వైసీపీ నుంచి వెలివేత: జగన్ మీద రఘురామ భవిష్యత్తు వ్యూహం ఇదీ....

First Published Jul 20, 2020, 2:41 PM IST

అన్ని పరిణామాల తరువాత రఘురామా కృష్ణంరాజు లోక్ సభలో ఊరికే అయితే కూర్చోరు. ఆయన తాజా వ్యాఖ్యలను గనుక పరిశీలిస్తే మనకు ఈ విషయం అర్థమయిపోతుంది. లోక్‌సభలో జరిగే చర్చల్లో పాల్గొనే అవకాశం పార్టీ తనకు ఇవ్వదన్నది స్పష్టం అన్న విషయం తనకు తెలుసునని అన్నాడు. 

రఘురామకృష్ణం రాజు- ఆయనిప్పుడొక హాట్ టాపిక్. కరోనా వేగంగా వ్యాపిస్తూ, మరణాలు సైతం భారీ స్థాయిలో నమోదవుతున్న వేళ సైతం రఘురామా గురించిన రాజకీయ అంశాలు చర్చకు రావడం, దాన్ని ప్రజలందరూ ఆసక్తితో గమనిస్తూ ఉండడం రాష్ట్రంలో ఆ రెబెల్ ఎంపీ విషయంలో క్రియేట్ అయిన బజ్ ని మనకు చెప్పకనే చెబుతున్నాయి.
undefined
ఆయనను పార్టీ ఒకరకంగా వెలివేసిందనే చెప్పవచ్చు. ఆయన తాను జగన్ కి వీర విధేయుడనని చెబుతున్నప్పటికీ.... వైసీపీ మాత్రం ఆయనను ఇప్పుడు చేరదీసేపరిస్థితులు మాత్రం లేవు. వైసీపీ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తుంటే మనకు ఈ విషయం అర్థమవుతుంది.
undefined
ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని లోక్ సభ స్పీకర్ కి ఫిర్యాదు చేయడం దగ్గరినుండి లోక్ సభలో ఆయన సీటును వెనక్కి మార్పించడం వరకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించలేదన్న ఒక్క మాట తప్ప... ఆయనను పార్టీ దూరం పెట్టేసినట్టే!
undefined
ఈ అన్ని పరిణామాలు చోటుచేసుకుంటున్నా నేపథ్యంలో...రఘురామ తన సీటును వెనక్కి జరిపించడం పై మండిపడుతూ,‘సింహం ఎక్కడ కూర్చొంటే అదే సింహాసనం' వంటి డైలాగులు పేలుస్తునే జగన్ మా నాయకుడు అని అంటున్నాడు.
undefined
ఈ అన్ని పరిణామాల తరువాత రఘురామా కృష్ణంరాజు లోక్ సభలో ఊరికే అయితే కూర్చోరు. ఆయన తాజా వ్యాఖ్యలను గనుక పరిశీలిస్తే మనకు ఈ విషయం అర్థమయిపోతుంది.లోక్‌సభలో జరిగే చర్చల్లో పాల్గొనే అవకాశం పార్టీ తనకు ఇవ్వరన్నది స్పష్టం అన్న విషయం తనకు తెలుసునని అన్నాడు.
undefined
తనకు తన పార్టీ అవకాశం ఇవ్వకున్నప్పటికీ....ఎంపీగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి అవకాశం తెచ్చుకుంటానని అన్నాడు. సమస్యను స్పీకర్‌కు వివరించి సభలో మాట్లాడే అవకాశం తెచ్చుకోగలనన్న విశ్వాసం తనకు ఉందని అన్నాడు.
undefined
ఇకపై ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ సమయంలో మరిన్ని ప్రజాసమస్యలను దేశం దృష్టికి తీసుకువచ్చేందుకు తనకు అవకాశం దక్కుతుందని, అదేవిధంగా ప్రత్యేక అంశాలనూ లేవనెత్తేందుకు ఆస్కారం ఏర్పడుతుందని రఘురామ అన్నారు
undefined
