నిమ్మగడ్డ రమేష్ కుమార్ 'పంచాయతీ': ఎన్నికలపై జగన్ వ్యూహరచన ఇదీ...

First Published | Jul 10, 2020, 5:31 PM IST

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అర్హత రూల్స్ ని మారుస్తూ, జస్టిస్ కనగరాజ్ ని తీసుకురావడం, హై కోర్టు దానికి అడ్డు చెప్పడం, ఆ తరువాత సుప్రీమ్ సైతం స్టే విధించడానికి వ్యతిరేకించడం అన్ని జరిగిపోయితయి. మరోమారు సైతం సుప్రీమ్ కోర్టులో జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు ఈ విషయమై రెండు రోజుల కింద చుక్కెదురైన విషయం తెలిసిందే. 

కరోనా వైరస్ ప్రబలుతుందని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది మొదలు..... నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. జాతీయ ఎలక్షన్ కమీషనర్ అయినా తెలిసి ఉండకపోవచ్చు కానీ.... నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలియకపోయే ఛాన్స్ మాత్రం లేదు.
undefined
ఆయన మీద అధికార వైసీపీ అధిష్టానం ఏ స్థాయిలో గుర్రుగా ఉందొ వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికలను వాయిదా వేయడం పై ఏకంగా జగన్ మోహన్ రెడ్డిగారే ఎంత తీవ్రంగా ఫైర్ అయ్యారో మనందరికీ తెలిసిందే. ఇక అక్కడి నుండి మొదలు ఇదేదో ప్రభుత్వానికి, రమేష్ కుమార్ కి మధ్య ఓపెన్ వార్ గా సీన్ మారిపోయింది. మీడియాలో ప్రచురిస్తున్న కథనాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, రాజకీయ పార్టీలు ఎంటర్ అయి ఈ విషయానికి రాజకీయ రంగును పులమడం అన్ని వెరసి ఈ పరిస్థితికి దారితీసింది.
undefined

Latest Videos


రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అర్హత రూల్స్ ని మారుస్తూ, జస్టిస్ కనగరాజ్ ని తీసుకురావడం, హై కోర్టు దానికి అడ్డు చెప్పడం, ఆ తరువాత సుప్రీమ్ సైతం స్టే విధించడానికి వ్యతిరేకించడం అన్ని జరిగిపోయితయి. మరోమారు సైతం సుప్రీమ్ కోర్టులో జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు ఈ విషయమై రెండు రోజుల కింద చుక్కెదురైనవిషయం తెలిసిందే.
undefined
హైకోర్టు తీర్పు పై స్టేవిధించమని మరోసారి ప్రభుత్వం అభ్యర్థించినప్పటికీ, సుప్రీం దాన్ని తోసిపుచ్చింది. ఎన్నికల పని ఆగకుండా తాత్కాలికంగా కమీషనర్ ని నియమించామని చేసిన అభ్యర్థనను సైతం సుప్రీమ్ కోర్టు కొట్టిపారేసింది.
undefined
ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ గురించి తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయకున్నప్పటికీ..... పూర్తి విచారణను సాధ్యమైనంత త్వరలో ఒక మూడు వారాల్లోపేముగిస్తామని సుప్రీమ్ వ్యాఖ్యానించింది.ఈ కేసులోమధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఫైనల్ ఆర్డర్ ఇస్తామని, ఈ కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.గతంలోనే ఈ విషయమై స్టేకు నిరాకరించిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది.
undefined
జరిగిన పరిణామాలను బట్టి చూస్తుంటే... ఆంధ్రప్రదేశ్ సర్కారుకు తీర్పు అనుకూలంగా వచ్చే ఆస్కారం కనిపించడం లేదు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పదవి కాలాన్ని నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ...రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండేవారి హక్కులను కాలరాసేలా, వారి ప్రయోజనాలకు విరుద్ధంగా వారి సర్వీస్ కండిషన్స్ ని మార్చరాదు.
undefined
ఇదే విషయాన్నీ అనుసరించి హై కోర్టు తీర్పును వెలువరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం ఈ విషయాన్నిపరిగణలోకి తీసుకొనే హై కోర్టు తీర్పు పై స్టే విధించడానికి నిరాకరించిందన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి తీర్పు పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
undefined
తీర్పు ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ప్రభుత్వం నియమించక తప్పదు. ఒకవేళ మరల ప్రభుత్వం తాము ఆర్డర్ ఇవ్వాల్సిందే వంటి క్లాజులు పెట్టకుండా చేరిపోతున్నారు విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అని కోర్టు ఉత్తర్వులను జారీచేసినా కూడాఆశ్చర్యపోనక్కర్లేదు.
undefined
ఈ పరిస్థితుల నేపథ్యంలో రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలుచేపట్టడం తథ్యం. ఆయన పదవిని చేపడితే తమకు రాజకీయంగా చిక్కులు తప్పవని వైసీపీ క్యాంపు భావిస్తుంది.
undefined
గతంలో సైతం రమేష్ కుమార్ రాష్ట్రంలో నెలకొన్న హింస గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఏకగ్రీవాలపై కూడా ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేసారు. ఇక మీదట రమేష్ కుమార్ మరింత స్ట్రిక్ట్ గా వ్యవహరించడం తథ్యం.
undefined
ఇదే జరిగితే వైసీపీ సర్కారుకు మరిన్ని చిక్కులు తప్పవు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని చూపెట్టి రమేష్ కుమార్ పదవి కాలం పూర్తయ్యేంతవరకు ఎన్నికలను వాయిదా వేయాలనే యోచనలో సర్కార్ ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది.
undefined
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పుడప్పుడయితే నిర్వహించే వీలుండదు. కాబట్టి మరికొన్ని రోజులు, రమేష్ కుమార్ దిగిపోయేంతవరకు వాయిదా వేస్తే అన్ని విధాలా శ్రేయస్కరం అని వైసీపీ వర్గాలు అనుకుంటున్నట్టుగా తెలియవస్తుంది.
undefined
ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. బహిరంగంగా పార్టీలోని ఎవరైనా ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చేయంతవరకు వేచి చూడాల్సిందే. ఇదేగనుక నిజమయితే....ఇక ఏకగ్రీవాలయినవారిపరిస్థితి, డబ్బు ఖర్చు పెట్టినవారి పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారుతుందనడంలో ఎటువంటి డౌట్ లేదు.
undefined
click me!