ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం చుట్టూనే ప్రస్తుత రాజకీయాలన్నీ తిరుగుతున్నాయి. ఎలాగైనా మూడు రాజధానులను ఏర్పాటు చేసి విశాఖ నుంచి పాలించాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంకల్పిస్తే... అమరావతిలోని రాజధాని అనే నినాదాన్నీ ఎత్తుకొని ముందుకు పోతుంది టీడీపీ.
undefined
బీజేపీ, జనసేనలు రెండు కళ్ళసిద్ధాంతాన్ని పాటిస్తూ తాము అమరావతికి అన్యాయం జరగనివ్వమంటూనే... కేంద్రం మాత్రం ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు అంటున్నారు. కానీ బీజేపీలోని సుజనా చౌదరి వంటి వారు తరచుగా కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందంటూ మాట్లాడుతున్నారు.
undefined
టీడీపీ ఏమో విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు చెల్లవుఅని, చట్టంలోరాజధాని అని మాత్రమే పేర్కొన్నారు,రాజధానులు అని ఎక్కడా పేర్కొనలేదుకదా అని వాదిస్తున్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయడమంటే విభజన చట్టానికి తూట్లుపొడవడమే అని వాదిస్తున్నారు.
undefined
మూడు రాజధానులకుగవర్నర్ ఓకే అనడంతో హైకోర్టుకు సబ్మిట్ చేసిన అఫిడవిట్ లో కూడా విభజన చట్టంలోని అంశాలకు ఇది విరుద్ధం అంటూ ఫిర్యాదుదారులు వాదించారు. దీనితో జగన్ గత ఎన్నికలకు ముందు టీడీపీ పై ప్రయోగించిన ప్రత్యేక హోదా అస్త్రాన్ని బయటకు తీసాడు.
undefined
ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గెలుపుకు ప్రధాన కారణాల్లో స్పెషల్ స్టేటస్ కూడా ఒకటి. యూ టర్న్ బాబు అంటూ చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అంటూ విపరీతంగా విరుచుకుపడ్డ జగన్ అండ్ కో ఎన్నికలు అయిపోయాక దాన్ని చాలా తెలివిగా పక్కకు పెట్టేసారు.
undefined
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పూర్తి మెజారిటీఉండడంతో ఏమి చేయలేమని చేతులెత్తేశాడు జగన్ మోహన్ రెడ్డి. తన అవసరం ఉంటేతాను ఏమైనా చేయగలను కానీ... వారికే పూర్తి మెజారిటీ ఉన్న తరుణంలో తానేమి చేయలేనని చెప్పారు. మొన్న వైసీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన తరువాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ మూడు రాజధానుల అంశాన్ని గురించి ప్రస్తావించలేదు.
undefined
కానీ ఇన్ని రోజులతరువాత జగన్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మాత్రం ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు. ఇన్ని రోజులు బహుశా వారికి బీజేపీ కి ఉన్న సంబంధాల వల్ల ప్రత్యేక హోదా మీద బీజేపీనివైసీపీ వారు పెద్దగా ఇబ్బంది పెట్టలేదేమో!
undefined
కానీ ఇన్ని రోజులపాటు సైలెంట్ గా ఉన్న అంశాన్ని ఇప్పుడు తెర మీదకు తీసుకురావడం ఏదో మామూలుగా జరిగిన విషయం మాత్రం కాదు. జగన్ చాలా ఆలోచించిన తరువాతే ఈ విషయాన్నీ తన స్పీచ్ లో పొందుపరిచారు. అంత వివాదాస్పదమవుతున్నఅమరావతి విషయాన్నే సేఫ్ గా పక్కకు తప్పించిన జగన్ ఈ విషయాన్నీ మాత్రం పొందుపరచడం ఇక్కడ ఆలోచించాల్సిన వ్యవహారం.
undefined
విభజన చట్టం గురించి మాట్లాడితే.. తాను కూడా దాని గురించే మాట్లాడుతాను అనే విషయాన్నీ జగన్ ఇక్కడ చెప్పాలనుకుంటున్నాడు. విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తేనే విభజన చట్టం పై మాట్లాడే హక్కు కేంద్రానికి ఉందన్న చురక అంటిస్తూ... ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించేందుకు ఈ అవకాశాన్ని జగన్ వినియోగించుకోవాలనుకుంటున్నాడు.మూడు రాజధానుల విషయంలో గనుక విభజన చట్టాన్ని తీసుకొస్తే... అందులోని ప్రత్యేకహోదా పై కూడా మాట్లాడాల్సిందే అని జగన్ సర్కార్ అనే వీలుంటుంది. టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి కష్టం కలిగించేలా వ్యవహరించదు.టీడీపీ ఈ ప్రత్యేక హోదా మీద మాట్లాడలేరు. విభజన చట్టం పేరెత్తిన ప్రతిసారి వైసీపీ వారు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతారు. టీడీపీ ఇక్కడ ఏ విధంగా స్పందించినా అది వైసీపీకి లాభం.
undefined
ఒక వేళా టీడీపీ కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకుంటే టీడీపీకి బీజేపీకి మధ్య ఉన్న సంబంధం చెడిపోతుంది. అదే గనుక జరిగితే, టీడీపీ మరింత ఒంటరిగా మారి వైసీపీకి మరింత లాభం చేకూరుస్తుంది.ఒక వేళా టీడీపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడొద్దంటే విభజన చట్టం గురించి మాట్లాడడమే ఆపేయాలి. రెంటిలో ఏది జరిగినా లాభం మాత్రం వైసీపీకే! చూడబోతుంటే...ఈ ప్రత్యకహోదా అంశాన్ని ఇటు టీడీపీ పై అటు బీజేపీ పై వాడుతున్నారు జగన్. ఒకే దెబ్బకు రెండు పిట్టలు.
undefined