హంటా వైరస్: వ్యాధి లక్షణాలు, ఎలా వ్యాపిస్తుందంటే...

First Published | Mar 24, 2020, 5:10 PM IST

హంటా వైరస్ గురించి వివిధ రకాల ప్రచారాలు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి. వాట్సాప్ లో ఫార్వార్డులు రకరకాల భాషల్లో ప్రచారంలో ఉన్నాయి. అందులో నిజాలు తక్కుఇవా అబద్ధాలు ఎక్కువ. ఈ ఫేక్ న్యూస్ బారిన పడకుండా అసలు దాని గురించిన నిజాలు మీకోసం. 

చైనా నుంచి దిగుమతయ్యి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తోనే ప్రపంచం వణికిపోతుంటే.... చైనాలో తాజాగా పుట్టిబున మరో వైరస్ ఇప్పుడు డేంజర్ బెల్స్ ని మోగిస్తుంది. తాజాగా చైనాలో ఒక వ్యక్తి ఈ హంటా వైరస్ బారిన పడి మరణించడంతి ప్రపంచం బెంబేలెత్తిపోతోంది.
undefined
ఈ హంటా వైరస్ గురించి వివిధ రకాల ప్రచారాలు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి. వాట్సాప్ లో ఫార్వార్డులు రకరకాల భాషల్లో ప్రచారంలో ఉన్నాయి. అందులో నిజాలు తక్కువ అబద్ధాలు ఎక్కువ. ఈ ఫేక్ న్యూస్ బారిన పడకుండా అసలు దాని గురించిన నిజాలు మీకోసం.
undefined

Latest Videos


ఈ హంటా వైరస్ ఎలుకల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఆరోగ్యవంతుడైన మనిషికి కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఇంటి చుట్టుపక్కల ఉండే ఎలుకలు, పందికొక్కుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.
undefined
కరోనా వైరస్ కన్నా ఇది తక్కువగా సోకే ప్రమాదముందని చెప్పవచ్చు. దానికొక ప్రధాన కారణం ఏదైనా ఉందంటే... ఈ వైరస్ కరోనా మాదిరి మనిషి నుంచి మనిషికి సోకదు. ఎలుకలు, పందికొక్కుల్ని కానీ వాటి వ్యర్థాలను కానీ తాకిన తరువాత అప్పుడు ఆ చేతులతో మన కండ్లు, ముక్కు, నోరు ఏదైనా తాకితేనే ఈ వైరస్ మనిషికి సోకుతుంది. అంతే తప్ప మనిషి నుంచి మనిషికి మాత్రం సోకదు.
undefined
ఇక ఈ హంటా వైరస్ లక్షణాలను గనుక పరిశీలిస్తే... ఇందులో కూడా జలుబు, జ్వరం వంటి లక్షణాలు కామన్ గా కనిపిస్తాయి తొలినాళ్లలో. పూర్తి లక్షణాలు బయట పడడానికి 1 నుంచి 8 వారల సమయం పడుతుంది. తర్వాతి దశల్లో కండరాల నొప్పి తీవ్రతరమవుతూ... ఊపిరితిత్తుల్లో ద్రవాలు చేరుకపోయి ఊపిరి తీసుకోవడం కధాతమవుతుంది.
undefined
ఈ వైరస్ ని కూడా గుర్తించడం కష్టం. సాధారణ ఫ్లూ లాగానే దీని లక్షణాలు ఉంటాయి. కాబట్టి కాంఫుసే అయ్యే ప్రమాదముంది. ఈ వైరస్ సోకినా మనుషుల్లో 38 శాతం మంది మృత్యువాత పడతారు. కాబట్టి ఇది కరోనా కన్నా చాలా ప్రమాదకారి అనడంలో ఎటువంటి సంశయం లేదు.
undefined
ఇక ఈ హంట వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఉన్న ఏకైక ఆప్షన్... ఎలుకల నుండి దూరంగా ఉండడం. మనం పనిచేసే చోట కానీ, నివసించే చోట కానీ ఎలుకలకు దూరంగా, ఎలుకలు లేకుండా చూసుకోవడం మంచిది. ఈ వైరస్ మానుషాల నుంచి మానుషాలకు సోకదు అనేది ఇప్పటివరకు అందరికి ఒకింత ఉపశమనం కలిగించేలా చేస్తుంది.
undefined
భారత దేశంలో కరోనా వైరస్ ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాల ప్రజల వల్ల వ్యాపిస్తే... వారినే తొలుత పట్టుకుంటే... ఈ హంట వైరస్ మాత్రం పెద్ద, దారిద్య్ర రేఖ దిగువన ఉన్నవారికి సోకె ప్రమాదముంది. ముఖ్యంగా ఎలుకలను చంపి తినే ఇరులా తెగ ప్రజలు ఈ వ్యాధి బారిన అధికంగా పడే ప్రమాదం ఉంది.
undefined
click me!