ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా రాజకీయ చిత్రపఠంపైన కనబడడం లేదు. హీరో నితిన్ పవన్ కళ్యాణ్ ని తన పెళ్ళికి ఆహ్వానించడానికి వెళ్ళాడు అన్నప్పుడు ఆయన గురించిన ఒక వార్త వినబడడం తప్ప పవన్ ఈ మధ్య పెద్దగా చర్చలో మాత్రం లేరు.

ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత పవన్ కళ్యాణ్ నైరాశ్యంలో కూరుకొనిపోకుండా తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానని, ప్రజల పక్షాన పోరాడుతానని అన్నాడు. ఆయన ఎంచుకున్న మార్గాన్ని అందరూ కొనియాడారు.

అన్నట్టుగానే ఆయన ప్రజాక్షేత్రంలోనే నిలబడ్డాడు. ప్రజా సమస్యలపై పోరాడాడు. రాష్ట్రంలో ఇసుక కొరత సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల తరుఫున పోరాడాడు. ఆయన చేపట్టిన ఇసుక దీక్ష భారిస్థాయిలోనే సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఆయన ప్రజా సమస్యలపైన పోరాటం మొదలుపెట్టడంతో అంతా ఆయనను అభినందించారు కూడా.

ఇక ఆ తరువాత కాకినాడలో ద్వారంపూడి ఇంటి వద్ద జరిగిన సంఘటన కార్యకర్తల్లో తమకు అన్యాయం జరిగితే తమ నాయకుడు ముందుంటాడు అన్న నమ్మకం కలిగించేలా కూడా చేసింది. పవన్ రాజకీయంగా ఎదుగుతున్నాడు అనుకుంటున్నా తరుణంలోనే ఆయన బీజేపీతో కలిసాడు.

బీజేపీతో ఆయన ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు అనేది ఆయన వ్యక్తిగతం. బహుశా పార్టీకి అవసరమైన ఒక అండ బీజేపీ ద్వారా దొరకబుచ్చుకుందామనుకున్న ఆలోచన కాబోలు ఆయన పొత్తు పెట్టుకున్నారు. అమరావతి అంశం కూడా ఇదే సమయంలో చేతికందడంతో ఆయన మరింతగా కూడా దూసుకుపోతున్నట్టుగా కనబడ్డారు. ఆ సమయంలోనే సినిమాల్లో కూడా నటిస్తుండడంతో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ... సినిమాలు తనకు జీవనభృతి అని చెప్పి దాన్ని డిఫెండ్ చేసుకున్నాడు.

ఇప్పుడు ఈ లాక్ డౌన్ కాలంలో సినిమా షూటింగులు కూడా లేవు. అందునా తాజాగా అమరావతి ఉద్యమం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భం. ప్రతిపక్ష నేతలంతా మాట్లాడారు. రెబెల్ ఎంపీ రఘురామ సైతం మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించడంలేదు. పత్రికల్లో మాత్రం బలమైన ప్రకటనలను వదులుతున్నాడు తప్ప మనిషి మాత్రం కనబడడం లేదు.

ఒక నాయకుడు అనేవాడు రాష్ట్రస్థాయిలో ఎంత గొప్ప నాయకుడైనప్పటికీ... ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలవాల్సిందే. ఆ నియోజకవర్గానికి ఎప్పటికి దగ్గరగా ఉన్నాననే సంకేతం ఇవ్వాల్సిందే. జగన్, చంద్రబాబు, కేసీఆర్, హరీష్ రావు, ఎవరైనా ఆయా నియోజకవర్గాల్లో గెలిచినా ఓడినా అక్కడి ప్రజలకు నిత్యం టచ్ లో ఉంటారు.

కానీ పవన్ మాత్రం గాజువాక కానీ, భీమవరంలో కానీ ఈ మధ్యకాలంలో పర్యటించిన దాఖలాలు మాత్రం లేవు. ఆయన తన నియోజకవర్గ ప్రజలతో వెళ్లి కలిసింది, వారి సమస్యలపై పోరాడింది లేదు. ఆయన రాష్ట్రస్థాయి నాయకుడవ్వొచ్చు, పార్టీ అధినేత అవ్వొచ్చు కానీ ఆయన గనుక నియోజకవర్గ ప్రజలతో దూరంగా ఉంటే ఏం జరుగుతుందో లోక్ సత్త జేపీ ఉదాహరణ నిరూపిస్తుంది.

ప్రత్యక్ష రాజకీయాలకు ప్రతిపక్షం పదే పదే విమర్శించే లోకేష్ సైతం ఈ విషయంలో పవన్ కన్నా ముందున్నాడు. మంగళగిరి పరిధిలో ఎవరు పెళ్ళికి పిలిచినా ఖచ్చితంగా అటెండ్ అవుతారు. సాధారణంగా కూడా నియోజకవర్గానికి వెళ్లి వస్తూనే ఉంటాడు.

పవన్ వాస్తవంగా రఘురామ ఇష్యూని పూర్తిస్థాయిలో వైసీపీని ఎండగట్టడానికి వాడుకొని ఉండవచ్చు. భీమవరం ఆయన నియోజకవర్గం. రఘురామ చెప్పిన కొట్టు సత్యనారాయణ, ఇతర వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారంటూ అధికార పక్షాన్ని ఆ జిల్లాలో నిలదీసే ఆస్కారం కూడా ఉంది.

కానీ పవన్ ఆ దిశగా చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాను అనే ఒక కాన్సెప్ట్ మీద ముందుకువెళ్లి ఉంటే బాగుండేది. ఆ విధంగా ఆయన తన నియోజికవర్గంతోపాటుగా ఆయన సామాజికవర్గం ప్రభావం అధికంగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక పునాది నిర్మించుకోవడానికి మంచి అవకాశం దక్కి ఉండేది. చూస్తుంటే పవన్ లోకేష్ ని చూసి నేర్చుకోవాలన్నట్టుగా ఉంది.