జగన్ పార్టీకే ఎసరు పెడుతున్న రఘురామకృష్ణమ రాజు: అసలేమవుతుంది?

First Published | Jun 27, 2020, 11:01 AM IST

తాజాగా రఘురామకృష్ణంరాజుకు వైసీపీ షో కాజ్ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. టీటీడీ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడం దగ్గరినుండి మొదలు ఇసుక, అవినీతి అంటూ సొంత వైసీపీ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు మంత్రులు అని అందరిపైనా ఆయన విరుచుకుపడుతూ... పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారు అనే కారణంతో ఆయనకు షో కాజ్ నోటీసులను జారీ చేసారు. 

రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి ఈయనొకహాట్ టాపిక్. ఆయన వైసీపీ వారు ఎంత వారిస్తున్నా కూడా ఆయన మీడియాకి ఎక్కుతున్నారు. వైసీపీ వారు పదే పదే వద్దు అని చెప్పినా, వారు బహిష్కరించిన చానళ్ల చర్చాకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైసీపీ ని సాధ్యమైనంత ఇబ్బంది పెడుతున్నారు.
undefined
తాజాగా రఘురామకృష్ణంరాజుకువైసీపీ షో కాజ్నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. టీటీడీ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడం దగ్గరినుండి మొదలు ఇసుక, అవినీతి అంటూ సొంత వైసీపీ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు మంత్రులు అని అందరిపైనా ఆయన విరుచుకుపడుతూ... పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారు అనే కారణంతో ఆయనకు షో కాజ్ నోటీసులను జారీ చేసారు.
undefined

