ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి సంస్థాగతంగా బలంలేదు. కేంద్రంలో అధికారంలో ఉండడం, మోడీ చరిష్మాల ఆధారంగా ఉనికి చాటుకుంటున్నారు. కానీ సోము వీర్రాజు ఎంట్రీ దెబ్బకు ఏపీ బీజేపీలో నూతన జోష్ వచ్చినట్టుగా కనపడుతుంది. ఆయన పగ్గాలు చేపట్టింది మొదలు వార్తల్లో బీజేపీ సెంటర్ స్టేజి మీదకువచ్చింది.
undefined
ఆయన దూకుడు పెంచుతూ రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీ ఇరు పార్టీలపైనా తన దాడి చేస్తున్నారు. టీడీపీకి వైసీపీకి సమన దూరంతో బీజేపీ వ్యవహరిస్తుందనే ఇండికేషన్ని మొదటి నుండే ఇస్తున్న సోము వీర్రాజు అదే వాణిని వినిపిస్తున్నాడు.
undefined
ఇక తాజాగా ఆయన ఢిల్లీ వెళ్లి అక్కడ తన మార్కు రాజకీయాలకు ఆమోదముద్ర వేయించుకురావాలని భావిస్తున్నాడు. ఆయన నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు.ఆయన ఆయన ఢిల్లీలో జాతీయ నాయకులందరినీ వరుసబెట్టి కలుస్తున్నారు.
undefined
ఇక ఆయన ఢిల్లీలో ఉండగానే ఏపీ బీజేపీ యూనిట్ వారి అధికారిక హ్యాండిల్నుంచి ఒక ట్వీట్ చేసింది. అది ఇప్పుడు సంచలనంగా మారింది. అచ్చం కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ ని టార్గెట్ చేయడానికి ఏ విధమైన అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారో.... ఇక్కడ సైతం అదేవిధమైన అస్త్రాన్ని ప్రయోగిస్తోంది బీజేపీ.
undefined
వారు కేంద్రంలో కాంగ్రెస్ పై వంశపారంపర్య రాజకీయాల అస్త్రాన్ని ఎలా ప్రయోగిస్తున్నారో ఇక్కడ ఏపీలో కూడా అదే అస్త్రాన్ని టీడీపీ, వైసీపీలపైప్రయోగించారు. ఇరు పార్టీలను తాము సమదూరాన్నిపాటిస్తున్నామనిచెప్పడంతోపాటుగా, బీజేపీలో ఎవరైనా అధ్యక్షుడవ్వొచ్చనే ఇండికేషన్ ని ఇస్తున్నారు.
undefined
టీడీపీకి ఎప్పటికైనా అధ్యక్షుడు చంద్రబాబు లేదా ఆయన కొడుకు లోకేష్ అని, వైసీపీకి జగన్ మోహన్ రెడ్డే అధ్యక్షుడు అని సోమువీర్రాజువ్యాఖ్యానించారు. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా ఆయన ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఇటు టీడీపీకి అటు వైసీపీకి పంచ్ వేశారు.
undefined
ఆయన అటు టీడీపీ నేతలకు ఇటు వైసీపీ నేతలకు వరుస పంచ్ లు వేస్తూ దూసుకుపోతున్నాడు. ఇరు పార్టీల నేతలకు కూడా కంటి మీద కునుకు లేకుండాస్ చేయడమే కాకుండా, తమ రాజకీయాలు వేరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు వరకు ఒకలెక్క, ఇప్పటినుండి ఒక లెక్క అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు.
undefined
సోము వీర్రాజు....కన్నా లక్ష్మీనారాయణలా పార్టీమారి వచ్చిన నేత కాదు. బీజేపీ లోని ఒక హోమ్ గ్రోన్ లీడర్. ఆయనకు బీజేపీ రాజకీయాలు నరనరాన ఇమిడిపోయి ఉంటాయి. బీజేపీ మార్కు రాజకీయాలుఆయనకు వెన్నెతో పెట్టిన విద్య.
undefined
అంతేకాకుండా ఆయన ఇప్పుడు తనదైన ముద్రను సైతం వేయాలనుకుంటున్నాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న హరిబాబు కాలంలో బీజేపీకి పెద్దగా ఒరిగింది లేదు. ఆ తరువాత కన్నా లక్ష్మీనారాయణ హయాంలో కాపు రాజకీయాలను చేద్దామనుకున్నప్పటికీ.... అది సాధ్యపడలేదు.
undefined
ఇప్పుడు సోమువీర్రాజు వంతు వచ్చింది. ఆయన ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని తనదైన ముద్రను వేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు తనని తాను నిరూపించుకోవడంతోపాటుగా బీజేపీని బలపరచాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఆ ఉద్దేశంతోనే ఆయన దూసుకుపోతున్నట్టుగా కనబడుతుంది.
undefined