బహుశా బీజేపీతో తనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా ఈ మాట అని ఉండొచ్చు. ఆయన ఈ మాట ఏదో ఊరికేఅన్నదయితే కాదు. దాని వెనుక ఒక మంచి ప్లాన్ అయితే ఉండే ఉంటుంది. ఈ మాటల ప్రకారంగా మనకు ఖచురితంగా ఒక విషయం మాత్రం తేటతెల్లం. ఆయన లోక్ సభలో ఇక మీదట మాట్లాడతాడు. ఆయన తన లింక్స్ ని ఉపయోగించుకొని సమయం దక్కించుకోవడం తథ్యం.
undefined
రాజధాని విషయంలో కూడా రఘురామ కృష్ణంరాజు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం అంటూనే మానిఫెస్టో రూపకర్త ఉమ్మారెడ్డి కూడా దీన్ని సమర్థించారని అన్నారు. తనకు ఛాన్స్ ఇస్తే కలిసి వివరిస్తాను అంటూనే ఇది ఆమోద యోగ్యం కాదంటున్నారు.
undefined
ఆయన సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బాధ్యతహలు సంచయిత చేతుల్లోకి వెళ్ళినప్పటినుండి గోశాలలో ఆవులు మరణిస్తున్నాయని అన్నారు. అక్కడితో ఆగకుండా ఆయన త్వరలోనే తిరిగి ఆ బాధ్యతలు చేపడుతారు అని అన్నారు.
undefined
అమరావతిలో రామాలయ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం ఇచ్చిన రఘురామ తాజాగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి సైతం తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ అన్ని పరిస్థితులను గమనిస్తుంటే.... హిందుత్వం అనే జెండాను లోక్ సభలో వైసీపీకి వ్యతిరేకంగా ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు. తన పోస్టును బాలశౌరికి ఇవ్వడం పై కూడా మతం మార్చుకున్న అనే పదాన్ని వాడారు. దీన్నిబట్టి అది ఇంకా స్పష్టం.
undefined
ఇక మరో అంశం జగన్ మీద కేసులు. జగన్ అవినీతిపై పోరాటం అంటుంటే.. ప్రతిపక్షాలుగతంలో కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన కేసుల గురించి జగన్ ను విమర్శిస్తున్నారని, వాటినుంచి ఆయన అగ్నిపునీతుడిగా బయటకు వస్తారని అన్నారు.
undefined
ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆయన కనీసం కాపు రేజర్వేషన్ల గురించి మాట్లాడడం లేదని, అయన ఒక రెండు మార్లు లేఖలు రాసి ఇప్పుడు ఏకంగా కాపు ఉద్యమం నుండి తప్పుకుంటున్నట్టు చెప్పడం జగన్ సర్కారుకు మేలు చేయడమే అని అంటున్నారు.
undefined
ఈ కేసులను మూడు నెలల్లోనే పరిష్కరించాలని కోరితే బాగుంటుందని తన మనసులోని మాటను బయటపెట్టారు. కాబట్టి ఆయన ఈ విషయాన్నీ సైతం లోక్ సభలో ఎత్తినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే వైసీపీ అధినేతపై ఒక రకంగా స్తబ్దుగా ఉన్నకేసును తెరవాలని వైసీపీ ఎంపీ లోక్ సభ సాక్షిగా కోరనున్నారన్నమాట.
undefined
చూడబోతుంటే ఇదేరఘురామా వ్యూహంలాగా కనబడుతుంది. ఆయన ఇప్పుడు ఈ అన్ని అజెండాలతో వైసీపీ లైన్ లోనే కూర్చొని జగన్ మా నాయకుడు, తాను వైసీపీ ఎంపీనిఅంటూనే వైసీపీ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తారన్నమాట. ఏపీ వరకే పరిమితమైన ఈ రచ్చ ఇప్పుడు పార్లమెంటుకెక్కనుందన్నమాట.
undefined
click me!