Latest Videos


షో కాజ్ నోటీసు జారీ చేయగానే ఆయన విజయసాయి రెడ్డి పైన కూడా ఫైర్ అయ్యారు. అప్పటివరకు రఘురామకృష్ణంరాజు రాడార్ కి దూరంగా ఉన్న విజయసాయి రెడ్డి కూడా ఆయన రేంజ్ లోకి వచ్చినట్టుగా ఆయనపైన ఫైర్ అయ్యారు. ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి ఏమిటంటూ ఎద్దేవా చేసారు.
undefined
ఆయన కొన్ని వింతయిన ప్రశ్నలను లేవనెత్తారు. టెక్నికల్ అంశాలను చూపెడుతూ ఆయన, తనకు ఇచ్చిన షో కాజ్ నోటీసు చెల్లదు అని అన్నారు. ఆయన లేవనెత్తిన తొలి అంశం పార్టీ పేరు గురించి. తనకు బి ఫారం ఇచ్చేటప్పుడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే పేరుందని, ఇప్పుడు తనకు వైఎసార్సీపి అనే పార్టీ తరుఫున షో కాజ్ నోటీసు ఎలా ఇస్తారని అన్నారు.
undefined
ఇక రెండవ ప్రశ్నగా పార్టీ జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా అని ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీగా నమోదైన వైసీపీకి జాతీయ కార్యదర్శి ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు. తనకు ఇచ్చిన నోటీసులో విజయసాయి రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎలా సంతకం పెడతారని ఆయన ప్రశ్నించారు.ఇక మూడవ ప్రశ్నగా తమ పార్టీలో క్రమశిక్షణా సంఘం అనేదే లేనప్పుడు తనకు క్రమశిక్షణ ఉల్లంఘనలు అంటూ, అటువంటి కమిటీ తనకు పైక్రమశిక్షణ చర్యలు ఎలా తీసుకుంటారనిప్రశ్నించారు.
undefined
ఇక ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో ఒక చర్చ బయల్దేరింది. వైసీపీ పార్టీ రద్దు అవుతుంది అని. పార్టీ ఏపేరుతో నమోదయిందో... ఆ పేరును కాకుండా వేరే పేరును ఉపయోగిస్తుందంటూ, అది చట్ట వ్యతిరేకం అని పార్టీ రద్దవుతుందంటూ కొత్త చర్చకు తెరలేచింది.
undefined
రఘురామ కృష్ణం రాజు ఎన్నికల కమిషన్ లో ఈ విషయమై ఫిర్యాదు చేసారు అనే వార్తలు కూడా జోరందుకోవడంతో... దీనిపై విస్తృతంగా చర్చలు మొదలయ్యాయి. అందరూ రాజ్యాంగాలను, పీపుల్స్ రిప్రజంటేషన్ ఆక్ట్ ను తెగ చదివిస్తున్నారు. అందులోని లా పాయింట్లను పట్టుకొని పార్టీ రద్దు తథ్యం అంటూ వాదిస్తున్నారు.ఏ పార్టీవారు వారి వాదనను వారి అనుకూల మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. న్యాయ కోవిదులను, రాజ్యాంగ నిపుణులను చర్చలకుఆహ్వానిస్తూ సుదీర్ఘ డిబేట్లను నిర్వహిస్తున్నారు.అందులో వారు రాజ్యాంగం లోని అన్ని సెక్షన్లను పాత తీర్పులను తిరగేస్తున్నారు.
undefined
ఈ పరిస్థితిని మనం చర్చించే ముందుఒక చిన్న విషయం గనుకపరిశీలిస్తే... అనుమానమే మనకు రాదు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. బీజేపీ గా మనం పిలుచుకునే పార్టీ. బీజేపీ అని పిలిచినంతమాత్రాన భారతీయ జనతా పార్టీ రద్దయిపోతుందా?
undefined
రాజ్యాంగంలో రాజకీయ పార్టీ అన్న చర్చకే మన రాజ్యాంగ నిర్మాతలు తావివ్వలేదు. పార్టీని ఎలా నడుపుతారనేది పార్టీ ఇష్టం( నియమ నిబంధనలకు లోబడి) కాబట్టి పార్టీ అంతర్గత వ్యవహారాలపై రఘురామా కృష్ణం రాజు మాట్లాడినంతమాత్రాన పార్టీ రద్దు అవడానికి ఆస్కారం లేదు.
undefined
ఆయన రేపు కోర్టులో ఈ కేసు దాఖలు చేసినా కూడా అది నిలబడదు. కోర్టు మహా అయితే వైసీపీ పక్కనబ్రాకెట్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేపేరు కూడా ఉంచండి, లేదా ఫ్రెష్ గా ఇంకొక నేటివ్ ఇవ్వండి ఆ పేరును చేర్చి అని చెప్పవచ్చు. అంతేతప్ప పార్టీని రద్దు చేసే ఆస్కారం లేదు.
undefined
మరి రఘురామకృష్ణంరాజు ఏమి ఆశించి ఈ చర్చకు దారితీస్తున్నాడు? ఆయన ఒక చిన్న ఎంపీ, ఈ వివాదం దెబ్బకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుడయ్యాడు. జగన్ మెహన్ రెడ్డి మినహా వైసీపీలో అందరిని ఢీ అంటే ఢీ అంటున్నాడు. ఆయనను ఒక్కటి తిడితే... ఆయన నాలుగు తిడుతున్నాడు.పార్టీ చెయ్యొద్దన్న పనులుచేస్తున్నాడు. రేపు కోర్టుకు వెళ్లినా కూడా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఆయనకు ఈ తతంగంద్వారా రెండు లాభాలు. ఒకటి ఆయన సాధ్యమైనంతకాలం ప్రజల్లో నానుతుంటారు. ఇమేజ్ పెరుగుతుంది. ఎవరినయినా ఢీకొట్టే నాయకుడు రఘురామకృష్ణంరాజు అనే పేరు వస్తుంది. ప్రజల్లో రాష్ట్రనాయకుడిగా పాపులారిటీ కూడా దక్కుతుంది.
undefined
ఇక వైసీపీ ఈయన బాధ పడలేక ఎప్పుడు బహిష్కరిస్తే అప్పుడు బీజేపీలో చేరిపోదాము అని చూస్తున్నాడు. అనర్హత వేటు వేయమని వైసీపీ కోరినా అది స్పీకర్ ఇష్టం. ఆయన దాన్ని పెండింగ్ లో ఉంచొచ్చు. లేదా జగన్ నేర్పిన రెబెల్ సిద్ధాంతాన్ని రఘురామ కూడాఫాలో అవ్వొచ్చు. (వల్లభనేని వంశి, బలరాం, మద్దాలి గిరి లు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలుఘా కొనసాగుతున్నట్టు) ఈ గొడవెందుకు అనుకుంటే... బేషుగ్గా వైసీపీ సస్పెండ్ చేస్తే... వైసీపీ పార్టీ యే నన్నువద్దనుకుంది. అందుకే నేను బీజేపీలో చేరాను అని చెప్పుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర నాయకుడిగా, ఎక్కువ మాట్లాడితే.... బీజేపీ రాష్ట్రాధ్యక్షుడయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
undefined
ఆయనను పార్టీ నుంచి బహిష్కరించేంతవరకు ఈ తతంగం కొనసాగిస్తూనే ఉంటారు. ఆయన చర్చలకు హాజరవుతూ టీవీ ఛానళ్లలో రోజు మనందరికీ దర్శనమిస్తారు. ఆయనమీద దాడిచేసే వైసీపీ నాయకులపై ఎదురుదాడికి దిగుతాడు. ఇదే జరగబోయేది. రానున్న రోజుల్లో మరింత వినోదం మాత్రం తథ్యం.
undefined
click me!