ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కరోనా వైరస్ పుణ్యమాని అమరావతి అంశం ఒకింత మరుగున పడింది. గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశాన్ని పేర్కొనడం, మండలిలో అందుకు సంబంధించిన బిల్లును మరోసారి ప్రవేశపెట్టడం దాన్ని అడ్డుకోవడం అన్ని జరిగిపోయాయి. ఇంతలోనే అమరావతి ఉద్యమం ప్రారంభమై 200 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి ప్రాంతవాసులు మరోసారి తమ ఉద్యమానికి పునరంకితమవుతున్నామన్నట్టుగా ప్రదర్శనలు నిర్వహించారు.
undefined
ఈ ప్రదర్శనల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్తగా అమరావతిని దక్షిణ అయోధ్యగా పేర్కొంటూ అమరావతిలో రామ మందిర నిర్మాణం అనే ఆసక్తికర నినాదం వినబడింది.హిందూ మహాసభకు చెందిన చక్రపాణి మహారాజ్ ఆ వ్యాఖ్యలను చేసారు.. ఆయన వ్యాఖ్యలను చేయగానే వైసీపీని ఇరకాటంలో పెట్టడానికి చూస్తున్న రఘురామా కృష్ణం రాజు లక్ష రూపాయల విరాళాన్ని రామమందిర నిర్మాణానికి ప్రకటించారు.
undefined
భద్రాచలంలో రామ మందిరం ఉందికదా, గోదావరిని దక్షిణ గంగ అని కూడా అంటారు కదా అనే విషయాన్నీ కొద్దీ సేపు పక్కన పెడితే... ఈ రామ మందిర నిర్మాణానికి ఇచ్చిన పిలుపు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనేది మాత్రం తేటతెల్లం. హిందూ మహాసభ బీజేపీ అనుబంధ సంస్థ అనేది అందరికి తెలిసిన విషయం.
undefined
బీజేపీ అమరావతి ఉద్యమంలోకి ఎంటర్ అయ్యి లాభం పొందాలి అని అనుకుంటున్నట్టుగా కనబడుతుంది ఈ అన్ని పరిస్థితులను చూస్తుంటే. బీజేపీ నేతలు ఇప్పటికే అమరావతి నే రాజధానిగా కొనసాగించాలంటూ ఉద్యమాలను నడుపుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు బీజేపీ ఈ అమరావతి ఉద్యమానికి మద్దతిస్తున్నప్పటికీ.... కేంద్రం మాత్రం మూడు రాజధానుల విషయంలో ఏమీ చేయలేదని చెబుతున్నారు.
undefined
కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.... అమరావతి ఉద్యమాన్ని గనుక కరెక్ట్ గా వాడుకుంటే తాము రాష్ట్రంలో పాగా వేయొచ్చని బీజేపీ శ్రేణులు ఆలోచిస్తున్నట్టుగా కనబడుతున్నాయి.ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో అధికారం బీజేపీకి అవసరం లేదు. బీజేపీకి 2024లో రాష్ట్రంలోని ఎంపీ సీట్లు అవసరం. ఏపీలో 25 పార్లమెంటు సీట్లున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చిన ఎంపీ సీట్లే కారణం అన్న విషయంఅందరికి తెలిసిందే.
undefined
దేశంలో ఇప్పటికే హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో బీజేపీ గత రెండు పర్యాయాలుగా దాదాపుగా అన్ని సీట్లను గెలుచుకుంది. అక్కడ స్థానిక ఎంపిలనుమార్చింది కూడా లేదు. మరో పర్యాయం ఓట్లు తెచ్చుకోవడం ఒకింత కష్టం. ఈ నేపథ్యంలో బీజేపీ ఇంకా బలపడనిబెంగాల్, తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు వారికి మంచి గ్రౌండ్స్ గా కనబడుతున్నాయి.
undefined
ఈ నేపథ్యంలోనే 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీ సీట్లు బీజేపీకిఅత్యంత అవసరం. వారి అన్ని ప్రయత్నాలు కూడా అందుకోసమే. ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనాసరే తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్నిఏర్పరుచుకొని తమ మార్కు రాజకీయాలను చేయాలనీ చూస్తున్నారు. ఈ రామ మందిరం కూడా అందులోంచి పుట్టిందే.
undefined
అమరావతి ఉద్యమాన్ని గనుక రామ మందిర ఉద్యమంతో జతచేయగలిగితే బీజేపీకి ఒక ప్రత్యేకమైన హిందుత్వ కార్డును ప్రయోగించడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డిపై హిందూ వ్యతిరేకి అనే ముద్రను వేయడానికి తీవ్ర ప్రయత్నాలను చేస్తుంది బీజేపీ. టీటీడీ విషయం నుంచి ఇంగ్లీష్ మీడియం వరకు అన్ని విషయాల్లోనూ మనకు ఇది కనబడుతుంది.
undefined
కాబట్టి వారు హిందుత్వాన్ని గనుక అమరావతి ఉద్యమంతో లింక్ చేస్తే లాభాపడొచ్చు అని చూస్తున్నారు. కుదిరితే దీనివల్ల రెండు లాభాలు కనబడుతున్నాయి. మొదటగా జగన్ మోహన్ రెడ్డి తో పోరాడడం అయితే రెండవది అమరావతి ఉద్యమాన్ని టీడీపీ ఉద్యమంగా కాకుండా బీజేపీ ఉద్యమం అని కూడా చూపెట్టాలనుకుంటుంది.(అమరావతి ప్రజా ఉద్యమం అయినప్పటికీ... బయటకు కేవలం అది టీడీపీ ఉద్యమంగానే ప్రొజెక్ట్ చేయబడుతుందన్నది వాస్తవం)
undefined
ఈ ఉద్యమం ద్వారాలాభపడి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరిద్దామని బీజేపీ ప్రయత్నం చేస్తున్నప్పటికీ... అది సాధ్యపడడం లేదు. వైసీపీ బ్యాటింగ్ ని తట్టుకోలేకటీడీపీ వారు క్యూలు కడుతారు అనుకున్నప్పటికీ... అది సాధ్యపడలేదు. సాధ్యపడకపోగా ప్రతిపక్షాల్లోని ముఖ్యనాయకులంతా వైసీపీలోకి వెళుతున్నారు.ఈ నేపథ్యంలోనే బీజేపీ జనసేన టీడీపీలతో కలవాలి అని యోచిస్తోంది.
undefined
ఇలా గనుక బీజేపీ అమరావతి ఉద్యమంలోకి ఎంటర్ అయితే బీజేపీ, టీడీపీ,జనసేన తో కలిసి ఒక సోషల్ ఇంజనీరింగ్ చేసి, తమ హిందుత్వ కార్డును ప్రయోగించి జగన్ మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకి అని చూపెట్టి లాభపడాలని కాషాయ పార్టీచూస్తుంది.
undefined
ఒకవేళ గనుక ఇది సాధ్యపడకపోతే... వచ్చే ఎన్నికల సమయానికి కూడా వైసీపీనే బలంగా ఉంటే వారితో పోస్ట్ పోల్ అలయన్స్ పెట్టుకుంటుంది. ఇది అమరావతిలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయం. ఈ రాజకీయాలు ఎటు పోతాయి అనేది కరెక్ట్ గా చెప్పలేకున్నప్పటికీ... ఒక విషయాన్నీ మాత్రం చెప్పవచ్చు. వైసీపీ మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేయలేదు. అవసరమైతే పోస్ట్ పోల్ అలయన్స్ లో మద్దతిస్తుంది.
undefined