ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి గెలిచిన టీఆర్ఎస్: కేసీఆర్ కు వార్నింగ్ బెల్స్

First Published Mar 21, 2021, 1:28 PM IST

తెలంగాణలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలను తెరాస చేజిక్కించుకున్నందుకు తెరాస నాయకత్వం సంబరాల్లో మునిగిపోయినప్పటికీ... తెరాస కు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్న విషయాన్ని వారు గుర్తించాలి. 

తెలంగాణలో ఆసక్తికరంగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నాలుగవ రోజు సాయంత్రానికి ముగిసింది. అధికార తెరాస రెండు నియోజకవర్గాల్లోనూ విజయం సాధించింది. నల్గొండ - వరంగల్ - ఖమ్మం నియోజకవర్గం తెరాస సిట్టింగ్ సీటు కాగా... మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ సీటును మాత్రం బీజేపీ నుంచి చేజిక్కించుకుంది. తెలంగాణలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలను తెరాస చేజిక్కించుకున్నందుకు తెరాస నాయకత్వం సంబరాల్లో మునిగిపోయినప్పటికీ... తెరాస కు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్న విషయాన్ని వారు గుర్తించాలి.
undefined
ఈ ఎన్నికల్లో గనుక తీసుకుంటే... రెండు స్థానాల్లోనూ బహుముఖ పోరుగా ఈ ఎన్నిక సాగింది. మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ స్థానంలో వాణీదేవి, రామచంద్ర రావు , ప్రొఫెసర్ నాగేశ్వర్ ల మధ్య పోరు సాగింది. ద్విముఖ పోరుగానే అనిపించినప్పటికీ... నాగేశ్వర్ కి భారీ స్థాయిలోనే ఓట్లు పోలయ్యాయి. ఇక నల్గొండ - వరంగల్ - ఖమ్మం స్థానం విషయానికి వస్తే పల్లా, కోదండరాం, తీన్ మార్ మల్లన్నల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. చివరి వరకు కూడా పల్లా, మల్లన్నల మధ్య తీవ్రమైన పోటీ చోటు చేసుకుంది.
undefined
అంతే కాకుండా తెరాస రెండు చోట్లా కూడా రెండవ ప్రాధాన్యతా ఓట్లతో అది కూడా స్వల్ప తేడాతోనే గెలిచింది. అంతే కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు విపరీతంగా నమోదయింది. పోలింగ్ శాతం అధికంగా ఉండడంతో పాటుగా ఇతర అభ్యర్థులకు వచ్చిన ఓట్లను చూస్తే మనకు ఈ విషయం తేటతెల్లమవుతుంది. రెండు మూడు స్థానాల్లో ఉన్న అభ్యర్థుల ఓట్లను కలిపినా అవి తెరాస కు వచ్చిన ఓట్ల కన్నా చాలా అధికంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను బట్టి చూస్తుంటే ఒక విషయం మాత్రం సుస్పష్టం.
undefined
పోటీ బహుముఖంగా సాగడం వల్ల మాత్రమే తెరాస బయటపడింది. పోరు గనుక ద్విముఖంగా సాగి ఉంటే.... ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా గంపగుత్తగా పడి తెరాస ఓటమిపాలయ్యేది. తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నిక, దుబ్బాక ఎన్నిక ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అద్భుత విజయాన్ని సాధించడానికి కూడా కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడమే.
undefined
కాంగ్రెస్ అనేది రాష్ట్రంలో లేకుండా చేయడం ద్వారా ప్రతిపక్షం అనేదాన్ని లేకుండా చేయాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రస్తుతం చతికిల పడ్డప్పటికీ... ప్రతిపక్ష స్థానంలో ఇప్పుడు బీజేపీ వచ్చి కూర్చుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ పూరించింది. కాంగ్రెస్ బలహీన పడడంతో తెరాస కు డైరెక్ట్ ప్రత్యర్థిగా బీజేపీ మారడంతో బీజేపీ వర్సెస్ తెరాస గా సాగిన దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలిచింది, తెరాస ఓడింది.
undefined
ఇక మరో అంశం ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందొ ఈ ఎన్నిక మన కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టింది. తీన్ మార్ మల్లన్న, కోదండరాం లకు వచ్చిన ఓట్లను, అవతలి వైపు రామ చందర్ రావు, నాగేశ్వర్ కి వచ్చిన ఓట్లను చూస్తే అర్థమవుతుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులు, ఇతర స్వతంత్ర అభ్యర్థులు అదనం. యువతలో అందునా నిరుద్యోగుల్లో పేరుకుపోయి ఉన్న అసంతృప్తికి ఇది అద్దం పడుతుంది. ఇప్పటికైనా తెరాస నాయకత్వం ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని కోర్స్ కరెక్షన్ చేసుకోకపోతే భవిష్యత్తులో పెను సవాలుగా మారవచ్చు.
undefined
click me!