గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ నేడే: జగన్ కు మింగుడు పడని పరిణామం

First Published | Jul 20, 2020, 9:16 AM IST

తీర్పు వెలువడగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ని కలవడానికి అపాయింట్మెంట్ కోరారు. నేడు ఆయన గవర్నర్ ని కలవనున్న విషయం తెలిసిందే. దీనితో ఇప్పుడు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని ఒక చర్చ మొదలయింది. 

ఆంధ్రప్రదేశ్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. ఆయన పునర్నియామకానికి సంబంధించి కోర్టుల్లో జరిగిన వ్యవహారం మనందరం చూసిందే. ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ ఈ విషయంలో రాజకీయ విమర్శ, ప్రతివిమర్శలకు దిగడంతో ఈ విషయం రాజకీయ రంగును కూడా పులుముకుంది.
undefined
తనను ఎస్ఈసీగా నియమించకుండా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారంనాడు హైకోర్టు విచారించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే నిరాకరించినా నిమ్మగడ్డను ఏపీ ఎస్ఈ‌సీగా ఎందుకు నియమించలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.ఏపీ గవర్నర్ ను కలవాలని ఏపీ హైకోర్టునిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆదేశించింది.
undefined

Latest Videos


ఈ కేసులో మూడు దఫాలు సుప్రీంకోర్టు స్టేకు నిరాకరించినా కూడ ఎందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసీగా నియమించలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎందుకు నియమించలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించిన లాయర్ తమకు నియమించే అధికారం లేదని చెప్పారు.
undefined
ఇక ఈ తీర్పు వెలువడగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ని కలవడానికి అపాయింట్మెంట్ కోరారు. నేడు ఆయన గవర్నర్ ని కలవనున్న విషయం తెలిసిందే. దీనితో ఇప్పుడు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
undefined
నిమ్మగడ్డ ఇప్పుడు గవర్నర్ ని కలిసి తనను పునర్నియమించమని చెబుతారు. కోర్టు ఆదేశాల ప్రకారం గవర్నర్ ఆయనను పునర్నియమించవలిసి ఉంటుంది. కానీ ఇక్కడే కొందరు ఒక వింత వాదనను తెర మీదకు తీసుకొస్తున్నారు.
undefined
నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుజనా చౌదరి, కామినేనిలను కలిశారు కాబట్టి ఆయన ప్రవర్తన అభ్యంతకరంగా ఉందని, అందువల్ల ఆయనను తిరిగి పునర్నియమయించకూడదు అని అంటున్నారు.
undefined
ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ కొనసాగుతుండగా ఆయన వారిని అలా కలవడం అభ్యంతరకరమే. అందులో ఎటువంటి సంశయం అవసరం లేదు. ఆయన అలా కలవడం తప్పవుతుందా, ఒప్పవుతుందా అని చెప్పాల్సింది కోర్టు.కోర్టు ఈ విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
undefined
కాబట్టి ఈ వాదనలు కుదరవు. ఆయన తనను నియమించామని కోర్టు ఉత్తర్వు ఉంది కాబట్టి గవర్నర్ నియమించవలిసిందే. ఆ తీర్పు లోని టెక్నికల్ అంశాలతోమరోసారి సాగదీయడం కూడా ఇప్పుడు కుదరకపోవచ్చు. ఎందుకంటే.... గత సుప్రీమ్ తీర్పుల ప్రకారం తీర్పును తప్పుగా ఇంటర్ప్రెట్ చేయడం కూడా తప్పే అవుతుంది.
undefined
కాబట్టి ఇప్పుడు నిమ్మగడ్డ తనను నియమించమని గవర్నర్ ని కలిస్తే ఆయన ఖచ్చితంగా నిమ్మగడ్డను తిరిగి నియమించవలిసిందే. గవర్నర్ వేరుగా ప్రవర్తించడానికి కూడా వీలు లేదు. ఖచ్చితంగా కోర్టు ఉత్తర్వులను అమలు చేయవలిసిందే.
undefined
మరో అంశం ఏమిటంటే... కోర్టు తన ఉత్తర్వుల్లో ఎన్నికల కమీషనర్ అనే పోస్ట్ ని ఖాళీగా ఉంచడమేంటి అని ప్రశ్నించింది. అంటే జస్టిస్ కనగరాజ్ నియామకం చెల్లదు అని తెలిపింది కూడా. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పోస్టును ఎన్నికల వేళ ఖాళీగా ఉంచడంపై కోర్టు సీరియస్ కూడా అయింది.
undefined
ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఇప్పుడు నిమ్మగడ్డను నియమించి తీరాల్సిందే. లేకుంటే అది కోర్టు ధిక్కరణ అవుతుంది. వాస్తవంగా కూడా గవర్నర్ ని అధికారికంగా నియమించేది గవర్నరే కదా!
undefined
click me!