గంటా శ్రీనివాసరావు.... గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నానుతున్న పేరు. విశాఖ సిటీలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి. వైసీపీలో చేరుతున్నారు గంటా అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
undefined
ఆయన వైసీపీలో చేరబోతున్నారంటూ అనేక ముహుర్తాలు తెర మీదకు వచ్చాయి. ఆగస్టు 9 అని, ఆగస్టు 16 అని అనేక ముహూర్తాలను ప్రస్తావించినప్పటికీ... 16 ముహూర్తం ఫిక్స్ అయిందంటూ జోరుగా ప్రచారంసాగింది. ఆ 16వ తేదీ కూడా నిన్నటితో ముగిసింది. కానీ గంటా మాత్రం ఇంకా చేరలేదు.
undefined
ఇక ఇప్పుడు గంటా వైసీపీలో చేరకపోవడంపై అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. గంటా చేరికపై అధిష్టానం తొలుత సుముఖంగా ఉన్నప్పటికీ... పార్టీలోని సీనియర్లు కొందరు వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. మంత్రి అవంతి శ్రీనివాస్ బాహాటంగానే ఆయన చేరికను వ్యతిరేకించారు.
undefined
గంటా అవినీతి పరుడంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆయన అనుచరులు కొందరు భీమిలి నుండి వైజాగ్ సిటీ వరకు అనేక చోట్ల ర్యాలీలు, నిరసన ఓప్రదర్శనాలు చేపట్టారు. ఆయన చేరికను వ్యతిరేకించడంతోపాటుగా గతంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని సైతం కూలగొట్టించారు అవంతి అనేక సున్నితమైన సెంటిమెంటల్అంశాలను సైతం తెరపైకి తీసుకొచ్చారు.
undefined
ఇక గంటా ను మొదటినుండి కూడా విజయసాయి రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఆయన కరోనా వైరస్ బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సజ్జల ద్వారా గంటా జగన్ దగ్గర లైన్ క్లియర్ చేపించుకున్నారు. కానీ విజయసాయి రెడ్డి మరల ఆక్టివ్ అవడంతో ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్టయిందని అంటున్నారు.
undefined
ఆయనకు సంబంధించి ముఖ్యంగా కొన్ని విషయాలు వైసీపీ అధిష్టానం వద్ద గత కొన్ని రోజులుగా చర్చకు వస్తున్నాయని అంటున్నారు. గంటా ఇప్పటి వరకు ఏ ఒక్క నియోజకవర్గంలోను మరల పోటీచేసింది లేదు. ఆయన ప్రతిసారి పార్టీ మారుతారన్న విషయం పై జోరుగా చర్చ సాగింది.
undefined
గంటా మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పార్టీ బలోపేతం కన్నా తన వ్యక్తిగత బిజినెస్ ల బలోపేతానికి కృషి చేశారన్న విషయం పై అక్కడ ప్రస్తావనకు వచ్చినట్టుసమాచారం. ఆయన మేనల్లుడి వ్యవహారంపై కూడా పార్టీ అధిష్టానం పెదవి విరిచినట్టు చెబుతున్నారు.
undefined
బిజినెస్ విషయాలను పక్కనుంచితే గంటా గనుక చేరితే పార్టీకి లాభం కన్నా నష్టమే అధికంగా జరిగే ఆస్కారముందని పలువురు సీనియర్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఇంచార్జి విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి చాలా వ్యతిరేకంగా ఉన్నారు.
undefined
విశాఖలో రాజధానికి శంకుస్థాపన చేయడం ఎలాగూ ఆలస్యమవుతుంది కాబట్టి మరికొంతకాలం ఆయన వ్యవహారాన్ని అధిష్టానం హోల్డ్ లో ఉంచాలని అనుకుంటున్నట్టుగా కొందరు అంటున్నారు. అంతే కాకుండా గంటా సైతం విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ పూర్తిగా ప్రారంభమయ్యేంతవరకు ఆగుదామనుకుంటున్నట్టుగా ఒక టాక్.
undefined
ప్రస్తుతం ఈ విషయం కోర్టులకెక్కడంతో... ఇది ఎప్పుడు తేలుతుందో చెప్పడం కష్టం. ఇది ఇప్పుడప్పుడైతే తేలే విషయం కాదు. అప్పటివరకు గంటా పరిస్థితిఏమిటన్నది ఎవరికీ అర్థం కానీ పరిస్థితి. టీడీపీలోనే కొనసాగుదామంటే... ఇది ఇప్పుడు సమీకరణాల వల్ల కష్టమైనా పనిగా కనబడుతుంది. చూస్తుంటే గంటా పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారినట్టుగా ఉంది.
undefined