మోడీ పిలుపు: దారితప్పిన ప్రజలు, మొన్న ర్యాలీలు, నిన్న దీపావళి... కారణమిదే!

First Published Apr 6, 2020, 1:27 PM IST

మోడీ దీపాలను వెలిగించమని మాత్రమే చెప్పారు. కానీ కొందరు అత్యుత్సాహవంతులు ఏకంగా దీపావళి పండగను చేసారు. టపాసులు పేల్చారు. కొన్ని ప్రాంతాల్లో ఈ టపాకాయలు కాల్చడం వల్ల అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. 

నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు విద్యుత్ దీపాలను ఆర్పేసి, దీపాలను వెలిగించాలని కోరారు. ప్రధాని పిలుపు ఇస్తే ఏ విధంగా ఉంటుందో వేరుగా చెప్పనవసరం లేదు.
undefined
అనుకున్నట్టే యావత్ దేశమంతా ఆయన పిలుపుకు స్పందించారు. దీపాలను వెలిగించి... ప్రధాని పిలుపునిస్తే అందరం ఈ అత్యవసర సమయంలో ఆయన వెంట ఉన్నామనే విషయాన్నీ ప్రజలు స్పష్టం చేసారు.
undefined
ఇక్కడిదాకా బాగానే ఉంది. మోడీ దీపాలను వెలిగించమని మాత్రమే చెప్పారు. కానీ కొందరు అత్యుత్సాహవంతులు ఏకంగా దీపావళి పండగను చేసారు. టపాసులు పేల్చారు. కొన్ని ప్రాంతాల్లో ఈ టపాకాయలు కాల్చడం వల్ల అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి.
undefined
ఇంకొన్ని చోట్ల అయితే... ఏకంగా గో కరోనా గో కరోనా అంటూ డ్యాన్సులు చేసారు. కాగడాలతో ర్యాలీలు తీశారు. కరోనా వైరస్ ని ఈ కాగడాల వెలుగేదో పారద్రోలుతుందన్న లెవెల్ లో గో కరోనా అంటూ వీధులవెంట లాక్ డౌన్ నడుస్తున్నా, సోషల్ డిస్టెంసింగ్ పాటించమని ప్రధాని చెప్పినా కూడా వీరు మాత్రం ఇలానే చేసారు.
undefined
కరోనా లాక్ డౌన్ సందర్భంగా కొందరు ప్రజలు ఒంటరులుగా ఫీల్ అవుతున్నారని, ఇంట్లో ఉన్న ఏ ఒక్కరు కూడా కూర్చొని తామొక్కరమే ఈ యుద్ధాన్ని ఎలా గెలుస్తామని, తామొక్కరం యుద్ధం చేస్తే సరిపోతుందా అని ఆలోచిస్తున్నారని, కానీ ఈ యుద్ధాన్ని ఒక్కరే కాకుండా దేశంలోని 130 కోట్ల మందితో కలిసి చేస్తున్నారని మోడీ తెలిపారు.
undefined
ఎవ్వరు కూడా ఒంటరి వారు కాదు. ఈ యుద్ధంలో అందరూ కలిసి ఎవరి ఇండ్లలోంచే వారు పోరాటం చేస్తున్నారు అని చూపెట్టడానికి, 130 కోట్ల సామూహిక శక్తి ఇది అని అందరికి అర్థమయ్యేలా చేసేందుకు ప్రజలందరి దగ్గరినుండి ఆదివారం రోజున 9 నిమిషాలపాటు ఈ దీపాలను వెలిగించమని కోరారు ప్రధాని.
undefined
కరోనా అంధకారాన్ని జయించాలంటే... ప్రకాశవంతమైన జ్వాలలు అవసరమని, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రజలంతా ఇంట్లోని లైట్లు అన్ని కూడా ఆఫ్ చేసి బాల్కనీలల్లకు, దర్వాజల వద్దకు వచ్చి తమకు అందుబాటులోని వెలుగులను ప్రసరించాలని కోరారు.
undefined
కొవ్వొత్తి కానీ, దీపం కానీ, ఆఖరకు మొబైల్ ఫ్లాష్ లైట్ కానీ ఏదో ఒకదాన్ని నలువైపులా ప్రసరింపజేస్తే... కరోనా అంధకారం పై మనం గెలుస్తామన్న శక్తి వస్తుందని, ఈ యుద్ధంలో భారత జాతి అంతా కూడా ఐకమత్యంతో ఉందనే సందేశం వెళుతుందని, ఇండ్లలో ఉన్నవారు ఈ పోరులో ఒంటరులు కారు అని చాటి చెప్పాలని మోడీ పిల్లుపునిచ్చారు.   ఇలా భారతీయులంతా వెలుగులు ప్రసరిస్తే... దేశంలో ఈ కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేద వర్గానికి చెందినవారంతా కూడా ఈ కరోనా పై యుద్ధంలో త్వరలోనే విజయం సాధిస్తామనే నమ్మకం కలుగుతుందని మోడీ అభిప్రాయపడ్డారు.
undefined
రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు ఈ లాక్ డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్న తరుణంలో మంచి కాలం రాబోతుందనడానికి సంకేతంగా దీపాలు వెలిగించమని ప్రధాని కోరారు.  ఉత్సాహాన్ని మించిన శక్తి లేదని, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేస్తే... మనల్ని ఆపే శక్తి ఎవ్వరికి లేదని, ఈ కరోనా మహమ్మారి పై విజయం సిద్ధిస్తుందని, ఆ దిశగా మార్గం సుగమం అవుతుందని మోడీ అభిప్రాయపడ్డారు.
