లాక్ డౌన్ ఎత్తివేతపై మోడీ ఆలోచన ఇది: కేసీఆర్ సలహా ఏమౌతుంది?

First Published Apr 7, 2020, 11:05 AM IST

లాక్ డౌన్ కొనసాగుతుందా కొనసాగదా అనే సందిగ్ధ పరిస్థితుల నేపథ్యంలో అసలు కేంద్రం ఏమి ఆలోచిస్తుంది, కేసీఆర్ ఎందుకు అలా మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ట్వీట్ ను ఎందుకు డిలీట్ చేసారు అనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాము. 

దేశంలో లాక్ డౌన్ పై అనేక రకాలైన అభిప్రాయలు, ఊహాగానాలు, వదంతులు మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలంతా ఈ లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తోందా అని ఎదురు చూస్తున్నారు.  ఉద్యోగాలు పోతాయేమో అనే భయంతో కొందరయితే... వ్యాపారాల్లో నష్టం వస్తుందేమో అని భయపడేవారు మరికొందరు. రెక్కాడితే కానీ డొక్కాడని వారు పనులు లేకపోవడంతో... వారు కూడా ఈ లాక్ డౌన్ ముగిసిపోతే బాగుండు అని కోరుకుంటున్నారు.
undefined
ఇక ప్రభుత్వం ఏదో తమను బంధించింది అని ఫీల్ అయ్యే వర్గం కూడా లేకపోలేదు దానికి తోడుగా టీవీల్లో తాళం తీయడానికి ఇక 7 రోజులు మాత్రమే అన్నట్టు గ్రాఫిక్ డిజైన్లు. ఇవన్నీ చూసిన సాధారణ వ్యక్తి కూడా లెక్కలు వేసుకుంటూనే ఉంటాడు.  కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ గడువు వచ్చే మంగళవారంతో ముగుస్తుండడం, నిన్న రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాక్ డౌన్ ని ఇంకో వారం నుంచి రెండు వారల పాటు పొడిగిస్తే మంచిది అన్నారు. ఇలా కేసీఆర్ అనడం, మరొపక్కనేమో రైళ్లు, విమాన టికెట్స్ బుకింగ్ కి ఓపెన్ అవడం(దానిపైన రైల్వే శాఖ వివరణ ఇచ్చినప్పటికీ), మోడీ గారేమో కరోనా లాక్ డౌన్ ని ఎత్తివేసే ఆలోచనల్లో ఉన్నారన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి.
undefined
లాక్ డౌన్ కొనసాగుతుందా కొనసాగదా అనే సందిగ్ధ పరిస్థితుల నేపథ్యంలో అసలు కేంద్రం ఏమి ఆలోచిస్తుంది, కేసీఆర్ ఎందుకు అలా మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ట్వీట్ ను ఎందుకు డిలీట్ చేసారు అనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాము.
undefined
దేశంలో లాక్ డౌన్ వల్ల విపత్కర పరిస్థితులు నెలకొన్న విషయం వాస్తవం. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆర్ధిక ప్రగతి కుంటుపడింది. ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం రెండవ ఆప్షన్ తీసుకోలేదు కాబట్టి గత్యంతరం లేక లాక్ డౌన్ విధించింది.  దేశం మొత్తంలో లాక్ డౌన్ ని అకస్మాత్తుగా ప్రకటించారు. అలానే అకస్మాత్తుగా మాత్రం తొలగించరు. అదే విషయాన్నీ మొన్న ప్రధాని ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్సులో చెప్పారు. స్టాగర్డ్ ఎగ్జిట్ ఉంటుందని సూచించారు. అందుకు తగ్గట్టే రాష్ట్రాలను సలహాలు సూచనలు ఇవ్వమన్నారు.
undefined
