2019 ఎన్నికల్లో జగన్ అప్రతిహత విజయం సాధించి తిరుగులేని నాయకుడిగా నిలిచాడు. ఆయన దెబ్బకు రాష్ట్రంలో టీడీపీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. రాయలసీమలో అయితే మూడంటే మూడే సీట్లు గెలిచింది టీడీపీ.ఒకరకంగా జగన్ తన సీమ సామ్రాజ్యాన్నిక్లీన్ స్వీప్ చేసారు.
undefined
వైసీపీ విజయంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా జగన్ గుత్తాధిపత్యం మొదలయిందని చెప్పవచ్చు. కేవలం 23 ఎమ్మెల్యే సీట్లతో టీడీపీ కుదేలవగా... అధినేత ఓటమితో జనసేన నైరాశ్యంలో ఉండిపోయింది. బీజేపీ మరోసారి ఖాతా ఓపెన్ చేయడంలో విఫలమయింది.
undefined
గెలుపు మాదే అని బీరాలు పలికినటీడీపీ క్యాంపు ఒక్కసారిగా కుదేలయింది. వారికి ఎందుకు ఓడిపోయామో తెలుసుకోవడానికే సమయం సరిపోయేదిలా కనిపించింది. వారి క్యాడర్ అంతా నైరాశ్యంలోకి జారుకుంది. దానికి తోడు మాజీ ఎమ్మెల్యేలు, రెండవ శ్రేణి నాయకులు వైసీపీలోకి క్యూ కట్టడం టీడీపీని మరింతగా కృంగదీసింది.
undefined
జనసేన పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ఏకంగా అధినేత ఓడిపోవడం, అందునా రెండు స్థానాల్లోనూ పరాభవం వారిని సైతం నిరుత్సాహంలోకి నెట్టివేసింది. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే సైతం జగన్ కి జై కొడుతూ ఉండడం ఆ పార్టీలో మరింత గందరగోళ పరిస్థితిని సృష్టించింది.
undefined
ఇక ఈ పరిస్థితుల నడుమ అసలు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ప్రతిపక్షం అనేది పూర్తిగా బలహీన పడిపోయింది అనుకుంటున్నా తరుణంలో మూడు రాజధానుల అంశం వారిలో నూతన ఊపిరులు ఊదింది. ప్రతిపక్షం ఏకమైనప్పటికీ... అధికార వైసీపీ వారిని గట్టిగానే ఎదుర్కొంది.
undefined
టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిలు పార్టీని వీడి జగన్ క్యాంపులో చేరిపోయారు. వారంతా ఇప్పుడు టెక్నికల్ గా టీడీపీ అయినప్పటికీ.... విమర్శలన్నీ చంద్రబాబు పైన్నే. జనసేనను కూడా ఇదే విధంగా దారుణంగా దెబ్బ తీసింది వైసీపీ.
undefined
ఆపరేషన్ ఆకర్ష్ ల తరువాత కూడా కొద్దిమంది వైసీపీలో చేరడానికి ముందుకు రాలేదు. అప్పుడు రాజకీయాల్లో బ్రహ్మాస్త్రమైన పాతకేసులను తిరగతోడడం అనే అస్త్రాన్ని ప్రయోగించింది. ఆ అస్త్రంలోచిక్కి ఇప్పుడు అచ్చెన్నాయుడు వంటి నేతలు విలవిలలాడుతుండగా, పితాని వంటి వారు ఎప్పుడు ఆ అస్త్రం తమపైకి వస్తుందో అని బిక్కుబిక్కుమంటున్నారు.
undefined
ఇలా అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతున్నప్పటికీ... పైచేయి మాత్రం అధికార పక్షానిదే. అధికార పక్షానికి సంక్షేమ పథకాల అండ కూడా ఉండడంతో వారు మరింతగా దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో వారికి వారి సొంత పార్టీ నుండే ఒకరు కొరకరాని కొయ్యగా మారారు.
undefined
అతనే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. గెలిచిన తరువాత కూడా చిన్న చిన్న స్పర్థలు వచ్చినప్పటికీ... దాన్ని సెటిల్ చేసుకోగలిగారు. కానీ ఆ తరువాత నుంచి పార్టీకి ఆయనకు మధ్య గ్యాప్ నానాటికి పెరుగుతుంది. టీటీడీ భూముల విషయంలో తొలిసారి తన సొంత ప్రభుత్వాన్ని తప్పుబట్టిన రఘురామ ... ఆతరువాత ఎక్కడా తన దాడిని ఆపలేదు.
undefined
వైసీపీ అధిష్టానం ఎవ్వరిని చర్చలకు వెళ్లొద్దు అని చెప్పినప్పటికీ... ఆయాఛానెళ్లకు చర్చలకు వెళ్లి మరి ఆయన తన పార్టీని తూర్పారబట్టారు. ఇసుక అక్రమ రవాణా నుంచి అవినీతి వరకు ఒక్కటేమిటి అన్ని విషయాల్లోనూ వైసీపీ నేతలను ఏకి పారేశారు.
undefined
ఆయన్నొక్కటంటే ఆయన నాలుగంటూ వైసీపీ నేతలను ఉతికిపారేస్తున్నారు. ఆయనను తొలుత సాధారణ నేతలు కౌంటర్ చేసినప్పటికీ... ఒక రెండు రోజులయ్యేసరికి ఆయనను టార్గెట్ చేయడానికి మంత్రులు సైతం పూనుకున్నారు.
undefined
ఇక ఆయనకు షో కాజ్ నోటీసు ఇవ్వడంతో యావత్ వైసీపీ ఒక వైపు ఆయనొక్కడు ఒకవైపుగా సీన్ మారింది. మొత్తం వైసీపీ క్యాడర్, మంత్రులు, ముఖ్యమంత్రి అంతా ఒక్కటయ్యారు. ఆయన మాత్రం ఎన్నికల కమిషన్ కి వెళ్లి ఏకంగా వైసీపీ పైన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు వాడడం ఏమిటని, అది మరొక పార్టీ అని అన్నారు. ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి ఏమిటని ఆ నోటీసును ఇచ్చిన విజయసాయి రెడ్డినిఎద్దేవా చేసారు.
undefined
ఇక వైసీపీ ఎంపీలంతా ప్రత్యేకవిమానంలో ఢిల్లీ వెళ్లి రఘురామ మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్ కికంప్లైంట్ ఇచ్చారు. ఆయన సీటును సైతం వెనక్కు మార్చారు. ఇంత జరుగుతున్నప్పటికీ... ఆయన మాత్రం సింహం కూర్చున్నదే సింహాసనం అంటూ దూసుకుపోతున్నారు.
undefined
ఒక గోదావరి జిల్లాలకు చెందిన చిన్న నాయకుడు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర స్థాయి ఇమేజ్ పొందాడు. ఆయన తెలియని తెలుగువాడు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఒక్క వ్యక్తిని జగన్ సహా ఆయన అంగ బలం అంతా కలిసి ఏమీ చేయలేకపోయారని ఒక ఇమేజ్ మాత్రం ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.
undefined
రాష్ట్రంలోని అసెంబ్లీ వరకే పరిమితమైన ఈ పరిస్థితి ఇప్పుడు దేశ రాజధానిలోని పార్లమెంటుకు చేరింది. తనను ఏమీ చేయలేక ఇప్పుడు తన సీటును మార్చి సంతోషించాలని అనుకుంటున్నారని రఘురామమరోసారి వైసీపీపై విరుచుకుపడ్డారు. దీనివల్ల నష్టం మాత్రం వైసీపీకే!
undefined