చైనా గుప్పిట్లో పాక్: భారత్ మీద విషం, అమెరికా వ్యూహం ఇదీ...

First Published Jun 26, 2020, 12:54 PM IST

ప్రపంచంతోపాటుగా పాకిస్తాన్ లో కూడా మారణహోమం సృష్టించిన ఒసామా బిన్ లాడెన్ ఇప్పుడు ఉన్నట్టుండి పాకిస్తాన్ కి అత్యంత ప్రీతిపాత్రుడు, అమరవీరుడు అయ్యాడు. పార్లమెంటు సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేసాడు ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలను బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడాడు. అసందర్భంగా, పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వాస్తవికంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమిటో ఒకసారి చూద్దాము. 

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాక్ పార్లమెంటు వేదికగా ఒసామా బిన్ లాడెన్ ని అమరవీరుడంటూ పొగిడాడు. అమెరికా పాకిస్తాన్ లోకి వచ్చి అబోత్తాబాద్ లో ప్రభుత్వానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా లాడెన్ ని మట్టుబెట్టిందని, అమెరికన్ల చర్యల వల్ల పాకిస్తాన్ తలదించుకోవాలిసి వచ్చిందని అన్నాడు.
undefined
అనేక సంవత్సరాలుగా అమెరికాతో కలిసి నడవడం వల్ల పాకిస్తాన్ అనేక విధాలుగా నష్టపోవడంతోపాటుగా అనేక అవమానాలను సైతం ఎదుర్కొందని, ఇటు దేశంలో అటు ప్రపంచం ముందు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారిందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించాడు.
undefined
అమెరికా పాకిస్తాన్ ప్రభుత్వానికి సమాచారమివ్వకుండాపాకిస్తాన్ భూభాగంలోకి వచ్చి ఒసామా పై దాడి చేసి చంపేసింది .ఓకే. పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని అమెరికా తలదన్నేలా ప్రవర్తించిందే. అందుకే ఇమ్రాన్ ఆ వ్యాఖ్యలు చేసాడు అనుకోవచ్చు. (ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ ప్రధానికి తెలిసి అక్కడ ఉన్నాడా, తెలియకుండా తలదాచుకున్నాడా అనేది వేరే విషయం)
undefined
కానీ ఆయన ఒసామా బిన్లాడెన్ ని అమరుడు అని అనడం పాకిస్తాన్ దుష్టనీతికి ప్రతీక. పాకిస్తాన్ టెర్రరిస్టులను సపోర్ట్ చేయదు. తీవ్రవాదులకు వ్యతిరేకంగా నిరంతరం తీవ్రవాదుల ఏరివేతలో పాకిస్తాన్ ముందుంటుంది అని చెప్పుకునే పాకిస్తాన్ ప్రభుత్వ చీకటి కోణం ఇక్కడ ఆవిష్కృతమవుతుంది.
undefined
ఒసామా బిన్ లాడెన్ కేవలం అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేతలో ప్రధాన నిందుతుడు మాత్రమే కాదు. ఒక దశాబ్దంపాటు పాకిస్తాన్ లో మారణహోమం సృష్టించిన పాకిస్తానీ తాలిబన్ కూడా అతడి కనుసన్నల్లోనే నడిచింది.
undefined
ప్రపంచంతోపాటుగా పాకిస్తాన్ లో కూడా మారణహోమం సృష్టించిన ఒసామా బిన్ లాడెన్ఇప్పుడు ఉన్నట్టుండి పాకిస్తాన్ కి అత్యంత ప్రీతిపాత్రుడు, అమరవీరుడు అయ్యాడు. పార్లమెంటు సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేసాడు ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలను బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడాడు. అసందర్భంగా, పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వాస్తవికంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమిటో ఒకసారి చూద్దాము.
undefined
