కేసీఆర్ ఒకే ఒక్కడు: మిగతా సీఎంలకు లేని ముందుచూపు

First Published | Apr 13, 2020, 3:27 PM IST

తాజాగా ఈ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లాక్ డౌన్ ని కొనసాగించాలని కోరినప్పటికీ వ్యవసాయ రంగాన్ని మాత్రం మినహాయించాలని కోరారు. 

ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకు కుదేలవుతోంది. కరోనా మహమ్మారికి మందులేకపోవడంతో ప్రపంచమంతా లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. భారతదేశం కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక అదే లాక్ డౌన్ బాట పట్టిన విషయం తెలిసిందే.
undefined
ఇక తాజాగా ఈ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లాక్ డౌన్ ని కొనసాగించాలని కోరినప్పటికీ వ్యవసాయ రంగాన్ని మాత్రం మినహాయించాలని కోరారు.
undefined

Latest Videos


ఇప్పటికే దేశంలో వ్యవసాయ రంగానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కోతల సమయం కావడంతో హార్వెస్టర్ యంత్రాలను ట్రాక్టర్లకు ఎక్కించే మెకానిక్ ల నుండి స్పేర్ పార్ట్శ్ అమ్మే షాపుల వరకు చాలా వాటికి మినహాయింపులు ఇచ్చారు. ప్రధాని అధికారికంగా లాక్ డౌన్ పై రేపటిలోగా చేసే ప్రకటనలో, లేదా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే నోటిఫికేషన్లో దీనిపై ఖచ్చితంగా ఒక నిర్ణయం ఉండనుంది.
undefined
ఇక ఇప్పుడు వ్యవసాయానికి ప్రభుత్వం ఖచ్చితంగా రిలాక్సేషన్ ఇవ్వనుందనేది అయితే తథ్యం. ఇప్పటికే రైతులంతా తమ పంటను కోసి ఉన్నారు. మిగిలిన కొద్ది మంది కోతలు కోస్తున్నారు. ఇలా కోతలు కోసేటప్పుడు వారికి అత్యవసరమైనది లేబర్. లేబర్ అంతా ఇప్పటికే ఎక్కడివారు అక్కడకు వెళ్లిపోయారు.  లేబర్ లేరు. లేబర్ లేకపోవడంతో కోతలకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సరే లేబర్ లేకపోయినా, కొత్త మచిలను పెట్టి కోతలు  ఆ తరువాత వాటిని అమ్ముకోవడం ఇప్పుడు రైతుల ముందున్న అతిపెద్ద సమస్య.
undefined
లాక్ డౌన్ మరో 15 రోజులపాటు కొనసాగనుంది. వ్యవసాయ మార్కెట్లన్నీ కూడా ఉండేది పట్టణాల్లో వాటిని ఇప్పుడు తెరిచే పరిస్థితి లేదు. అక్కడిదాకా తీసుకెళ్లడానికి ముఖ్యంగా రవాణా సదుపాయం లేదు. మార్కెట్లు తెరుచుకోక, రవాణా సదుపాయం లేక రైతులు అల్లాడిపోతున్నారు.  అసలే అకాల వర్షాలు పడే కాలం ఇది. ఇలాకాల వర్షాలు గనుక కురిస్తే రైతు సంవత్సరం పాటు చేసిన కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
undefined
పోనీ ప్రభుత్వమే కొంటుంది అని అనుకుందామా అంటే.... అన్ని రాష్ట్ర ప్రభుత్వలు పూర్తి పంటను కొంటాము అని చెప్పడంలేదు. ఎకరానికి 13 క్వింటాల్ గోధుమలు మాత్రమే కొంటాము అని చెబుతుంది. అంతకు ఎక్కువున్న పంటను రైతు ఎం చేయాలి? (పంట మోస్తరుగా పండినప్పుడు ఎకరాకు 18 నుంచి 20 క్వింటాల్ గోధుమలను పండించేందుకు ఆస్కారం ఉంటుంది)
undefined
ఇక కొందరు రైతులదీ ఇంకో సమస్య. ఉదాహరణకు ఉల్లిగడ్డలను పండించే రైతు (ముఖ్యంగా మహారాష్ట్ర రైతులు) వారికి లబోరు కష్టం కాకపోవచ్చు, ఉల్లిని వారు ఎలాగూ ఆరబెట్టాలి కాబట్టి లాక్ డౌన్ కూడా ఇబ్బంది కాకపోవచ్చు. కానీ లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత అందరూ రైతులు ఒకేసారి మార్కెట్ మీద పడితే అప్పుడు ఉల్లి రేటు గణనీయంగా తగ్గి మరల రైతుకు మిగిలేది కన్నీరే అవుతుంది.
undefined
ఇలా ఇప్పుడు రైతులందరికీ తమ ఒపంటను అమ్ముకోవడం ఒక ప్రధాన సమస్యగా మారింది. ఇలా అన్ని రాష్ట్రాల రైతులు ఇబ్బందులు పడుతున్నవేళ తెలంగాణ రాష్ట్ర రైతులు మాత్రం తమ పంటను తమ ఊర్లోనే అమ్ముకుంటున్నారు.
undefined
ఇలా లాక్ డౌన్ ముగియడానికి వస్తున్న తరుణంలో నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు లాక్ డౌన్ ను ఒక వారం నుండి రెండు వారల పాటు పొడిగించాలని కోరారు.
undefined
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అన్ని పంటలు(తెలంగాణాలో మొక్కజొన్న,వరి, పత్తి ప్రధాన పంటలు)కొనడానికి ముందుకు వచ్చారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుందని రైతులకు భరోసా ఇచ్చారు.
undefined
undefined
KCR
undefined
ఇలా ఈ లాక్ డౌన్ సమయంలో అన్ని రాష్ట్రాల రైతులు తమ పంటలను ఎలా అమ్ముకోవాలి అని టెన్షన్ పడుతుంటే... తెలంగాణ రైతులు కూడా వర్క్ ఫ్రొం హోమ్ ని ఎంజాయ్ చేస్తూ తమ గ్రామంలోనే తమ పంటను అమ్ముకుంటున్నారు.
undefined
click me!