రఘురామ కృష్ణమరాజు వ్యూహం ఇదే: వైఎస్ జగన్ టార్గెట్

First Published Jun 26, 2020, 7:27 AM IST

ఏకంగా తన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే తనకు ప్రాణహాని ఉందని, తనకు కేంద్రబలగాలతో రక్షణ కల్పించాలని రఘురామకృష్ణంరాజు లోక్ సభ స్పీకర్ కి లేఖ రాసాడు. ఆయన రాజకీయాలు అందరికి ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయాయి. 

రఘురామకృష్ణంరాజు- ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్. ఆయన పార్టీలోనే ఉంటూ.... ఒక్క అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద తప్ప వేరే ఎవ్వరిని వదలకుండా అందరి మీద విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా విజయసాయి రెడ్డి కూడా ఈ లిస్టులో చేరిపోయారు.
undefined
ప్రాంతీయపార్టీలు జాతీయ కార్యదర్శులేమిటంటూ రెచ్చిపోయారు రఘురామకృష్ణం రాజు. వైసీపీ తనకు ఇచ్చిన నోటీసుకు చట్టబద్దత లేదని, రాష్ట్ర స్థాయి పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు అనేకంటే ఎద్దేవా చేసారనాలేమో!
undefined
పార్టీ అధినేత జగన్ తో పాటు పశ్చిమ గోడావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన విమర్శలపై వారం రోజుల్లోపుగా వివరణ ఇవ్వాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నెల 24వ తేదీన రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దానిపై స్పందిస్తూ ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేసారు.
undefined
జాగ్రత్తగా గనుక గమనిస్తే మొన్నకూడా ఆయన ఈ నోటీసుపై స్పందించాడు. తానువైసీపీలోనే కొనసాగుతానని మాత్రమే అన్నాడు. కానీ తెల్లారేసరికి.... అందులోని అన్ని టెక్నికల్ అంశాలను బయటపెట్టి తన సహజ శైలిలో అధికార వైసీపీపై తనదైన సహజ శైలిలోవిరుచుకుపడ్డాడు.
undefined
తొలుత టీటీడీ భూముల వ్యవహారంలో వైసీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన రఘురామకృష్ణంరాజు... ఆ తరువాత ఇసుక, అవినీతి అంటూ గళమెత్తారు. ఇక ఆయనకు కౌంటర్ ఇస్తూ వైసీపీ నేతలు ముందుకొచ్చారు.తనను ఒక్కటంటే... ఆయన రెండంటున్నారు. తనకు సవాలు విసిరితే ప్రతి సవాలు విసురుతున్నారు. వైసీపీ నేతలంతా మంత్రులతోసహా రఘురామా కృష్ణంరాజుపై ఒక మినీ యుద్ధానికి పూనుకున్నారు. ఏకంగా తనను కాళ్లావేళ్లా బ్రతిమిలాడితే తాను వైసీపీలో చేరానని, తాను కాబట్టే నరసాపురం సెగ్మెంట్ లో వైసీపీ విజయదుందుభి మోగించిందని అన్నారు.
undefined
తాజాగా విజయసాయిరెడ్డి వంతు వచ్చింది. తన జోలీకి వస్తే ఎవ్వరినీ వదిలిపెట్టను అంటూ విజయసాయి రెడ్డి మీద సెటైర్లు వేసిమరోసారి రుజువు చేసాడు రఘురామ. బహిరంగంగా విమర్శలు చేస్తున్నాడు. వైసీపీ వెళ్లొద్దు అని చెప్పిన చానెళ్లకు చర్చికార్యక్రమాలకు హాజరవుతున్నారు.
undefined
ఏకంగా తన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే తనకు ప్రాణహాని ఉందని, తనకు కేంద్రబలగాలతో రక్షణ కల్పించాలని రఘురామకృష్ణంరాజులోక్ సభ స్పీకర్ కి లేఖ రాసాడు. ఆయన రాజకీయాలు అందరికి ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయాయి.
undefined
