ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రులు ఎవరు అనే విషయంలో కూడా స్పష్టత వచ్చేయడంతో మరల మూడు రాజధానుల బిల్లుపై అందరి దృష్టి పడింది. ఈ బిల్లు గవర్నర్ వద్ద ఉండడంతో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది. ఈ బిల్లుకు ఖచ్చితంగా గవర్నర్ ఆమోదం లభిస్తుందనివైసీపీ అంటుంటే.... టీడీపీఏమో బిల్లుకు ఆమోదం తెలపవద్దుఅంటూ లేఖలు రాసారు.
undefined
బిల్లు విషయంలో టెక్నికల్ అంశాలను ప్రస్తావించడంతోపాటుగా అమరావతి ప్రాంత ప్రజల ఆకాంక్షను కూడా పరిగణలోకి తీసుకోండి అంటూ ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. బిల్లు విషయంలో మూడు అభ్యంతరాలను ప్రధానంగా తెలుపుతుంది టీడీపీ.
undefined
ఇప్పటికే ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి రిఫర్చేసి ఉండడం ఒకటయితే, కోర్టులో ఉండడం రెండవది, విభజన అంశాలతో కూడా ముడిపడి ఉన్నదీ అనేది మూడవది. ఈ మూడు అంశాలను ప్రస్తావిస్తూ టీడీపీ పదే పదే ఈ బిల్లును పాస్ చేయొద్దు అని కోరుతున్నారు.
undefined
కానీ, ఈ సాంకేతిక కారణాలు బిల్లును అడ్డుకోలేవు. గవర్నర్ గనుక ఈ బిల్లును పాస్ చేయాలి అనుకుంటే చేసేయవచ్చు. ఈ విషయాలేవీ కూడా అడ్డుకాబోవు. గవర్నర్ ఆమోదం తెలపాలి అనుకుంటే తెలుపుతారు. అది పూర్తిగా ఆయన విచక్షణాధికారం.
undefined
ఈ రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదిస్తాడా లేదా అనే విషయాన్నీ పక్కనబెడితే... గవర్నర్ తీసుకునే నిర్ణయం మనకు జగన్ సర్కారుతో బీజేపీ వైఖరి ఎలా ఉంది అనే విషయంపై స్పష్టత వస్తుంది.
undefined
గవర్నర్ పదవి రాజకీయాలకు అతీతం. కానీ యాక్టీవ్ పొలిటీషియన్స్ రాష్ట్ర గవర్నర్లుగా నియమింపబడటం మొదలైనప్పటినుండి కొన్ని సార్లు గవర్నర్ నిర్ణయాలను కోర్టులు సైతం తప్పుబట్టాయి. ఢిల్లీ విషయంలో లెఫ్టనెంట్ గవర్నర్ కి సీఎం కేజ్రీవాల్ కి మధ్య జరిగిన రచ్చను యావత్ దేశం చూసింది.
undefined
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పూర్వాశ్రమంలోఒడిశా బీజేపీలో సీనియర్ నాయకుడు. ఆయన ఇప్పుడు ఏపీ గవర్నర్. కొద్దీ సేపు ఈ విషయాన్నీ పక్కనబెడితే..... ఇప్పుడు ఈ బిల్లును రాష్ట్ర బీజేపీ వ్యతిరేకిస్తుండగా, కేంద్ర నాయకులుమాత్రం కేంద్రం ఈ విషయంలో ఏమీ చేయలేదు, అది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం, కాబట్టి జగన్ సర్కార్ తమ ఇష్టానుసారంగా రాజధానిని ఏర్పాటుచేసుకోవచ్చు అని అంటున్నారు.
undefined
ఇప్పటివరకు కేంద్ర బీజేపీతో వైసీపీకి సన్నిహిత సంబంధాలున్నాయని అంతా అంటున్నారు. స్వయంగా విజయసాయి రెడ్డే జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది కేంద్రానికి చెప్పే తీసుకుంటున్నారని అన్నాడు. జగన్ సర్కార్ కి కేంద్ర బీజేపీ అనుకూలంగా వ్యవహరిస్తుందని అంతా అంటున్నారు.
undefined
దానికి తోడు ఇప్పటికిప్పుడు వైసీపీసర్కార్ ని తీవ్ర ఇరకాటంలో పెట్టాల్సిన అవసరం బీజేపీకి లేదు. వచ్చే ఎన్నికల్లో వారికి ఎంపీ సీట్లు అవసరం వచ్చినప్పుడు జగన్ మోహన్ రెడ్డే అక్కరకు రావచ్చు. దానికితోడు ఆయనకు కాంగ్రెస్ తో ఉన్న వైరం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆయనను బీజేపీ దూరం చేసుకోవాలనుకోదు.
undefined
అలా అని బీజేపీ టీడీపీని కూడా పూర్తిగా దూరం పెట్టడంలేదు. వారితో కూడా సన్నిహితంగానే మెలుగుతున్నారు. టీడీపీకి అనుకూల నిర్ణయాలను కూడా ఈ మధ్య కేంద్ర బీజేపీ తీసుకుంటుంది. ముఖ్యంగా పోలవరం విషయంలో అనూహ్యంగా చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇవ్వడం గమనించాల్సిన విషయం.
undefined
ఈ నేపథ్యంలోనే ఈ మూడు రాజధానుల అంశం పై గవర్నర్ తీసుకునే నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జగన్ సర్కారుపై కేంద్ర బీజేపీ ఎలాంటి వైఖరితో ముందుకువెళుతుందని తెలుసుకోవడానికి వీలవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
undefined