నాగబాబు వింత రాజకీయం: పవన్ కి చిక్కులు, జగన్ కు ఊరట

First Published | Jun 14, 2020, 12:44 PM IST

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక పక్క వైసీపీ ని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అని అంటుంటే...ఆయన సోదరుడు నాగబాబు మాత్రం వైసీపీకి మద్దతుగా మాట్లాడుతుండడం చర్చనీయాంశంగా మారింది. 

ఆంధ్రప్రదేశ్ లో అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిల అరెస్ట్ తో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలందరూ అయితే అరెస్ట్ ను సమర్థించడమో వ్యతిరేకించడమోచేస్తున్నాయి. అధికారపక్షం కక్షసాధింపు చర్యలకు దిగుతుందని ప్రతిపక్షం విమర్శిస్తుంటే... చట్టం తనపని తాను చేసుకుపోతుందని అంటున్నాయి.
undefined
ఈ మాటల యుద్ధంలో ఎవరేమంటున్నారో వారితోపాటు వారివారిఅభిమానులకు, కార్యకర్తలకు ఒక అవగాహన ఉండగా... జనసేన కార్యకర్తల పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. తమ పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతుండడంతో వారి స్టాండ్ ఏమిటో వారికే అర్థం అవడంలేదు.
undefined

Latest Videos


జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ఒక పక్క వైసీపీ ని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అని అంటుంటే...ఆయన సోదరుడు నాగబాబు మాత్రం వైసీపీకి మద్దతుగా మాట్లాడుతుండడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
undefined
నాగబాబు వివాదాల పరంపర ఒకరకంగా చెప్పాలంటే... గాడ్సే దేశభక్తుడు అని అనడంతో మొదలయింది. ఆ వ్యాఖ్యలకు ఏకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనకు సంబంధం లేదు అని చెప్పుకోవాలిసిన అవసరం ఏర్పడింది. ఆయన ఆ వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదు అంటూ, అవి నాగబాబు వ్యక్తిగతం అని అన్నాడు.
undefined
ఆ తరువాత బాలయ్య వివాదం. ఇండస్ట్రీ విషయంలో బాలయ్యకు కౌంటర్ ఇచ్చే పూర్తి హక్కు నాగబాబుకు ఉంది.ఒకరకంగా తన పరిధికి లోబడే మాట్లాడాడు నాగబాబు. ఏకంగా బాలయ్యే భూములను పంచుకోవడానికి మీటింగ్ పెట్టుకున్నారా అని అనడంతో..... నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ఇక్కడి దాకా బాగానే ఉంది.
undefined
ఆ తరువాతే ఏకంగా ఆ విషయానికి రాజకీయ రంగును పులుముతు అనవసర వివాదానికి తెర తీసాడు. 2024 లో వైసీపీ కానీ, జనసేన-బీజేపీలు కానీ అధికారాన్ని చేబడుతాయని, అంతే కానీ.... టీడీపీకి ఆ ఛాన్స్ లేదని అన్నారు. అక్కడ అనవసరంగా రాజకీయాలను మధ్యలోకి లాగి వివాదాస్పదంగా మారారు.ఇక ఆ వివాదంతో టీడీపీని టార్గెట్ చేస్తున్న టీడీపీ మాత్రం అధికారంలోకి రాదూ అని అంటున్నారు. వైసీపీ తాము అధికారంలోకి వస్తామని, అంతే తప్ప మీరు మాత్రం అధికారం కనకండి అని పదే పదే అంటున్నారు.
undefined
అవినీతి చేసిన వారిని అరెస్టు చేయడంలో తప్పు లేదు. కానీ కక్ష సాధింపుకోసం ఈ అరెస్టులను చేయలేదని,మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండని, ఒక శాసనసభ్యుడిని అరెస్టు చేసే ముందు రాజ్యాంగ నిబంధనలు పాటించాలని,కానీ....అచ్చెన్నాయుడి అరెస్టులో అవి లోపించాయంటూజనసేన నాదెండ్ల మనోహర్ సంతకం చేసినఓ ప్రకటన విడుదల చేసింది.
undefined
ఇక పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మాత్రం అవినీతి అనే కాంటెక్స్ట్ ను వదిలేసి టీడీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. "టీడీపీ హయాం లో టీడీపీ నాయకురాలిని సోషల్ మీడియా లో ఏదో అన్నారు అని మా జనసేన కార్య కర్తల మీద దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేసి , వాళ్ళని గొడ్ల ని బాది నట్లు బాది,అంత హింస పెట్టిన టీడీపీ, ఇప్పడు ఒక నాయకుడి మీద స్కాం జరిగిందని పోలీస్ అరెస్ట్ చేస్తే టీడీపీ,,టీడీపీ అనుకూలమీడియా అంత గగ్గోలు పెడుతున్నారు,,వాళ్ళు ఆఫ్ట్రాల్ కార్యకర్తలు,, నాయకులు కారు అనేగా! అప్పట్లో మీ ఉద్దేశ్యం..కర్మకు మెనూ లేదు. మీకు ఏమి రావాల్సి ఉందొ అదే వస్తుంది.మా జనసేన కార్యకర్తల ని అరెస్ట్ చేసి కొట్టించిన పాపం టీడీపీ కి అంత తేలిగ్గా పోతుందా?" అని ట్వీట్ చేసారు. మా జనసైనికుల పట్ల మీరు వ్యవహరించిన తీరును మేము ఎప్పటికి మర్చిపోము అని అన్నారు.
undefined
సోషల్ మీడియాలో జనసైనికులు కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి మనుషులు జనసైనికుల మీద చేసిన దాడులకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ట్వీట్ చేస్తూ... ఇవి మీకు కనబడడం లేదా, ఇవి గుర్తు రావడంలేదా అని ట్వీట్ చేస్తున్నారు.
undefined
ఇప్పటికే పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి జగన్ తో చెట్టపట్టాలు వెస్కొని తిరుగుతున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన బృందం జగన్ ను కలవడానికి వచ్చినప్పుడు నాయకత్వం వహించడం దగ్గరి నుండి మూడు రాజధానుల విషయంలో మద్దతు వరకు ఆయన అన్ని విషయాల్లోనూ వైసీపీకి మద్దతుగా ఉన్నారు.
undefined
నాగబాబు కూడా ఆ జాబితాలో చేరిపోయారా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో వైసీపీ కోవెర్టు నాగబాబు ఎంఇఓ కూడా పోస్టులను పెడుతున్నారు.ఎన్నికల సమయంలో, ఎన్నికలకు ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎలాంటి వ్యాఖ్యలు చేసారో వేరుగా చెప్పనవసరం లేదు.
undefined
పవన్ కళ్యాణ్ గురించి చాలానీచంగా మాట్లాడారు. పదే పదే పవన్ ని ఆయన పర్సనల్ విషయాల్లో టార్గెట్ చేసారు. అయినప్పటికీ... నాగబాబు ఇలా వైసీపీకి మద్దతుగా మాట్లాడటం ఏమిటనే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. సోదరుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాగబాబును మందలించలేదా, లేదా పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోనే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది ఇక్కడ తేలాల్సిన అంశం.
undefined
click me!