ఆయన ఇప్పటికి కూడా వైసీపీ నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద మాత్రమే ఆరోపణలు చేస్తున్నారు, విరుచుకుపడుతున్నారుతప్ప జగన్ ని ఒక్కమాట కూడా అనడంలేదు. ఇలా ఒక నేత సమస్యలు ఉన్నాయి అని కలవడానికి ప్రయత్నిస్తుండగా ముఖ్యమంత్రి జగన్ కలవడంలేదని ఆయన వాపోయారు.
undefined
ఆయన పార్టీలోనే ఉంటూ తరచు ఇలా వ్యాఖ్యలు చేయడం ఒకరకంగా జగన్ ఎవరికీ తన అపాయింట్మెంట్ ఇవ్వడని ఆయన బయటకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ఎంపీగా అందుబాటులో ఉండడం లేదంటే... మిగిలిన వారి విషయం ఏమిటనే ప్రశ్నను ఆయన ఇక్కడ లేవనెత్తుతున్నాడు. ఆయన ఈ వ్యాఖ్యలు అనేకమంది ఎమ్మెల్యేలు సైతం ఇసుక గురించిన వ్యాఖ్యలు చేయడం ఈ అనుమానాన్ని బలపరుస్తోంది.
undefined
ప్రస్తుతానికి రఘురామ కృష్ణంరాజు తాను ఇంకా వైసీపీలోనే ఉన్నంటున్నప్పటికీ... ఆయన మాత్రం పార్టీ క్రమశిక్షణను ఎంతమాత్రమూ పాటిస్తున్నట్టుగా లేదు. ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోదామని అనుకుంటున్నాడనేది తథ్యం. కానీ జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోబట్టే తాను ఇలా మాట్లాడుతున్నాను అని అంటున్నాడు. జగన్ ఆరంభంలోనే పిలిచి మాట్లాడాల్సింది.
undefined
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రఘురామకృష్ణంరాజుతో కూర్చి మాట్లాడలేరు జగన్. పార్టీకి ఆయనకు మధ్య పెరిగిన గ్యాప్ మరింతగా పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. ఈ స్థితిలో జగన్ కూడా కూర్చీబెట్టి మాట్లాడలేరు. పొలిటికల్ గా అది రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుందని వైసీపీ వారు భావించడమే కాకుండా జగన్ వ్యక్తిగతంగా కూడా అందుకు సుముఖంగా ఉండబోరు.
undefined
మరి నెక్స్ట్ ఏమిటి..? ఆయన రాజినామా చేసిపోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారు. నన్ను తొలిగించండి అని రఘురామకృష్ణంరాజు అంటున్నారు. జగన్ శైలికి పూర్తి భిన్నంగా ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్నారు. సాధారణముగా ఇలాంటి పరిస్థితుల్లో జగన్ వారిని ఈపాటికి పార్టీ నుండి బహిష్కరించి ఉండేవాడు. ఇలా మామూలుగా షో కాజ్ నోటీసులకు రఘురామకృష్ణంరాజు లొంగేలా కనబడడం లేదు.
undefined
కానీ రఘురామకృష్ణంరాజు విషయంలో అలా చేయలేకపోతున్నారు.కారణం ఆయన వైసీపీ నుండి వెళితే...చేరేది బీజేపీలో. బీజేపీ అనే ఒక ఆలంబన ఉంది అన్న మెసేజ్ పోవడంతోపాటుగా ఆయన మరికొంతమంది ఎంపిలను కూడా తీసుకొని పోయేప్రమాదం లేకపోలేదు.అదే గనుక జరిగితే... అసంతృప్త వైసీపీ నేతలంతా బీజేపీవైపుగా చూడడం మొదలవుతుంది. బీజేపీతో వైసీపీ ప్రత్యక్ష యుద్ధానికి ఎంతమాత్రమూ దిగలేదు. ఆ రాజకీయ కోణాలు అందుకు తగ్గట్టుగా ఉన్నాయి.
undefined
ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో జగన్రఘురామ కృష్ణంరాజుపై సొంతపార్టీ నేతలతోనే దాడి చేపిస్తున్నారన్నట్టుగా గుసగుసలు వినపడుతున్నాయి. కానీ ఇలా ఒక్క పార్టీలోనే అందరూ ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటే... అనేక లోగుట్టులు కూడా బయటపడే ఆస్కారం ఉంది. మీడియాకెక్కి నన్ను టార్గెట్ చేసారని రఘురామ, మీరు యెల్లో మీడియాకి ఐటంగా మారారు అని వైసీపీ నేతలు.. ఈ రచ్చ వల్ల నష్టం వైసీపీ పార్టీకే!
undefined
click me!