undefined
ఈ కార్యక్రమంలో ఎవ్వరు కూడా ఇండ్లు ధాటి బయటకు రావొద్దని, సోషల్ డిస్టెంసింగ్ అనే లక్ష్మణ రేఖను దాటవద్దని మోడీ మరోమారు ప్రజలకు పిలుపునిచ్చారు.  అయినా ప్రజలు మాత్రం చాలామంది ఇండ్లలోంచి బయటకు వచ్చారు. ప్రధాని సందేశం వారికి చేరలేదు అని అనుకోవడానికి లేదు. వారంతా దీపాలను వెలిగించి, కరోనా పై యుద్ధంలో మేము కూడా ఉన్నామని ముందుకు వచ్చారు. కదం తొక్కారు. ఒక పక్క పేదలు ఆకలితో అలమటిస్తుంటే... కరోనా పై యుద్ధంలో అందరూ తలమునకలై ఉంటే కొందరు టపాకాయలు కాల్చారు. ఇది ఏదో నిన్న ఒక్క రోజే జరిగింది కాదు.
undefined
మొన్న జనతా కర్ఫ్యూ రోజు కూడా ప్రధాని పిలుపు ఇవ్వగానే ప్రజలంతా ఎంతో ఓపికతో ఇండ్లలోనే ఉన్నారు. ఎవ్వరు కూడా బయటకు రాలేదు ఇదంతా బాగానే ఉంది. కానీ ఆ రోజున చప్పట్లు కొట్టే కార్యక్రమమే ఒకింత సోషల్ డిస్టెంసింగ్ నియమాలను తుంగలో తొక్కేలా చేసింది.
undefined
ప్రజలంతా సాయంత్రం 5 గంటలకు విజయోత్సవ ర్యాలీల లెవెల్ లో ప్లేట్లు గరిటెలు కొట్టుకుంటూ, ఇంకొందరు డోలు వాయిస్తూ వీధుల్లోకి వచ్చారు. ఊరు, వాడ కలియతిరిగారు.  ఆరోజు కూడా ప్రధాని సోషల్ డిస్టెన్సిన్గ్ గురించి చెప్పి, అందరు రాత్రి 9 గంటల వరకు ఇండ్లలోనే ఉండమని చెప్పినప్పటికీ కూడా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. 5 గంటలు కాగానే కరోనా వైరస్ పై ఏదో విజయం సాధించేసినట్టుగా, వైరస్ బారి నుండి దేశం విముక్తయినట్టు భావించారు.
undefined
ప్రధాని ఇచ్చిన పిలుపును ఇంత చక్కగా పాటించే ప్రజలు ఆ ఒక్క విషయంలో మాత్రమే ఎందుకు గీత దాటుతున్నారనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. నిన్న కరోనా వైరస్ వల్ల మొదటగా దెబ్బతినేది ఊపిరితిత్తులు అని తెలిసినా ప్రజలు విచక్షణ కోల్పోయి పటాకులు కాల్చారు.
undefined
దీనికి కారణం ఏమిటంటే.. ఫేక్ న్యూస్. తప్పయిదు సమాచారం. ముఖ్యంగా వాట్సాప్ లలో వచ్చే సందేశాలు. మొన్న చప్పట్లు కొట్టమన్న రోజు... మోడీ 12 గంటల జనతా కర్ఫ్యూ వల్ల వైరస్ చనిపోతుందని, మోడీ గారు అందుకే 14 గంటల జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చారని వాట్సాప్ లో ఇబ్బడిముబ్బడిగా వైరల్ అయ్యాయి.
undefined
దీనితో ప్రజలంతా రాత్రి నుంచే ఎలాగూ మేము లేము కాబట్టి సాయంత్రానికి వైరస్ చనిపోయి ఉంటదని భావించి ప్రజలు ఆ ఫేక్ న్యూస్ ని నమ్మి అంత భారీ స్థాయిలో బయటకు వచ్చారు.
undefined
నిన్న కూడా వాట్సాప్ లో రకరకాల ఫేక్ న్యూస్. వెలుగు వల్ల కరోనా గుడ్డిది అయిపోతుందనేది ఒకటయితే... వైరస్ దీపం వెలుగు దగ్గరకు వచ్చి పురుగులాగా కాలిపోతుందనేది ఇంకొకటి.
undefined
వీటితో పాటు ఒక మెసేజ్ వైరల్ అయింది. ఫోటాన్ శక్తి క్వాంటమ్ శక్తిగా, క్వాంటమ్ శక్తి అటామిక్ శక్తిగా మారి కరోనా ను నాశనం చేస్తుందని ఒక మెసేజ్ లో చెబితే... ఆ వెలుగులు 33 మంది కోట్ల దేవతలను రాహు కేతు పీడల నుండి విడిపిస్తే... అప్పుడు కరోనా అంతమవుతుందనేది ఇంకొకటి.
undefined
పాపం పిచ్చి ప్రజలు ఇవన్నీ నిజమని నమ్మి ఫోటాన్ శక్తి నలుమూలలా వ్యాపించాలని, కరోనా అంతమవ్వాలని ప్రజలు భావించారు. టపాకాయలు కాల్వడానికి కూడా అదే కారణం. ఆకాశంలో మరిన్ని వెలుగులు నిమాపాలన్న ఉద్దేశంతో తమ దేశభక్తిని అధికంగా చాటాలన్న ఉద్దేశంతో.  ఈ ఫేక్ న్యూస్ ఇలా వ్యాపిస్తున్నంత కాలం ఇలా దేశంలో ప్రజలు ఒకటి చెబితే మరొకటి అనుసరించే ఆస్కారం లేకపోలేదు.
undefined
click me!