రెండు ఖాళీ: జగన్ కేబినెట్ లోకి విడదల రజిని, రోజా ... లెక్కలు ఇవీ!

First Published | Mar 15, 2020, 4:38 PM IST

ఆంధ్రప్రదేశ్ లోని ఇద్దరు మంత్రులు ఇప్పుడు రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో రెండు బెర్తులు ఖాళీ అవనున్నాయి. ఈ బెర్తులను దక్కించుకోవడానికి నేతలంతా ఇప్పుడు తమ ప్రియతమా నేత జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో చెలరేగిన హింస గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ చెలరేగిన హింసను చూసిన వారంతా నోళ్లెళ్లబెట్టారు. ఆఖరికి ఎన్నికల సంఘం కూడా స్థానిక ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై మాట్లాడింది.
undefined
కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ... స్థానిక ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై అధికారులను తీవ్రంగా హెచ్చరించింది. కొందరిని బదిలీ చేస్తూ, ఎన్నికల విధుల నుండి తప్పించిన కమిషన్... మాచర్ల సీఐ ని ఏకంగా సస్పెండ్ చేసింది.
undefined

Latest Videos


మొత్తానికి మరో ఆరువారాలపాటు ఎన్నికలు వాయిదా పడ్డాయనేది స్పష్టం. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరగడం మనకందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈసారి ఎందుకో ప్రతిష్ట కాస్త ఎక్కువయినట్టు, నేతలెందుకో తామేమిటో చూపెట్టుకోవడం కోసం చేసినట్టుగా కనబడుతుంది.
undefined
నేతలు అలా తమ బాస్ ని ప్రసన్నం చేసుకోవాలనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. జగన్ కేబినెట్ లో ఉన్న ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ ఇద్దరిని జగన్ రాజ్యసభకు నామినెటే చేసారు
undefined
మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసిన నేపథ్యంలో... ఎమ్మెల్సీలుగా ఉన్న పిల్లి, మోపిదేవిలను రాజ్యసభకు పంపాలని తీర్మానించి వారిని రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించేసారు. ఈ నెలాఖరుకు, లేదా ఏప్రిల్ మొదటి వారంలోనే వారు ప్రమాణస్వీకారం కూడా చేసేస్తారు.
undefined
ఇక ఆంధ్రప్రదేశ్ లోని ఇద్దరు మంత్రులు ఇప్పుడు రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో రెండు బెర్తులు ఖాళీ అవనున్నాయి. ఈ బెర్తులను దక్కించుకోవడానికి నేతలంతా ఇప్పుడు తమ ప్రియతమా నేత జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
undefined
మంత్రులను రెండున్నరేళ్ళకు మారుస్తాం. కొత్తవారికి అవకాశం ఇస్తాం అని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్‌ బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు ఇలా అనూహ్యంగా ఇద్దరు సభ్యులు ఖాళీ అవుతుండడంతో ఆ రెండు బెర్తులను దక్కించుకోవడానికి అందరూ ఉబలాటపడుతున్నారు. ఈ బెర్తులకు కూడా ఎవరి ఈక్వేషన్స్ వారేసుకుంటున్నారు. పిల్లి, మోపిదేవిలు ఇద్దరు కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలు. మోపిదేవి గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కాగా... పిల్లి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి.
undefined
వీరిరువురికి మంత్రిపదవులు ఇవ్వడానికి కారణం.... వైఎస్ కుటుంబానికి వారు నమ్మకస్తులుగా అన్ని పరిస్థితుల్లోనూ జగన్ తో పాటుగా ఉన్నారు. మోపిదేవి జైలుకు కూడా వెళ్ళాడు అందుకే వారి మంత్రి పదవులకు గండం వచ్చినా వారిని రాజ్యసభకు పంపిస్తున్నాడు.
undefined
పిల్లి సుభాష్ చంద్ర బోస్ ని గనుక తీసుకుంటే... ఆయన రామచంద్రపురం నియోజకవర్గం నుండి గతంలో గెలిచారు. ఈసారి ఆయన పోటీ చేయలేదు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లానుండి పినిపి విశ్వరూప్, తానేటి వనిత, కురసాల కన్నబాబు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించకపోయినా, జిల్లాకు ఒక మంత్రి బెర్తు పోయినా ఇప్పటికిప్పుడు అక్కడ రాజకీయ సమీకరణాలు ఏమి మారవు.
undefined