ఇక నిన్న ప్రకాష్ జవదేకర్ ఏమో లాక్ డౌన్ విషయంలో కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దేశంలో ఆర్ధిక పరిస్థితి పూర్తిగా కుంటుపడ్డ నేపథ్యంలో మెల్ల మెల్లగా ఒక్కో రంగాన్ని ఆక్టివ్ చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నట్టు అర్థమవుతుంది.  ఇప్పటికే వ్యవసాయాన్ని, దానికి అవసరమైన స్పేర్ పార్టీలను అమ్మే దుకాణాలను, మెకానిక్ దుకాణాలను సైతం తెరిచేందుకు అనుమతినిచ్చారు.
undefined
బేకరీ, ఇతర తిను బండరాళ్ల దుకాణాలను తెరిచేందుకు అనుమతిచ్చినప్పటికీ కేవలం టేక్ అవే మాత్రమే అనుమతించారు.  ఇప్పటికే దేశంలో కరోనా హాట్ స్పాట్లను గుర్తించే పనిలో కేంద్రం తలమునకలై  ఉంది. కేసులు 4000 మార్కును చేరుకోవడంతో ఒక పాటర్న్ కనబడుతుంది. దాదాపు 80 శాతం కేసులు 62 జిల్లాల్లోనే నమోదవుతున్నాయి.
undefined
ఇలా హాట్ స్పాట్లను, అత్యధిక కేసులు నమోదవుతున్న జిల్లాలను పూర్తిగా సీల్ చేసి వాటిలో లాక్ డౌన్ కొనసాగిస్తూనే వైరస్ ప్రభావం అంతగా లేని చోట సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి కృషి చేయవచ్చు. ఒకే సారి అన్ని సేవలు ప్రారంభించకున్నప్పటికీ... అవసరమైన కొన్ని రంగాలను, ఉదాహరణకు పరిశ్రమల్లో ఉత్పత్తిని అనుమతించొచ్చు.
undefined
ఆర్థీకవేత్త కౌశిక్ బసు చెప్పిన సలహా ప్రకారం అయితే... లిమిటెడ్ గా విమాన ప్రయాణాలను రైళ్లను అనుమతిస్తూ రెండు సీట్ల గ్యాప్ వదులుతూ అందరూ టెస్టులు చేపించుకోవాలని ఒక రూల్ పెట్టి రెండు గంటల ముందే ఎయిర్ పోర్టుకు రావాలని చెబితే టెస్టులు కూడా చేసే వీలుంటుందని ఆయన అభిప్రాయూయ్యపడుతున్నారు.
undefined
మోడీ గారు ఈ నిర్ణయానికే అనుకూలంగా ఉన్నారనడానికి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఏప్రిల్ 14 తరువాత లాక్ డౌన్ ఎత్తేయనున్నట్టు మోడీ గారు చెప్పారు అని ట్వీట్ చేసి వెంటనే అది హిందీ సరిగా రాక అధికారి అలా ట్వీట్ చేసారు అని చెబుతూ డిలీట్ చేసారు.
undefined
కేసీఆర్ గారు కూడా నిన్న ప్రధానిని అభ్యర్థిస్తున్నాను అని చెప్పారు. దీనిమీద డిబేట్ జరగాలి అని అన్నారు. దీన్నిబట్టి దేశంలో ఒక చర్చ మొదలవుతుంది. దేశంలో కరోనా కేసుల్లో నాలుగవ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ వైరస్ ని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కుంటున్న నేత, వలస కార్మికులకు అభ్యమిచ్చేలా, కడుపులో పెట్టి చూసుకుంటామంటూ దేశమంతా పాపులర్ అయిన నేత... ఆయన ఇప్పుడు ఈ విషయం చెప్పడంతో అందరూ ఆలోచిస్తున్నారు.
undefined
కేంద్రం ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకోదనేది మాత్రం వాస్తవం. రేపు లేదా ఎల్లుండి మరోసారి ముఖ్యమంత్రులతో మీటింగ్ ఉంది. ఆ తరువాత 12వ తారీఖు రోజు మరో మారి పరిస్థితిని సమీక్షించే యోచనలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు.  కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా... నమోదవుతున్న కేసులను బట్టి, వైరస్ వ్యాప్తిని బట్టి ఉంటుంది. ఇక ఈ పరిస్థితుల్లో కేంద్రం తనంతట తానే నిర్ణయం తీసుకుంటుందా లేదా... వాస్తవిక పరిస్థితులు రాష్ట్రాలకే కరెక్టుగా తెలుసు కాబట్టి వారికే వదిలేస్తారా అనేది చూడాలి.
undefined
click me!