జగన్ కు చిక్కులు: పక్కా వ్యూహంతో రఘురామకృష్ణం రాజు!

First Published | Jun 17, 2020, 10:56 AM IST

రఘురామా కృష్ణంరాజు వైసీపీ పై ఈ స్థాయిలో వ్యాఖలు చేయడంతో వైసీపీ పార్టీ సీనియర్ నేతలు, ఆయన సామాజికవర్గానికి చెందిన ఇతర నేతలు, ఆ జిల్లాకే చెందిన నాయకులూ ఆయనను తూర్పార పడుతున్నారు. ఆయన చర్యల వల్ల పార్టీ అభిమానులు, కార్యకర్తలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే అని వారు ఆరోపిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బడ్జెట్ సమావేశాల కన్నా, కరోనా మహమ్మరి కన్నా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు గురించిన చర్చే నడుస్తుంది. తనను కాళ్లావేళ్లా బ్రతిమిలాడితే తాను వైసీపీలో చేరానని, తాను కాబట్టే నరసాపురం సెగ్మెంట్ లో వైసీపీ విజయదుందుభి మోగించిందని అన్నారు. తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుకు కౌంటర్ ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
undefined
రఘురామా కృష్ణంరాజువైసీపీ పై ఈ స్థాయిలో వ్యాఖలు చేయడంతో వైసీపీ పార్టీ సీనియర్ నేతలు, ఆయన సామాజికవర్గానికి చెందిన ఇతర నేతలు, ఆ జిల్లాకే చెందిన నాయకులూ ఆయనను తూర్పార పడుతున్నారు. ఆయన చర్యల వల్ల పార్టీ అభిమానులు, కార్యకర్తలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే అని వారు ఆరోపిస్తున్నారు.
undefined

Latest Videos


ఇక నిన్న సాయంత్రం ఒక టీవీ ఛానెల్లో జరిగిన ఒక డిబేట్ ఆయన రఘురామా కృష్ణం రాజు వ్యాఖ్యలను, ఆయనకు కౌంటర్ ఇస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను గనుక పరిశీలిస్తే....మనము కొన్ని అంచనాలను వేయవచ్చు.
undefined
మొదటగా అందరువైసీపీ నేతలు ఆయనపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. వైసీపీ నేతలు ఆయనపై ఫైర్ అవుతున్నారంటే.... వారాంతలవారు అవుతున్నారు అని మనము అనుకోలేము. ముఖ్యంగా గోదావరి జిల్లాల నాయకులతో రఘురామకృష్ణం రాజుకి మంచి పరిచయాలున్నాయి. రోజు మాట్లాడుకుంటుంటారు కూడా. నిన్న రాత్రి జరిగిన డిస్కషన్ అందరిని ఆయన పేర్లు పెట్టేపిలిచారు. వారు కూడా అలానే రెస్పాండ్అయ్యారు. ఫ్రెండ్లీ గా మాట్లాడుకున్నారు.
undefined
ఈ పరిస్థితులనుబట్టి చూస్తుంటే... ఆ మాట్లాడుతున్న ఎమ్మెల్యేలంతా కూడా వైసీపీ అధిష్ఠానం ఆశిస్సులతోనే మాట్లాడుతున్నారనే విషయం అర్థమవుతుంది. ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడితే... వైసీపీ అధిష్ఠానమే వారితోనే మాట్లాడిస్తుందా అనే అనుమానం మాత్రం కలుగక మానదు.
undefined
వైసీపీ నేతలు తనపై ఇలా మాటల దాడి చేస్తుంటే.... రఘురామకృష్ణంరాజు మాత్రం తాను మాత్రం వైసీపీలోనే ఉండాలి అనుకుంటున్నానని, తన గుండెలమీద చెయ్యి వేసి చెబుతున్నానని అంటున్నారు. నిన్న చర్చ కార్యక్రమంలో ఎమ్మెల్యేలందరినీ... జగన్ తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి మనం కూర్చిని సెటిల్ చేసుకుందాము అని అన్నారు.
undefined
ఆయన ఇప్పటికి కూడా వైసీపీ నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద మాత్రమే ఆరోపణలు చేస్తున్నారు, విరుచుకుపడుతున్నారుతప్ప జగన్ ని ఒక్కమాట కూడా అనడంలేదు. ఇలా ఒక నేత సమస్యలు ఉన్నాయి అని కలవడానికి ప్రయత్నిస్తుండగా ముఖ్యమంత్రి జగన్ కలవడంలేదని ఆయన వాపోయారు.
undefined
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రఘురామకృష్ణంరాజుతో కూర్చి మాట్లాడలేరు జగన్. పార్టీకి ఆయనకు మధ్య పెరిగిన గ్యాప్ మరింతగా పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. ఈ స్థితిలో జగన్ కూడా కూర్చీబెట్టి మాట్లాడలేరు. పొలిటికల్ గా అది రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుందని వైసీపీ వారు భావించడమే కాకుండా జగన్ వ్యక్తిగతంగా కూడా అందుకు సుముఖంగా ఉండబోరు.
undefined
మరి నెక్స్ట్ ఏమిటి..? ఆయన రాజినామా చేసిపోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారు. నన్ను తొలిగించండి అని రఘురామకృష్ణంరాజు అంటున్నారు. జగన్ శైలికి పూర్తి భిన్నంగా ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్నారు. సాధారణముగా ఇలాంటి పరిస్థితుల్లో జగన్ వారిని ఈపాటికి పార్టీ నుండి బహిష్కరించి ఉండేవాడు.
undefined
కానీ రఘురామకృష్ణంరాజు విషయంలో అలా చేయలేకపోతున్నారు.కారణం ఆయన వైసీపీ నుండి వెళితే...చేరేది బీజేపీలో. బీజేపీ అనే ఒక ఆలంబన ఉంది అన్న మెసేజ్ పోవడంతోపాటుగా ఆయన మరికొంతమంది ఎంపిలను కూడా తీసుకొని పోయేప్రమాదం లేకపోలేదు.
undefined
అదే గనుక జరిగితే... అసంతృప్త వైసీపీ నేతలంతా బీజేపీవైపుగా చూడడం మొదలవుతుంది. బీజేపీతో వైసీపీ ప్రత్యక్ష యుద్ధానికి ఎంతమాత్రమూ దిగలేదు. ఆ రాజకీయ కోణాలు అందుకు తగ్గట్టుగా ఉన్నాయి.
undefined
ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో ఆయన రఘురామా కృష్ణంరాజుపై సొంతపార్టీ నేతలతోనే దాడి చేపిస్తున్నారన్నట్టుగా గుసగుసలు వినపడుతున్నాయి. కానీ ఇలా ఒక్క పార్టీలోనే అందరూ ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటే... అనేక లోగుట్టులు కూడా బయటపడే ఆస్కారం ఉంది. ఇది వైసీపీ కి ఒక పార్టీగా ఎంతమాత్రం కూడా మంచిది కాదు.
undefined
ఇదే గనుక కొనసాగితే... వైసీపీలో అక్రమాలు సమయ నేతల మీద తాజాగా సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ నేతలు తమ హయాంలో ఇసుకను భోంచేసారు అని చెప్పే వైసీపీ అధికారపీఠాన్ని ఎక్కింది. అలంటి వైసీపీలో కూడా ఇప్పుడు అవినీతి ఛాయలు ఇలా నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలు వల్ల బయటపడుతున్నాయి.
undefined
click me!