రూటు మార్చిన రమణదీక్షితులు: ఆంతర్యం ఇదే, టార్గెట్ జగన్

First Published | Jul 17, 2020, 12:20 PM IST

రమణదీక్షితులు ఆరోపణలను గనుక పరిశీలిస్తే.... చంద్రబాబు నాయుడు నాటి  బ్రాహ్మణ వ్యతిరేక పరిస్థితులే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. కేవలం ట్విట్టర్లోనే కాదు గత కొన్ని నెలల నుంచి ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. 

టీటీడీ వ్యవహారం నిన్నటినుండి హాట్ టాపిక్ గా ఉంది. కొండపైన కరోనా కేసులు ఉదృతంగా ఉన్నాయని, అయినప్పటికీ... దర్శనాలను మాత్రం నిలిపివేయడంలేదని టీటీడీ గౌరవ ప్రధానార్చకుడు రమణదీక్షితులు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
undefined
తిరుమలలో ఇప్పటివరకు 15 మంది అర్చకులకు కరోనా సోకింది. గురువారం నాడు మధ్యాహ్నం మరో ముగ్గురు అర్చకులకు కరోనా సోకింది. దీంతో మొత్తం 18 మంది అర్చకులకు కరోనా సోకినట్టుగా తేలింది. అర్చకులకు కరోనా సోకడంతో భక్తులకు దర్శనాలు నిలిపివేయాలని కోరినా కూడాఅధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ఈవో, ఏఈఓలకు చెప్పినా కూడ పట్టించుకోవడం లేదంటూ ఆయన ఫిర్యాదు చేశారు.
undefined

