హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కలిగించిన షాక్, దిగ్భ్రాంతి నుండి ఇంకా ఎవ్వరు కోలుకోలేదు. ఆయన మరణ వార్త యావాత్ దేశాన్ని కన్నీటి సంద్రంలో ముంచెత్తింది. యువ విలక్షణ నటుడు మనముందు లేడు అనే వార్త ఇంకా నమ్మశక్యంగా లేదు.
undefined
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. డిప్రెషన్ లో ఉన్నాడు. ఇవి ఇప్పటివరకు అందరికీ ఆయన ఆత్మహత్యకు కారణాలుగా మనకు తెలుస్తున్నాయి. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు కొందరు సినీ ప్రముఖుల సోషల్ మీడియాపోస్టులను చూస్తే అనిపిస్తుంది.
undefined
మొదటగా కరణ్జోహార్ ఇంస్టాగ్రామ్ పోస్టును గనుక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే... అందులో కరణ్జోహార్ పశ్చాత్తాపంకనబడుతుంది. ఆయన తన పోస్టులో గత సంవత్సర కాలంగా నీకు మనుషుల తోడు అవసరం ఉందని అనిపించినా నేను నీకు దూరంగా ఉన్నాను, ఆ విషయాన్నీ ఎప్పుడు సీరియస్ గా పరిగణించలేదు........ అందరికి ఇది వేక్ అప్ కాల్" అని పోస్ట్ పెట్టాడు.
undefined
దీన్ని నిశితంగా పరిశీలిస్తే ఆయన పశ్చాతాపం ఖచ్చితంగా కనబడుతుంది. తొలుత ట్విట్టర్ లో సుశాంత్ సింగ్ మరణ వార్త తన గుండెను పగిలేలా చేసిందంటూ ట్వీట్ కూడా చేసాడు. ట్వీట్ చేసిన తరువాత కూడా ఆయన ఇలా ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టడం ఇండస్ట్రీ అంతర్గత రాజకీయాలపై అనేక అనుమానం కలిగిస్తుంది.
undefined
ఏమో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కరణ్ జోహార్ కి ప్రత్యేకమైన అనుభవం ఉంది కాబట్టి, ఆయన ఇలా రాసుకొచ్చాడు అని అనొచ్చు. కానీ... వాస్తవ పరిస్థితులను, సుశాంత్ రెండు పోస్టులను చూస్తే.... అనుమానాలు నిజమే అని అనిపిస్తున్నాయి.
undefined
తొలుతగా అందుతున్న సమాచారం మేరకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నెట్ ఫ్లిక్స్లో రిలీజ్ అయినా ఒక సినిమా విషయంలో తీవ్ర డిప్రెషన్ కి లోనయినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం విశేషాలను గనుక ఒకసారి పరిశీలిస్తే.... సెప్టెంబర్ 2018లో మూవీ విడుదలవ్వాల్సి ఉన్నప్పటికీ... 2019 జూన్ కి పోస్ట్ పోనే చేయబడింది. ఆ తరువాత 2019 నవంబర్ లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది.
undefined
ఈ సినిమాను తెరకెక్కించిన విధానంలో హీరో, ప్రొడ్యూసర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందట. ఆ సినిమా ప్రొమోషన్ కూడా హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పాల్గొనలేదు. కేవలం హీరోయిన్, ప్రొడ్యూసర్ మాత్రమే పాల్గొన్నారు.ఆ సంఘటన జరగడం, సినిమా ప్లాప్ అవడం సినిమాకు సంబంధించి ప్రొడ్యూసర్ సుశాంత్ కి ఏ విధమైన సమాచారం అందించలేదట. అప్పటి నుండి ఈ బడా ప్రొడ్యూసర్, సుశాంత్ మధ్య గ్యాప్ పెరిగిపోయి అతని అవకాశాల మీద కూడా దెబ్బ పడిందట.
undefined
గతంలో కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినిమాలో తన అవకాశాల గురించి మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో ఎవరు గాడ్ ఫాదర్లులేరని వ్యాఖ్యానించాడు. ఇదంతా చూస్తుంటే... కొన్ని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆ బడా ప్రొడ్యూసర్ తో వాదనకు దిగినందుకే ఆయన ఇండస్ట్రీలో ఒంటరి వాడయ్యాడనే వాదనలు వినబడుతున్నాయి.
undefined
ఇలా ఒంటరిగా అయిపోయాడుసుశాంత్ సింగ్ అని అనిపించబట్టే ధర్మ ప్రొడక్షన్స్ అధినేత తాజా మూవీ నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 2019లో రిలీజ్ అయినడ్రైవ్ ప్రొడ్యూసర్ కరణ్జోహార్ అలా ఎమోషనల్ గా పశ్చాత్తాపపడుతూ పోస్ట్ పెట్టాడు అని అంటున్నారు.
undefined