ఇక మోపిదేవి విషయానికి వస్తే... ఆయన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. గుంటూరు జిల్లా నుండి ఇప్పుడు మోపిదేవి వెళ్లిపోవటంతో ఒక్కరు మాత్రమే మంత్రి ఉంటారు. ప్రత్తిపాడు నుండి మేకతోటి సుచరిత హోమ్ మంత్రిగా కొనసాగుతున్నారు. దానికి తోడు గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతాన్ని ఆనుకొని ఉండడం, రామజకీయ చైతన్యం ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు గుంటూరు జిల్లా నుండి ఒకరికి మంత్రి పదవిని జగన్ ఖచ్చితంగా ఇచ్చే ఆస్కారం ఉంది.
undefined
ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు ఈ మోపిదేవి ఖాళీ చేసిన బెర్తు కోసం పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురూ కూడా జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు, ఆయన కంట్లో పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఒకరు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఒకరు. ఆయన మాచర్ల పరిధిలోని అన్ని స్థానాలను పోటీ లేకుండా ఏకగ్రీవం చేయాలనీ తీవ్రంగానే ప్రయత్నం చేసి జగన్ దృష్టిలో పడేందుకు తీవ్ర ప్రయత్నం చేసారు. బోండా ఉమా, బుద్ధ వెంకన్నలపై దాడి జరిగింది కూడా ఇక్కడే.
undefined
ఇక మరో వ్యక్తి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి. జగన్ తొలి కేబినెట్ లోనే మంత్రి పదవిని ఆశించారు ఆళ్ళ. నారా లోకేష్ ను ఓడించిన జైంట్ కిల్లర్ గా రెండవసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు ఆళ్ళ. అయినా ఆ ఛాన్స్ మిస్ అయింది. కోర్టులో కేసులు వేయడం మొదలు ప్రజావేదికను కూల్చడం వరకు అన్ని తానై ముందుంటున్నాడు ఆర్కే. ఈసారి అమరావతి వివాదం కూడా తోడవడంతో ఆ విధంగానయినా ఆ ప్రాంతం వాడిని కాబట్టి మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నాడు.
undefined
కాకపోతే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. ఆయన అన్న అయోధ్య రామిరెడ్డికి తాజాగా జగన్ రాజ్యసభ బెర్తును ఇచ్చారు. ఇలా రాజైసభ బెర్తును కట్టబెట్టడం వల్ల ఏమైనా తన అమాత్య పదవికి భంగం కలుగుతుందేమో నాని చిన్న టెన్షన్ మాత్రం పడుతున్నారు.
undefined
ఇక మూడవ వ్యక్తి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని. ఈమె కూడా ప్రత్తిపాటి పుల్లారావుని ఓడించి జైంట్ కిల్లర్ గానే అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. ఈమె చాలా తెలివిగా ఎప్పటి నుండో పావులు కదుపుతోంది. మహాశివరాత్రి సందర్భంగా అక్కడ ప్రభలను ఏర్పాటు చేసే విషయం తెలిసిందే. ఆ ప్రభల విషయంలో ఆమె టీడీపీ వారిని బలంగా టార్గెట్ చేసారు అని అంటున్నారు. తద్వారా ఆమె జగన్ దృష్టిని ఆకర్షించారు. జగన్ దృష్టిలో బలమైన ముద్రని వేసుకోగలిగారు.
undefined
ఇది గుంటూరు జిల్లా పరిస్థితి. ఇక ఖాళీ అవుతున్న మరో మంత్రి పదవి కోసం రోజా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆమెకు జగన్ కు ఇప్పటికే సన్నిహిత సంబంధాలున్నాయి. ఆమె కూడా మంత్రి పదవి కోసం తన ప్రయత్నాలను ఇప్పటికే మొదలుపెట్టేసింది కూడా.
undefined
ఇక పిల్లి ఖాళీ చేస్తున్నది కేవలం మంత్రి పదవి మాత్రమే కాదు. అది ఉపముఖ్యమంత్రి పదవి కూడా. జగన్ తన ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను సామాజిక వర్గీకరణల ఆధారంగానే తీసుకున్నారు. ఇప్పుడు పిల్లి బయటకు వెళ్లడంతో బీసీ ఉపముఖ్యమంత్రి పోస్టు ఖాళీ అవుతుంది. దానితో విడదల రజిని తనకు మంత్రి పదవి గ్యారంటీ అని సంతోష పడుతున్నారు. ఆమె బీసీ అవడం, గుంటూరు జిల్లాకు చెందిన నేత అవడం వల్ల తనకు పదవి ఖాయం అని అంటున్నారు. పోటీ పడుతున్న మిగిలిన వారంతా అగ్రవర్ణాలు కావడంతో ఆమె తనకు లైన్ క్లియర్ అని భావిస్తున్నారట.
undefined
ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తరువాతే ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పుడు ఆరు వారాలు వాయిదా పడడంతో అమాత్య పదవిని ఆశించిన వారంతా ఇప్పుడు మళ్ళీ వెయిట్ చేయక తప్పదు.
undefined
click me!