అమూల్ తో ఒప్పందం: చంద్రబాబు ఫ్యామిలీ హెరిటేజ్ కు జగన్ చెక్

First Published Jul 28, 2020, 3:39 PM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమూల్ తో ఒప్పందం కుదిరిన సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. తమ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎందరో ప్రజల జీవితాలు బాగుపడతాయని, మహిళల సశక్తీకరణకు ఇది ఉపయోగపడుతుందని అంటూనే... గత ప్రభుత్వం పాడి పరిశ్రమలోని సహకార సంఘాలని నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. 

అమూల్ పాల గురించి తెలియని భారతీయుడు ఉండడుఅంటే అతిశయోక్తి కాదు. చిన్న సహకార సంఘంగా ప్రారంభమైన అమూల్ డైరీ ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ బ్రాండ్. అలనాడు వర్గీస్ కురియన్ కృషి, రైతుల కష్టపడే తత్వం అన్ని వెరసి అమూల్ ను ఒక బ్రాండ్ గా నిలబెట్టాయి.
undefined
తాజగా అమూల్ పాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని పాడి రైతులను మరింత శక్తివంతులుగా తాయారు చేసేందుకు, మహిళా సాధికారతకు పెద్ద పీటవేసేందుకు అమూల్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.
undefined
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమూల్ తో ఒప్పందం కుదిరిన సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. తమ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎందరో ప్రజల జీవితాలు బాగుపడతాయని, మహిళల సశక్తీకరణకు ఇది ఉపయోగపడుతుందని అంటూనే... గత ప్రభుత్వం పాడి పరిశ్రమలోని సహకార సంఘాలని నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు.
undefined
సొంత హెరిటేజ్కంపెనీ బాగు కోసం రాష్ట్రంలోని సహకార రంగాన్నిపూర్తిగా నిర్వీర్యం చేసారని విమర్శించారు. తమ కంపెనీ హెరిటేజ్ఏకఛత్రాధిపత్యంతో కంపెనీని నడపటానికి, చంద్రబాబు రాష్ట్రంలోని పాడి రైతులను ఇబ్బందులకు గురిచేసాడన్నారు జగన్.
undefined
2014కు ముందే హెరిటేజ్ లో వాటాను ఫ్యూచర్ గ్రూప్ కి అమ్మినప్పటికీ... పాలఉత్పత్తులకు సంబంధించిన పగ్గాలు చంద్రబాబు కుటుంబం చేతిలోనే ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారంలోకి వచ్చినప్పటి నుండి హెరిటేజ్ ఫుడ్స్ కి లాభం కలిగించేందుకు చంద్రబాబు పూనుకున్నారని, ఇందులో అవినీతి జరిగిందని పదే పదే వైసీపీ వారు ఆరోపిస్తున్నారు.
undefined
తాజాగా హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల విషయంలో ప్రభుత్వం సిబిఐ ఎంక్వయిరీకి కూడా ఆదేశించిన విషయం తెలిసిందే. హెరిటేజ్ ఫుడ్స్ లో ఎవరికో సికారోనా సోకిందని క్నాద్రబాబును నిలదీయడం, రంజాన్ తోఫాల్లో హెరిటేజ్ ప్రొడక్ట్స్ పంచారని ఇలా రకరకాల ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో.... అమూల్ తో చేసుకున్న ఈ ఒప్పందం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది.
undefined
ప్రభుత్వ కార్యకలాపాల్లో హెరిటేజ్ ఫుడ్స్ ఉత్పత్తులు ఎక్కువగా కనిపించేవి. చంద్రన్న సంక్రాంతి కనుక, రంజాన్ తోఫాల్లో కూడా ఇవి ఉండేవి. కంపెనీ న్యాయ బద్ధంగా వీటిని టెండర్ ద్వారా దక్కించుకుందా, లేదంటే అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిందా అనే విషయం పై విచారణకు ప్రస్తుత ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
undefined
అమూల్ కంపెనీతో భాగస్వామ్యం ద్వారా జగన్ రెండు రకాలైన లాభాలను పొందగలుగుతున్నారు. మొదటగా ప్రతిపక్షం జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. రివర్స్ టెండరింగ్ నుండి మొదలు అంబులెన్సులను ఆరోబిందోకి ఇవ్వడం దగ్గరి వరకు.
undefined
కానీ ఇప్పుడు అమూల్ కి ఇవ్వడం వల్ల జగన్ ప్రతిపక్షం విమర్శలను తప్పించుకున్నట్టే. అమూల్ ప్రభుత్వ రంగ సంస్థ. సహకార సంఘం. రైతులకు లాభాలార్జించి పెట్టడంలో ముందుంది. ఇలాంటి సంస్థతో చేసుకున్న ఒప్పందం గురించి ప్రతిపక్షం ఎటువంటి ఆరోపణ చేయలేదు.
undefined
ఇక రెండవది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ కి ఒక బలమైన పోటీ వచ్చినట్టవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో రోజుకి 4 కోట్ల లీటర్ల పాలుఉత్పత్తి అవుతాయి. దేశంలో పాల ఉత్పత్తిలోనాలుగవ స్థానాల్లో ఉంది ఆంధ్రప్రదేశ్. అయినప్పటికీ... కేవలం 24 శాతం పాలు మాత్రమే వ్యవస్థీకృత రంగానికి చేరుతున్నాయి.
undefined
ఇప్పుడు అమూల్ ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్ లో డైరీ సెక్టార్ రూపు రేఖలు మారిపోనున్నాయి. రైతులకు అధిక లాభం రావడం ఒకెత్తయితే, మార్కెట్లో కాంపిటీషన్ పెరుగుతుంది. పోటీ వల్ల ఉత్తమ ధర చెల్లించినవారికి మాత్రమే రైతు తన పాలను అమ్ముకునే వీలుంటుంది.
undefined
ఆంధ్రప్రదేశ్ లో పాడి పరిశ్రమ రంగానికి జగన్ సర్కార్ భారిస్థాయిలోనే నిధులను మంజూరు చేస్తుంది. మహిళా గ్రూపులకు చేయూత, ఆసరాల కింద రుణాలను మంజూరు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో మరింత మంది పాడి పరిశ్రమ వైపు అడుగులేసే వీలుంటుంది.
undefined
click me!