొజెక్ట్ చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందడం వల్ల ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు పనికివస్తాడా అనే ఒక చర్చ విపరీతంగా నడుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రాజధాని పుణ్యమాని హాట్ టాపిక్ గా మారాయి. ఇదే సమయంలో టీడీపీ పూర్తి బరువు బాధ్యతలను అన్ని తానై టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు తన భుజ స్కంధాలపై మోస్తున్నాడు. తనయుడు లోకేష్ ఉన్నప్పటికీ... అతని మీద ఉన్న నెగటివ్ ఇమేజ్ వల్ల అంతలా సక్సెస్ కాలేకపోతున్నారు.
undefined
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తరువాత పార్టీని ఒక్కొక్కరిగా వీడుతున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు కొందరు వెళ్లి బీజేపీలో చేరారు కూడా. ఇక మిగిలిన క్యాడర్ ని కూడా కాపాడుకోవడానికి టీడీపీ విశ్వా ప్రయత్నాలే చేస్తుంది. రెండవ శ్రేణి నాయకులు చాలామంది ఇప్పటికే వీలైన చోటల్లా వైసీపీలోకి వెళ్లిపోయారు
undefined

Latest Videos


ఒక పక్క చంద్రబాబును చూస్తుంటేనేమో వయసు మీదపడిపోతుంది. ఆయన ప్రస్తుత వయసు 69 ఏండ్లు. ఇంకో నెలరోజులు ఆగితే ఆయన 70వ పదిలోకి అడుగుపెడతాడు. ఆయా ప్రస్తుతానికి చాలా ఆరోగ్యంగా ఉన్నారు. బహుశా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కూడా ఆయనే పార్టీని నడిస్తారేమో. కానీ ఆతరువాత మాత్రం వచ్చే ఎన్నికల నాటికయితే ఆయన 80 ఏళ్ల వయసులో పార్టీ బరువు బాధ్యతహలాన్నిటిని అయితే మోయలేరు కదా!
undefined
అందుకోసమే నెక్స్ట్ పార్టీ బాధ్యతలను ఎవరి చేతుల్లో పెట్టాలనే దానిపై తీవ్ర కసరత్తులు చేస్తున్నారు చంద్రబాబు. లోకేష్ ని ప్రొజెక్ట్ చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందడం వల్ల ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు పనికివస్తాడా అనే ఒక చర్చ విపరీతంగా నడుస్తుంది. దానికి తోడు ఎలాగూ అధికార పక్షం దాడి చేస్తూనే ఉంది. రకరకాల ముద్దు పేర్లతో ఆయనను పిలుస్తూ వ్యంగ్యంగా సంబోధిస్తూ ఇమేజ్ ని మరింత డామేజ్ చేస్తున్నారు.
undefined
ఇక మరి పార్టీ పగ్గాలను ఎవరికీ అప్పజెప్పాలని మల్లగుల్లాలు పడుతున్న చంద్రబాబుకు రకరకాల ఒప్షన్స్ ఉన్నప్పటికీ తన కుటుంబాన్ని దాటి పార్టీ పగ్గాలు బయటకు వెళ్లడం చంద్రబాబుకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. అందునా కష్టపడి నడుపుకుంటూ వచ్చిన పార్టీ. ఇలాంటి వేళ చంద్రబాబుకు ఎవరైనా ఆప్షన్ మిగిలి ఉన్నారు అంటే... అది ఖచ్చితంగా నారా బ్రాహ్మణీయే!
undefined
భువనేశ్వరిని తీసుకువద్దామనో లేదా ఎమోషనల్ కనెక్ట్ కోసమేనా భువనేశ్వరి ప్లాటినం గాజు సీన్ అంత రసవత్తరంగా పండలేదు. పై పెచ్చు ఆ ప్లాటినం గాజును సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసారు. వయసుపైబడుతున్నావేళ చంద్రబాబు ఇలా కోడలివైపు చూస్తున్నారు.
undefined
గతంలో బ్రాహ్మణి రాజకీయాల్లోకి అంటే ఎవరు అంత నమ్మేవారు కాదు. కానీ ఇప్పుడు అన్ని అంశాలను పరిశీలించి చూస్తే ఇప్పుడది నిజమేనా అనే సందేహం కూడా కలుగుతుంది. తాజాగా పార్టీలో బ్రాహ్మణి స్థానాన్ని ఎలివేట్ చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందా అంటే... అవుననే సంకేతాలే మనకు కనబడుతున్నాయి.
undefined
ఇప్పటివరకు హెరిటేజ్ బాధ్యతలు, మిగిలిన బిజినెస్ అంశాలను చూసుకుంటుంది బ్రాహ్మణి... గత కొద్దీ కాలంగా టీడీపీ అనుబంధ సోషల్ మీడియాలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఆమె ఆ టీం తో కలిసి పనిచేసినప్పటికీ ఎప్పుడు బ్యాక్ గ్రౌండ్ లోనే ఉండేది. ఎప్పుడు ముందుకు వచ్చేది కాదు.
undefined
కానీ తాజాగా జరిగిన టీడీపీ సోషల్ మీడియా విభాగం సమావేశంలో ఆమె భర్త లోకేష్ తో కలిసి పాల్గొన్నారు. ఆ సభలో వారితో కలిసి నెక్స్ట్ ప్రణాళికలను ఎలా రచించాలో డిస్కస్ చేసారు. ఆమె వారికి అనుసరించాల్సిన వ్యూహంపై వారి అభిప్రాయాలను స్వీకరిస్తూనే వారికి దిశా నిర్దేశం చేసారు.
undefined
ఈ సమావేశం తరువాత వారితో కలిసి గ్రూప్ సెల్ఫీ కూడా దిగింది బ్రాహ్మణి. ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా స్లో గా పార్టీలోకి తీసుకురావడం మొదలుపెట్టి ఆమెను నాయకత్వ స్థానానికి ఎలివేట్ చేసే ప్రయత్నాన్ని టీడీపీ చేస్తున్నట్టుగా కనబడుతుంది.
undefined
బహుశా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రాహ్మణి ఐడియాలకు స్థానం కల్పించేందుకు చూస్తూ ఉండొచ్చు టీడీపీ పార్టీ. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోనే ముందుకెళ్ళినప్పటికీ, దాని ప్లానింగ్ స్ట్రాటజీ మాత్రం బ్రాహ్మణివి ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
undefined
click me!