ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుడి భుజం, ఎడమ భుడం కూడా ఆయనే ఆయ్యారు. ఆయనే ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. పైకి చాలా మెత్తగా కనిపిస్తారు. సున్నితంగా మాట్లాడుతారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. చంద్రబాబు తీరును, టీడీపీ వ్యవహారశైలిని ఆయన సున్నితంగానే అయినా ఘాటుగా విమర్శిస్తూ ఉంటారు. YS Jagan ప్రభుత్వంలోనూ, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలోనూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
ఇంతకు ముందు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి వైఎస్ జగన్ కు తోడునీడగా ఉండేవారు. జగన్ తర్వాత విజయసాయి రెడ్డినే చెప్పుకునేవారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. విజయసాయి రెడ్డి మీద Sajjala Ramakrishna Reddy పైచేయి సాధించారు. Vijayasai Reddy స్థానాన్ని మెల్లగా ఆయన ఆక్రమించినట్లు కనిపిస్తున్నారు. విజయసాయిరెడ్డి చెప్తే జగన్ చెప్పినట్లు అనుకునేవారు. కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్తే జగన్ చెప్పినట్లు భావిస్తున్నారు. ఇంతకీ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరనే ప్రశ్న ఉదయించక మానదు.
వృత్తిరీత్యా జర్నలిస్టు అయిన సజ్జల రామకృష్ణా రెడ్డి రాజకీయాల్లో ఆరితేరినట్లు కనిపిస్తున్నారు. ఏపీ ఉద్యోగులను బెదిరించారనే విషయంలో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. కానీ ఏపీ ఉద్యోగులు సజ్జల రామకృష్ణా రెడ్డిని వెనకేసుకొచ్చారు. ఏపీ ఉద్యోగులను ఆయన ఫోన్ చేసి బెదిరించినట్లు విమర్శలు వస్తాయి. సజ్జల రామకృష్ణా రెడ్డి పైకి చూస్తే అలా కనిపించరు. కానీ, పైకి ఎంత మెత్తగా కనిపిస్తారో లోపల అంత కరుకుగా వ్యవహరిస్తారని అర్థమవుతోంది.
sajjaసజ్జల రామకృష్ణా రెడ్డి కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలం ముసాల్ రెడ్డిపల్లిలో 1958 జూన్ 16వ తేదీన జన్మించారు. వైఎస్ జగన్ ఇలాకా పులివెందులలోనే ఆయన పాఠశాల విద్య సాగింది. తల్లిదండ్రులకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు పుట్టిన తర్వాత సజ్జల రామకృష్ణా రెడ్డి చివరి సంతానంగా జన్మించారు. తండ్రి సాధారణమైన ఉద్యోగి. పోస్టు మాస్టర్ గా పనిచేశారు. సజ్జల కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చేశారు. la
సజ్జల రామకృష్ణా రెడ్డి తన పాత్రికేయ వృత్తిని ఈనాడులో సబ్ ఎడిటర్ గా ప్రారంభించారు. ఆ తర్వాత ఆంధ్రభూమిలో సబ్ ఎడిటర్ గా పనిచేసారు. ఉదయం దినపత్రికలో 1985లో చీఫ్ సబ్ ఎడిటర్ గా చేరారు. ఆయన ఉదయం దినపత్రికలో డెస్క్ ఇంచార్జీగానూ రిపోర్ట్స్ బ్యూరో ఇంచార్జీగానూ పనిచేశారు. ఉదయం దినపత్రిక మూతపడిన సమయంలో ఉద్యోగ సంఘాన్ని వెనక ఉండి నడిపించింది కూడా ఆయనే అంటారు. ఉదయం ఉద్యోగల సంఘానికి ఒక రకంగా ఆయన సలహాదారుగా పనిచేశారు. పైకి మాత్రం కనిపించేవారు కాదు. ఉదయం మూతపడిన తర్వాత ఆయన గ్రానైట్ వ్యాపారం చేశారు. దూరదర్శన్ కు కొన్ని టీవీ సీరియల్స్ కూడా తీశారు.
వైఎస్ జగన్ 2014లో సాక్షి దినపత్రికను ప్రారంభించారు. దానికి సజ్జల రామకృష్ణా రెడ్డి ఎడిటోరియల్ డైరెక్టర్ గా పనిచేశారు. జగన్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించిన తర్వాత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ప్రారంభించారు. ఓ వైపు Sakshi ఎడిటోరియల్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తూనే మరో వైపు వైసీపీ రాజకీయ సలహాదారుగా, వైఎస్ జగన్ రాజకీయ సలహాదారుగా పనిచేస్తూ వచ్చారు. సాక్షి మీడియాకు సీనియర్ జర్నలిస్టు కె. రామచంద్రమూర్తి ఎడిటోరియల్ డైరెక్టర్ గా నియమితులైన తర్వాత పూర్తి ఆయన సాక్షి నుంచి తప్పుకున్నారు.
ఆయన YSRCP రాజకీయ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. అదే సమయంలో వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ (టీడీపీ)పై, ఆ పార్టీ అధినేత Chandrababuపై ఆయన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఆయన రాజకీయాలు మాట్లాడవచ్చునా, ఓ రాజకీయ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడవచ్చునా అనేది కూడా వివాదంగా మారింది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. తన వైఖరిని ఎప్పటిలాగే కొనసాగిస్తూ వస్తున్నారు
మంగళవారంనాడు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు కూడా సజ్జల రామకృష్ణా రెడ్డే ముందుకు వచ్చారు. TDP నేత పట్టాబి చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. తమకు సచివాలయంలో ఆర్థిక మంత్రి గానీ, ఉన్నతాధికారి గానీ కనిపించరు, సజ్జల రామకృష్ణా రెడ్డే కనిపిస్తారని ఎపీ ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారంటే ఆయన ప్రాధాన్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద, ఏపీ రాజకీయాలు వైఎస్ జగన్ చుట్టు మాత్రమే కాదు, సజ్జల రామకృష్ణా రెడ్డి చుట్టు కూడా తిరుగుతున్నాయి.