ఏపీ నుంచి రాజ్యసభ సీటు కొట్టేసిన పరిమల్ నత్వాని: జగన్ కు మొండిచేయి!

First Published | Apr 3, 2020, 10:30 AM IST

కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ, రాష్ట్రంతో సంబంధమున్నవారందరు సహాయాలు చేస్తుండగా... తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరి నుండి బాగా లాభం పొంది, ఏకంగా రాజ్యసభ పదవినే అందిపుచ్చుకున్న పరిమల్ నత్వాని మాత్రం ఇంతవరకు ఏ విధమైన సహాయం చేయలేదు. 

కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య. ఈ వైరస్ అంతకంతకు వ్యాపిస్తూ మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ వైరస్ కి మందు లేకపోవడంతో.... ఈ వైరస్ బారిన పడకుండా ఉండడమే ఏకైక మార్గంగా భావించిన దేశాలు పూర్తిగా లాక్ డౌన్ ని ప్రకటించాయి.
undefined
భారతదేశం కూడా ప్రస్తుతానికి 21 రోజుల లాక్ డౌన్ లో ఉంది. విదేశాల నుంచి వచ్చినవారిని, వారితో దగ్గరగా ఉన్నవారిని క్వారంటైన్ చేస్తూ పరిస్థితి అదుపులో ఉంది అని అనుకుంటుండగానే నిజాముద్దీన్ బాంబు పేలింది.
undefined

Latest Videos


అక్కడ తబ్లిగ్ సంస్థ ప్రార్థనలకు అటెండ్ అయిన వారిలో చాలామంది కరోనా వైరస్ ను వారి సొంతూళ్లకు మోసుకెళ్లడంతో ఇప్పుడు కరోనా వైరస్ మూడవ స్టేజి ను తలపిస్తుంది. కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా ఇబ్బందికరంగా ఉంది.
undefined
ఇలా ఈ మర్కజ్ వెళ్ళివచ్చినవారిలో చాలా మంది ఆంధ్రప్రాదేశ్ రాష్ట్రంవారు కూడా ఉండడంతో.... ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోయాయి. తెలంగాణలో నమోదవుతున్న కేసులతో దాదాపుగా సమానంగా నమోదవుతున్నాయి.
undefined
ప్రస్తుతానికి తెలంగాణలో 129 కేసులు నమోదు కాగా... ఏపీలో 143 కేసులుగా ఉన్నాయి. తబ్లీఘి జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారే ఈ అత్యధిక కేసులకు కారణమనేది ప్రాథమికంగా తెలియవస్తుంది.
undefined
ఇన్ని రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా లేవు అనుకుంటున్నా తరుణంలో నిజాముద్దీన్ బాంబు పేలడంతో ఇప్పుడు పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది.
undefined
అసలే కొత్త రాష్ట్రం. ఆర్ధిక లోటుతో కొట్టు మిట్టాడుతోన్న రాష్ట్రం. ఇప్పుడు ఇలా లాక్ డౌన్ మూలిగే నక్కమీద తాటికాయ పెద్దది అన్నట్టుగా తయారయ్యింది. ఉత్పత్తి ఆగిపోవడంతో ఇప్పుడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది.
undefined
ఆర్ధిక పరిస్థితి బాగాలేదని చెప్పింది స్వయానా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారే! ఆయనే ప్రధాన మంత్రి తోని తమకు ఆర్ధిక సహాయం అందించాలని అభ్యర్థించారు కూడా.
undefined
ఇక ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర పరిపాలనను సాగించడంతోపాటుగా కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసరాలను అందించడం ప్రభుత్వ బాధ్యత. ఉత్పత్తి కూడా లేకపోవడంతో... తడిసి మోపెడవుతుంది.
undefined
ఈ తరుణంలో రాష్ట్రానికి సంబంధించినవారంతా విరాళాలు ఇస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కి ధారాళంగా విరాళాలు ఇస్తున్నారు. అటు మేఘ కృష్ణ రెడ్డి నుండి మొదలు ఇటు రామోజీ రావు వరకు అందరూ ఈ ఆపద సమయంలో తమ వంతుగా ఇస్తున్నారు.
undefined
కానీ... కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ, రాష్ట్రంతో సంబంధమున్నవారందరు సహాయాలు చేస్తుండగా... తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరి నుండి బాగా లాభం పొంది, ఏకంగా రాజ్యసభ పదవినే అందిపుచ్చుకున్న పరిమల్ నత్వాని మాత్రం ఇంతవరకు ఏ విధమైన సహాయం చేయలేదు.
undefined
కానీ... కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ, రాష్ట్రంతో సంబంధమున్నవారందరు సహాయాలు చేస్తుండగా... తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరి నుండి బాగా లాభం పొంది, ఏకంగా రాజ్యసభ పదవినే అందిపుచ్చుకున్న పరిమల్ నత్వాని మాత్రం ఇంతవరకు ఏ విధమైన సహాయం చేయలేదు. ఆయనింకా ఎంపీ కాలేదు కదా, అయి ఉంటే... ఎంపీ నిధులను ఇచ్చే వారు అనే అనుమానం కలగొచ్చు. కానీ ఆయన స్వతహాగా పారిశ్రామికవేత్త. రిలయన్స్ గ్రూప్ లో ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు.
undefined
ఆయన ఇవ్వదలుచుకుంటే.... ఎలాగైనా ఇవ్వొచ్చు. కనీసం రిలయన్స్ సంస్థతోనయినా మాట్లాడి ఇప్పించొచ్చు. కానీ అటువంటి చర్యలేమి కనపడడం లేదు. నత్వానికి సీట్ ఇచ్చిన వెంటనే... రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువలా వస్తాయని వైసీపీ నేతలు బాకాలు ఊదారు. కానీ అటువంటి దాఖలాలేవీ కూడా కనపడడం లేదు.
undefined
విజయసాయి రెడ్డి ట్వీట్లను రిట్వీట్ చేయడం, జగన్ ను ట్విట్టర్లో మెచ్చుకోవడం మినహా ఆయన ఆంధ్రప్రదేశ్ కి చేసింది ఏమీ లేదు. కొడుకు ధనరాజ్ నత్వాని మాత్రం రిలయన్స్ సంస్థను ఒప్పించి అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కి 1.5 కోట్లు ఇప్పించాడు.
undefined
కనీసం అంత కూడా ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వలేడా ..? రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధానమంత్రి సహాయ నిధికి 500 కోట్ల విరాళం ఇచ్చారు. అందులో ఒక్క శాతం ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినా ఎంతో ఉపయుక్తంగా ఉండేది.
undefined
click me!