Latest Videos


భక్తుల కొంగు బంగారం తిరుమలవెంకన్న దర్శనాలను జూన్‌ 11న పునరుద్ధరించారు. ఆ రోజుకు తిరుపతిలో ఉన్న కరోనా కేసులు 44 మాత్రమే. సోమవారం నాటికి ఈ సంఖ్య 1,148కి చేరుకుంది. నెల వ్యవధిలోనే నగరంలో 1104మంది వైరస్‌ బారినపడ్డారు.
undefined
లాక్ డౌన్ కాలంలోనే కాళహస్తిలో కేసులు విపరీతంగా నమోదైన విషయం అందరికి తెలిసిందే. కోయంబేడు లింకులైతేనేమి, వేరే విషయాలైతేనేమి కాళహస్తిలోమాత్రం విపరీతంగా కేసులు నమోదయ్యాయి.జూన్‌ 12వ తేదీ నాటికి శ్రీకాళహస్తిలో 103 కేసులు ఉండగా, తిరుపతి నగరంలో 47 మాత్రమే ఉన్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసి దర్శనాలను అనుమతించిన తర్వాత నెల రోజుల వ్యవధిలో శ్రీకాళహస్తి పట్టణంలో పెరిగిన కేసుల సంఖ్య 53 కాగా... తిరుపతి పట్టణంలో 1104 కేసులు పెరిగాయి.తిరుపతిలో కేసులు పెరగడానికి కారణం తిరుమలకు వచ్చి వెళ్లే భక్తులు. కొండకింద కూడా విపరీతమైన రద్దీ ఉంటుంది. ఈ భక్తుల తాకిడివల్లే కేసులు పెరిగాయనడానికి ఇదే కారణం. కొండపైన కూడా కేసులు నమోదవుతూ ఉండడం మరో నిదర్శనం. మొత్తానికి కరోనా వ్యాప్తి మాత్రం తీవ్రతరమవుతుందనేది అక్షర సత్యం.
undefined
ఇది పక్కనుంచితే రమణదీక్షితులు ఆరోపణలను గనుక పరిశీలిస్తే....చంద్రబాబు నాయుడు నాటి బ్రాహ్మణ వ్యతిరేక పరిస్థితులే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. కేవలం ట్విట్టర్లోనేకాదు గత కొన్ని నెలల నుంచి ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు.
undefined
కొండపైన ఈఓ అనిల్ సింఘాల్ కి రమణ దీక్షితులుకి మధ్య ఒక కోల్డ్ వార్ తరహా వాతావరణం నడుస్తుందనేది ఎప్పటి నుండో వినబడుతున్నమాట. ట్వీట్లో కూడా అనిల్ సింఘాల్ గురించి ఆయన ఫిర్యాదు చేసారు.
undefined
రమణ దీక్షితులు నిన్న జగన్ గారిని ట్యాగ్ చేసారు. ఇక అదే రోజు మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణ రావుచేసిన ఒక ట్వీట్ని రీట్వీట్ చేసారు. ఇది ఇక్కడ ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. ఆయన తన ట్వీట్లో తరచు జగన్ ని ఉద్దేశిస్తూ చెప్పే ఒక పంచ్ డైలాగ్ ని ఎద్దేవా చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు.
undefined
మాట తప్పుడు, మడిమ తిప్పడు ఇవన్నీ కేవలం పబ్లిసిటీ కోసమే అంటూ ఒక ట్వీట్ చేస్తే దానిని రీట్వీట్ చేసారు రమణ దీక్షితులు. ఈ మధ్యకాలంలో ఐవైఆర్ కృష్ణారావు జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పలు పోస్టులను పెట్టాడు. పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా జిల్లాల విభజన చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. దాని వల్ల నష్టాలూ వస్తాయని అన్నారు.
undefined
ఇక తిరుమల దర్శనాలపై మానవహక్కుల కమిషన్ కూడా స్క్రీన్ మీదకు ఎంటర్ అయింది.తిరుమలలో ఆగమ శాస్త్ర పద్ధతులకు విరుద్ధంగా దర్శన నిబంధనలను మార్చి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ స్పందించిందని వనపర్తి జిల్లా ఆత్మకూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వై. తిప్పారెడ్డి తెలిపారు.
undefined
2005లో అప్పటి టీటీడీ పాలక మండలి లఘు దర్శనం, శీఘ్ర దర్శనం, బ్రేక్‌ దర్శనాల విధానాన్ని ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా అమలు చేయడం ప్రారంభించడంతో భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. ఇది దేవాదాయ శాఖ చట్టం 142 ప్రకారం సమ్మతం కాదని ఈ నెల 3 న ఎన్‌హెచ్‌ఆర్‌సీ కి ఫిర్యాదు చేశానన్నారు.2005 లో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి.
undefined
రాజశేఖర్ రెడ్డిని సైతం ఆయన మత విశ్వాసాలను అడ్డంపెట్టి హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేయడానికి విపరీతంగా వ్యతిరేకించింది. కానీ రాజశేఖర్ రెడ్డి సంక్షేమపథకాలు జోరులో అవన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు మరల జగన్ మీద అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు బీజేపీ వారు. అందుకు జగన్ తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కూడా వారికి స్పేస్ దొరుకుతుంది.
undefined
ఈ పిటిషన్ వేసింది బీజేపీ నేతనా కాదా,అనే విషయం పక్కకు పెడితే.... హిందుత్వానికిసంబంధించిన అంశం అంటేనే బీజేపీ ముందుకు వస్తుంది. వారి రాజకీయ సిద్ధాంతమే దాని మీద బేస్ అయి ఉంది.
undefined
రమణదీక్షితులు ఇప్పుడు బీజేపీ పక్షాన మాట్లాడుతున్నాడా, లేదా ఈఓ మీద కోపంతో జగన్ కి ఫిర్యాదు చేసారా అనే విషయాన్నీ పక్కనబెడితే ఆయన వ్యాఖ్యలను మాత్రం ఇప్పుడు బీజేపీ బలంగా వాడుకుంటుంది. మాజీ ఐఏఎస్ ఐవైఆర్ పోస్టులను చూసినా ఆయన హిందుత్వవాది అనే విషయం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది.
undefined
ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన మానవహక్కుల కమిషన్ నోటీసులు కొద్ద గనుక పరిశీలిస్తే.....రానున్న రోజుల్లో జగన్ కు మాత్రం మరిన్ని తలనొప్పులు తప్పేలా కనబడడం లేదు.
undefined
click me!