బిజెపి ప్లాన్: రఘురామకృష్ణంరాజుకు జగన్ ఎగ్జిట్!

First Published Jun 16, 2020, 12:14 PM IST

జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై ఈ మధ్య కాలంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇసుక విషయంలో, అవినీతి విషయంలో బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బ్రహ్మనాయుడు, ధర్మాన వంటి సీనియర్ నేతలు సైతం మాట్లాడారు. నిరసనలు పెరుగుతున్న సమయంలో రఘురామ కృష్ణంరాజు విషయంలో గనుక ఈ సారి కూడా చర్యలు తీసుకోకపోతే... అందరికీ ఇది అలుసుగా మారే అవకాశం ఉందని అంటున్నారు. 

వైసీపీ ప్రజాప్రతినిధులందరూ ఒకవైపు, తానొక్కడినే ఒకవైపు అన్నట్టుగా ఉండే... రఘురామకృష్ణంరాజు తాజాగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.తనను కాళ్లావేళ్లా బ్రతిమిలాడితే తాను వైసీపీలో చేరానని, తాను కాబట్టే నరసాపురం సెగ్మెంట్ లో వైసీపీ విజయదుందుభి మోగించిందని అన్నారు. తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుకు కౌంటర్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు ఫైర్ బ్రాండ్ ఎంపీ.
undefined
గతంలో ఎన్నికలకు ముందుతనను వైసీపీలో చేరాలని కోరినా కూడ తాను చేరడానికి ఇష్టపడలేదన్నారు. రాష్ట్రం మొత్తం వైసీపీ విజయదుందుభి మోగించినా కూడ నరసాపురం ఎంపీ సెగ్మెంట్‌లో తమకు ఇబ్బంది ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం తనకు చెప్పిందన్నారు. తాను వైసీపీలో చేరితే నరసాపురం ఎంపీ సెగ్మెంట్ లో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తనకు చెప్పి బతిమిలాడితే తాను వైసీపీలో చేరినట్టుగా ఆయన గుర్తు చేసారు.
undefined
నరసాపురం ఎంపీ స్థానంలో తాను కాబట్టే విజయం సాధించినట్టుగా ఆయన బల్లగుద్దిచెబుతున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. జగన్ బొమ్మ చూసి ఓటేస్తేనే తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు విజయం సాధించలేదన్నారు. తన ముఖం చూసి కూడ జనం ఓట్లేస్తే ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు తాను విజయం సాధించినట్టుగా ఆయన కుండబద్దలుకొట్టారు.
undefined
ఎప్పటినుండో కూడా వైసీపీ అధిష్టానంపై గురువుగా ఉన్నాడు రఘురామకృష్ణంరాజు. తాను జగన్ ని కలవాలని చూస్తున్నప్పటికీ... తనకు అవకాశం దొరకడంలేదని అంటున్నారు. అయితే...జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం ఈ సారి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలపై సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఆయనకు షో కాజ్ నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
undefined
జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై ఈ మధ్య కాలంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇసుక విషయంలో, అవినీతి విషయంలో బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బ్రహ్మనాయుడు, ధర్మాన వంటి సీనియర్ నేతలు సైతం మాట్లాడారు. నిరసనలు పెరుగుతున్న సమయంలో రఘురామ కృష్ణంరాజు విషయంలో గనుక ఈ సారి కూడా చర్యలు తీసుకోకపోతే... అందరికీ ఇది అలుసుగా మారే అవకాశం ఉందని అంటున్నారు.
undefined
అందుకే రఘురామకృష్ణంరాజుపై ఈసారయినా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలియవస్తుంది. ఆయన పై చర్యలు తీసుకోకపోతే.. అధిష్టానం పై వేరే ఎవరైనా కూడా బహిరంగంగా అసంతృప్తి వెలిబుచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా, ఇలా చర్యలు తీసుకుంటే... వేరే ఎవరు కూడా మరోసారి ఇలా బహిరంగ విమర్శలు చేయడానికి ధైర్యం చేయరు.
undefined
ఇకపోతే... రఘురామకృష్ణంరాజు సైతం తనను సస్పెండ్ చేయడం కోసమే ఎదురు చూస్తున్నట్టుగా తెలియవస్తుంది. ఆయనను గనుక సస్పెండ్ చేస్తే... ఆయన టీడీపీలో చేరలేడు. ఆయనకున్న బిజినెస్ల దృష్ట్యా... ప్రతిపక్షంలో ఉంటే... జగన్ మోహన్ రెడ్డి సర్కార్ చూస్తూ అయితే ఊరుకోదు. ఆ విషయం తనకు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో ఆయన చేరేది బీజేపీలోనే.
undefined
గతంలో ఆయన బీజేపీ మంత్రులతో క్లోజ్ గా ఉన్న విషయం కూడా మనము చూసాము. అంతే కాకుండా తాజాగా బీజేపీ జాతీయ సీనియర్ నేత రామ్ మాధవ్ జగన్ మోహన్ సర్కార్ పై విరుచుకుపడ్డ తీరు చూస్తే ఒక్క క్షణం ఆశ్చర్యం వేయటం తథ్యం. ఆ ప్రసంగానికి కొన్ని రోజుల ముందే జగన్ ని పొగిడిన ఆయనే కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే అంతా రివర్స్ అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
undefined
బీజేపీ ప్రస్తుతానికి వైసీపీ, టీడీపీ రెండు పార్టీలతోనూ సన్నిహితంగానే మేలుగుతోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు రాష్ట్రంలో ఒకరినొకరు దూషించుకున్నా... కేంద్రంలో మాత్రం బీజేపీ ప్రతి బిల్లుకు మద్దతును ఇస్తాయి. బీజేపీ కూడా భవిష్యత్తులో ఏ పార్టీతోనే వసరమొస్తుందో... అన్న ఉద్దేశంతో ఇరు పార్టీలతోనూ స్నేహపూర్వకంగానే ఉంటున్నారు.
undefined
ఇక ఇప్పుడు రఘురామకృష్ణంరాజు వ్యవహారం, రామ్ మాధవ్ స్పీచ్ ను గనుక పోల్చి చూసుకుంటే... ఏపీలో బీజేపీ స్పీడ్ పెంచబోతుందా అంటే అవుననే సమాధానం కనబడుతుంది. వైసీపీలో అసమ్మతి, అసంతృప్తి నేతలను బీజేపీలో చేర్చుకోవాలని బీజేపీ యోచనగా ఉన్నట్టు తెలియవస్తుంది.
undefined
వైసీపీలో ఇప్పటికే కొందరునేతలు అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నప్పటికీ... వారికి వైసీపీ తప్ప వేరే ఆప్షన్ లేదు. టీడీపీలో చేరదామనుకుంటే... వైసీపీ బ్యాటింగ్ ని తట్టుకొని వారు నిలబడలేరు. బీజేపీ ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తుంది.
undefined
తమ పార్టీలో చేరిన వారందరికీ రక్షణ తథ్యం. అది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కూడా ఎవరు చేరతామన్నప్పటికీ... వారిని చేర్చుకోవాలని చూస్తుంది. అంతే కాకుండా బీజేపీ ఏపీలోని కులాలతో సోషల్ ఇంజనీరింగ్ చేయాలనీ యోచిస్తోంది.
undefined
pawan kalyan
undefined
click me!