ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ పవన్ కళ్యాణ్.... ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో శాంతంగా ఉన్నట్టున్నారు. ప్రజలకు కష్టం వచ్చిందంటే అక్కడ నిలబడతాను అని చెప్పే, ప్రభుత్వాన్ని నిలదీస్తాను అని చెప్పే ఈయన అమరావతే రాజధాని అని గొంతెత్తి నినదించిన ఈయన ఇప్పుడు మాత్రంతెరపైన కనబడడం లేదు.
undefined
ఫార్మ్ హౌజ్ లో ఉంటూ పత్రికాప్రకటనలతో కాలం వెళ్లదీస్తున్నారు తప్ప.... బహిరంగంగా మాత్రం కనబడడం లేదు పవన్ కళ్యాణ్. తన ఫ్యాన్ పెళ్లి వేడుకకు హాజరయ్యేంత తీరిక ఉన్న పవన్ అమరావతి విషయంలో మాత్రం బయటకు రావడంలేదు. అమరావతి ప్రజలు పవన్ ని బయటకు రమ్మంటున్నారు.
undefined
ఇక ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆమోద ముద్ర వేసిన వెంటనే పవన్ కళ్యాణ్ వంటి వారు తీవ్రంగా స్పందించాల్సింది. ఆయన అమరావతి ప్రజలకు బాసటగా నిలిచాడు. వారంతా వచ్చి పవన్ కి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కన్నీళ్లను చూసి ఆయన కూడా కన్నీళ్లు పెట్టారు.
undefined
ఆయన ఆ ప్రాంతమంతా పర్యటించి వారి కోసం కడదాకా పోరాడుతానని అన్నాడు. వారి వెంటే నిలుస్తానని అన్నాడు. కానీ మూడు రాజధానుల విషయంలో మాత్రం పవన్ తన మాట నిలబెట్టుకోలేదు. రాజకీయ నాయకులంటేనే అంత అని అనవచ్చు. కానీ పవన్ మాత్రం తాను అందరిలాంటి వాడను కానని, తాను విలువలతో కూడిన రాజకీయం మాత్రమే చేస్తానని చెప్పాడు.
undefined
పవన్ కళ్యాణ్ మాత్రం తన రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తూ.... చాలా తెలివిగా సమాధానం ఇస్తున్నాను అన్నట్టుగా బీజేపీ మాదిరి ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తున్నారు. అమరావతి రైతుల కోసం పోరాడుతానని చెబుతూనే..... అన్ని వేల ఎకరాలను ఎందుకు సేకరించారని ప్రశ్నిస్తున్నారు.
undefined
ఆయన కర్ర విరగవద్దు పాము చావవద్దు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ పాడుతున్న పాటనే పాడుతున్నారు తప్ప ఆయన స్వతంత్రంగా రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నం మాత్రం చేయడం లేదు.
undefined
రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ ఏ విషయం మీద సరిగా పోరాడడు, నిలకడ లేని మనిషి అని ఇప్పటికే ఒకవాదన ఉంది. దానికి మరింత బలం చేకూరుస్తూ ఇప్పుడు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బీజేపీకి దగ్గరగా ఉండడానికి ఇది పనికివస్తుంది కానీ... రాజకీయంగా మాత్రం ఇది పవన్ కళ్యాణ్ కి మేలు చేయదు.
undefined
ఆయన ఉనికికి, అస్తిత్వానికి ఇదొక పరీక్ష. ఈ మధ్యకాలంలో ఆయన ఒక లీడర్ లా కన్నా, రాజకీయ నాయకుడిగా కనబడుతున్నారు. ఆయన బీజేపీతో కలిసినప్పటినుండి కేంద్రం ప్రాపకం కోసం ప్రాకులాడుతున్నాడు కానీ ఆయన రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నం మాత్రం చేయడంలేదు.
undefined
అప్పట్లో చిరంజీవి పార్టీ పెట్టినప్పటి పరిస్థితులే మనకు ఇక్కడ కనబడుతున్నాయి. సామాజిక,ఆ అంశాలపై ప్రశ్నిస్తానన్న చిరంజీవి... ఆ తరువాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పక్కకు తప్పుకున్నాడు.
undefined
ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీని విలీనం చేయలేదన్న మాటొక్కటే తప్పితే... ఫక్తు రాజకీయ నాయకుడిగానే కనబడుతున్నాడు. ఏ కోణానకూడా పోరాటబాటపట్టిన లీడర్ గా మాత్రం కనబడడం లేదు. చాతుర్మాస దీక్ష అనే ముసుగులో ఉన్నాడు. ప్రజల బాగుకోసం దీక్ష చేబూనానని చెబుతున్నప్పటికీ.... ఆ ప్రజలు కష్టం వచ్చిందని పిలుస్తున్నప్పటికీ.... పవన్ మాత్రంప్రజాక్షేత్రంలోకి మాత్రం రావడంలేదు.
undefined