భారత్, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. చైనా దురాగతాలకు 21 మంది భారతీయ సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో హై టెన్షన్ వాతావరణం ఉంది.
undefined
చైనా, పాకిస్తాన్ మధ్య మైత్రి కొనసాగుతుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వల్ల ఇరు దేశాల మధ్య మైత్రి కొనసాగుతుంది ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ తనని తాను చైనా ముందు తాకట్టుపెట్టుకుంది. ఆ కారిడార్ నడిస్తేనే పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ నడుస్తుంది.
undefined
చైనాకు కూడా ఆ కారిడార్ అత్యవసరం. తన దేశానికి అవసరమైన చమురు అంతా కూడా భారత దేశం కింద నుంచి మలక్కా జల సంధి గుండా వెళ్లాల్సి వస్తుంది. ఆ జలసంధిని భారత్ అనుకుంటే పూర్తిగా దాన్ని మూసివేస్తుందని చైనా భయపడుతుంది. భారత అండమాన్ నికోబర్ దీవులకు అది దగ్గరగా ఉంటుంది.
undefined
దీనివల్ల చైనా పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేసింది అక్కడి నుండి పాకిస్తాన్ గుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచిచైనా వరకు రోడ్డు మార్గాన్ని నిర్మించింది. అలా చైనా భారత్ పై ఒక కన్ను కూడా వేసిఉంచొచ్చని ఈ పోర్టును అభివృద్ధి చేసింది. అప్పుడు మలక్కాజలసంధి మీద పెద్దగా అధఃహారపడాల్సిన అవసరం చైనాకు ఉండదు.
undefined
ఈ రోడ్డు మార్గం నిర్మాణం దాని కాపలా ఇతరత్రాల కోసమే చైనీయులు పాకిస్తాన్ లో అధికంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ యువతులను చైనీయులకు అమ్మేస్తున్నారని వస్తున్న వార్తలు అన్ని కూడా ఈ కశ్గర్ కారిడార్ చుట్టుపక్కలవే.
undefined
దీనితో ఇప్పుడు పాకిస్తాన్ పూర్తిగా చైనా మీద ఆధారపడింది. చైనా సహాయం లేనిది పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కుదేలవుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ పూర్తిగా దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతోంది. దిక్కుతోచని పరిస్థితుల్లో చైనా తప్ప ఇంకో మార్గం లేదు.
undefined
చైనా ఇప్పుడు పాకిస్తాన్ ని తనకు అనుకూలంగా మాట్లాడిస్తుంది. ఇంతకుమునుపు వరుకూ పాకిస్తాన్ కి అమెరికాతో దగ్గరి సంబంధాలున్నాయి. ఒకరకంగా పాకిస్తాన్ ఆయుధ సంపత్తి అంతా కూడా అమెరికా నుండి వచ్చిందే. వారి తుపాకుల నుండి విమానాల వరకు అన్ని అమెరికా ఇచ్చినవే. (గతంలో రష్యా తో భారత్ సన్నిహితంగా ఉన్నప్పుడు పాకిస్తాన్ అమెరికాతో రాసుకుపూసుకు తిరిగింది)
undefined
సోవియెట్ రష్యాపతనానన్తరం భారత్ అమెరికాకు దగ్గరయింది. ఇప్పుడు చైనా పాకిస్తాన్ ద్వారా భారత్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతోపాటుగా ఇటు భారత్ కి అటు అమెరికాకు సవాలు విసురుతుంది. అవసరమనుకుంటే పాకిస్తాన్ కూడా చైనాతోపాటుగా భారత్ తో యుద్ధానికి దిగుతుందని ఇలా సంకేతాలిస్తుంది.
undefined
అమెరికా సైతం చైనా చర్యలను కట్టడి చేసేందుకు తమ బలగాలను దక్షిణ చైనా సముద్రం, ఆగ్నేయాసియా దేశాల వెంట మోహరిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ప్రత్యేకించి భారత్ పై చైనా కాలుదువ్వుతుందని అమెరికా తన ప్రకటనలో పేర్కొంది.చూడాలి రానున్న కాలంలో ఈ పరిస్థితులు మరింతగా ఎలా రూపాంతరం చెందుతాయో!
undefined
click me!