తెలంగాణలో 16 లోక్‌సభ స్థానాలు గెలుచుకునేలా కేసీఆర్ స్కెచ్.. జాతీయ స్థాయిలో కూడా వ్యూహం సిద్దం..!!

First Published | Jul 26, 2023, 10:34 AM IST

తెలంగాణలో ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించారు. 

తెలంగాణలో ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించారు. 

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకోవడంతో పాటు.. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకు గానూ 16 చోట్ల విజయం సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారు. మిగిలిన ఒక్కస్థానం హైదరాబాద్.. అది ఎంఐఎం పార్టీకి కంచుకోటగా ఉంది. మరోవైపు ఎంఐఎంతో కూడా కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోక్‌సభ స్థానం మినహా.. రాష్ట్రంలోని మిగిలిన స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు. 
 


తెలంగాణలో బీఆర్ఎస్ ఇది వరకు విజయం సాధించని.. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌లతో పాటు గతంలో కాంగ్రెస్, బీజేపీలకు బలమైన నియోజకవర్గాలుగా ఉన్నవాటిపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఈ రెండు స్థానాల నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మర్రి రాజశేఖర్‌రెడ్డి, తలసాని సాయికిరణ్‌లనే మరోసారి  రంగంలోకి దింపాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
 

అలాగే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ గెలుపొందిన సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మల్కాజ్‌గిరి, భువనగిరి, నల్లగొండ స్థానాలకు సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్‌ వ్యూ హాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. నిజామాబాద్ లోక్‌సభ  స్థానం నుంచి మరోసారి తన కుమార్తె కల్వకుంట్ల కవిత బరిలో దింపాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో విపక్షాలను బలహీన పరిచేలా చేరికలను ప్రోత్సహించాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టుగా సమాచారం. 

మరోవైపు ఇటు అసెంబ్లీ.. అటు లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా ఇతర పార్టీల నుంచి చేరికలు ప్రోత్సహించడం, విపక్షాలను బలహీనపరడంపై దృష్టి సారించారు. అదే సమయంలో పార్టీ నేతల్లో అసంతృప్తి చెలరేగకుండా.. వారికి పదవుల సర్దుబాటు చేస్తామనే హామీ ఇచ్చి ముందుకు సాగాలని చూస్తున్నారు. 

తెలంగాణ వెలుపల విషయానికి వస్తే.. కేసీఆర్ 80 నుంచి 100 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో నిలుపాలనే ఆలోచనతో ఉన్నట్టుగా  తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ మహారాష్ట్రాలోని 48 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర‌తో పాటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటకతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులను బరిలో నిలపాలని కేసీఆర్ భావిస్తున్నారు. 
 

parliment indian nationality act

ఇందుకోసం కేసీఆర్ కార్యచరణ సిద్దం చేశారని.. తెలంగాణలో 16 స్థానాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో 30 నుంచి 40 స్థానాల్లో విజయం సాధించిన లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కీలక భూమిక పోషించే అవకాశం ఉంటుందనేదే ఆయన ఆలోచన అని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

Latest Videos

click me!