కొండా విశ్వేశ్వర రెడ్డి ఎఫెక్ట్: రేవంత్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు

First Published Mar 17, 2021, 8:12 PM IST

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని ఆశించి రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అప్పట్లో ఆయనకు అది అందినట్టే అంది దూరమయింది. ఒకవేళ పదవి రాకపోతే నూతన పార్టీ ఏర్పాటు చేయాలని ఆయన గతంలోనే యోచించారు, అందుకోసం ఒక చిన్నపాటి సర్వే కూడా చేపించారు.

తెలంగాణ రాజకీయాలు మంచి రసకందాయంలో ఉన్నాయి. దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించిన ఊపులో బీజేపీ పట్టు కోల్పోతున్నట్టుగా కనబడుతుంది అధికార తెరాస. ఇక గమ్యం తెలియని, చుక్కాని లేని నావలా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో సరైన నాయకత్వం లేక డీలా పడిపోయారు కాంగ్రెస్ నేతలు.
undefined
ఇక ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఎంట్రీ ఇచ్చింది షర్మిల. రాజన్న రాజ్యం అంటూ తెలంగాణలో నూతన పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. అందుకు సంబంధించిన పనులన్ని వేగంగా జరిగిపోతున్నాయి కూడా. షర్మిల పొలిటికల్ పార్టీ దెబ్బకు రాష్ట్రంలో రాజకీయాల రూపు రేఖలు ఎలా మారబోతున్నాయో అంటూ అంతా చర్చించుకుంటుండగానే.... తాజాగా రాష్ట్రంలో మరో కొత్త పార్టీ స్థాపన గురించి చర్చ ప్రారంభమయింది.
undefined
రాష్ట్రంలో మరో పార్టీనా అని ఆశ్చర్యపోకండి. అందుకోసం గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతున్నట్టు సమాచారం వినబడుతుంది. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఈ కొత్త ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుండడంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. తాజాగా జరిగిన మరో సంఘటన దీనికి మరింత బలం చేకూరుస్తుంది.
undefined
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని ఆశించి రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అప్పట్లో ఆయనకు అది అందినట్టే అంది దూరమయింది. ఒకవేళ పదవి రాకపోతే నూతన పార్టీ ఏర్పాటు చేయాలని ఆయన గతంలోనే యోచించారు, అందుకోసం ఒక చిన్నపాటి సర్వే కూడా చేపించారు. కానీ ఎందుకో ఆ తరువాత అది ముందుకు సాగలేదు. ఇప్పుడు మరోమారు ఆయన పార్టీ ఏర్పాటుచేసే అంశం బలంగా తెరమీదకు వచ్చింది.
undefined
తాజాగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేసారు. కానీ ఏ పార్టీలో కూడా చేరలేదు. ఆయన వాస్తవానికి బీజేపీలో చేరుతారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ... అది మాత్రం జరగలేదు. ఆయన కొంతకాలం వేచి చూడనున్నట్టు చెప్పారు. విశ్వేశ్వర్ రెడ్డి బయటకు వచ్చి బీజేపీలో చేరకపోవడానికి కారణం రేవంత్ పెట్టబోయే పార్టీనే అనే మాట వినబడుతుంది.
undefined
రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతానంటే బీజేపీ ఆహ్వానించదా అనే సాధారణ ప్రశ్న తలెత్తొచ్చు. కానీ బీజేపీ నాయకత్వ పగ్గాలు రేవంత్ చేతికి మాత్రం వెళ్లవు. సంస్థాగత నేతల చేతిలోనే పగ్గాలు ఉంటాయి. స్వభావం దృష్ట్యా రేవంత్ ఎప్పుడూ సెకండ్ ప్లేస్ తీసుకోవడానికి ఇష్టపడడు. ఆయన దేన్నైనా తానే పోరాడి సాధించాలనే వ్యక్తిత్వం కలవాడు.కాబట్టి వేరే ఏ పార్టీలో... అటు తెరాస లో కానీ ఇటు బీజేపీలో కానీ ఇమడలేక సొంత పార్టీ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్టు కనబడుతుంది. విశ్వేశ్వర్ రెడ్డి మూడు నెలలపాటు వేరే పార్టీలో చేరకుండా వేచి చూస్తాను అని అన్నారు. బహుశా ఈ మూడు నెలల్లోనే రేవంత్ పార్టీపై ఒక నిర్ణయం వెలువడే అవకాశము కనబడుతుంది.
undefined
click me!