పక్కా ప్లాన్: కుప్పంలోనే చంద్రబాబుకు వైఎస్ జగన్ సెగ

First Published | Jul 6, 2020, 1:29 PM IST

రాజకీయాల్లో ఏ బలమైన నాయకుడికైనా అత్యంత ముఖ్యమైనది సొంత నియోజకవర్గం. ఏ నాయకుడినైనా తీసుకోండి, వారి నియోజకవర్గాలు వారికి పెట్టని కోట. జగన్ మోహన్ రెడ్డికి పులివెందుల, హరీష్ రావు సిద్దిపేట, సుప్రియ సులే బారామతి ఇలా ప్రతి నాయకుడికి వారి నియోజకవర్గాన్ని వారు గత కొన్నెండ్లుగా నిలుపుకుంటూ వస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్ హాట్ గానే ఉంటున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ల మధ్య రాజకీయ యుద్ధం కరోనా వైరస్ కన్నా హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్న వైసీపీ ఎలాగైనా బలమైన పునాది వేసుకొని తన పాలనను సుస్థిరం చేసుకోవాలని చూస్తుంటే... ఎలాగైనా ప్రతిపక్షాన్ని గద్దె దించి అధికారాన్ని చేబట్టాలని ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నం చేస్తుంది.
undefined
వైసీపీ 2019 ఎన్నికల్లో రాయలసీమనుదాదాపుగా క్లీన్ స్వీప్ చేసిందని చెప్పవచ్చు. ఉరవకొండ, హిందూపురం, కుప్పం నియోజకవర్గాలను మినహాయిస్తే.... మిగిలిన అన్ని సీట్లలోనూ వైసీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. జగన్ తన కోట పులివెందులను మరింత పటిష్టం చేసుకున్నాడు.
undefined

Latest Videos


రాజకీయాల్లో ఏ బలమైన నాయకుడికైనా అత్యంత ముఖ్యమైనది సొంత నియోజకవర్గం. ఏ నాయకుడినైనా తీసుకోండి, వారి నియోజకవర్గాలు వారికి పెట్టని కోట. జగన్ మోహన్ రెడ్డికి పులివెందుల, హరీష్ రావు సిద్దిపేట, సుప్రియ సులే బారామతి ఇలా ప్రతి నాయకుడికి వారి నియోజకవర్గాన్ని వారు గత కొన్నెండ్లుగా నిలుపుకుంటూ వస్తున్నారు.
undefined
ఇప్పుడు జగన్ చంద్రబాబునాయుడిని ఆ సొంత నియోజకవర్గంలోనే దెబ్బకొట్టాలని ప్లాన్ వేసాడు. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లి. చిత్తూరు జిల్లాలోని ఈ గ్రామం కుప్పం నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఆ నియోజకవర్గంలోనే చంద్రబాబును ఓడించి ఆ నియోజకవర్గంలోనే నిలువనీడ లేకుండా చేయాలనీ జగన్ చూస్తున్నాడు.
undefined
ఇందుకోసమనే ఆ నియోజకవర్గంలోనే చంద్రబాబు ను టీడీపీని అస్థిరపరచాలని చూస్తున్నారు. ఆ ప్రాంతంలో టీడీపీకి అనుకూల ఓటర్లున్నప్పటికీ... అక్కడ ఒక బలమైన నేత లేడు. దీన్ని అనుకూలంగా చేసుకొని వైసీపీ అక్కడ చక్రం తిప్పాలని చూస్తుంది.
undefined
చూస్తుంటేనేమో ఆ గ్రామాలన్నీ కూడా టీడీపీకి పట్టున్నగ్రామాలు. ఆ గ్రామాల్లో వైసీపీ జెండా పాతడం కష్టం. అందుకోసమే అక్కడ ప్రభుత్వం ఇప్పుడు పేదలకు భూములను పంచిపెడుతుందని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష టీడీపీ నేతలు.
undefined
చంద్రగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వం భారీ స్థాయిలో భూములను సేకరిస్తుంది. భూములను సేకరించి పేదలకు అక్కడ ఇండ్లు కట్టించి ఇవ్వాలని యోచిస్తోంది సర్కార్. అందునా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ నవరత్నాల్లో పేదలకు ఇండ్లు అనేది ఒక ముఖ్యాంశం కూడా.
undefined
ఇందులో ఏముందని ప్రతిపక్షం గొడవ చేస్తుంది అని అనిపించొచ్చు. కానీ ప్రతిపక్షం వారు ఆరోపించేది ఏమిటంటే... అక్కడ గ్రామాలన్నీ కూడా టీడీపీ అనుకూల ఓటర్లే ఉన్నారని, ఆ లెక్కలను మార్చడానికి వైసీపీ ఈ ఎత్తుగడ వేస్తోందని అంటున్నారు.
undefined
చంద్రగిరి పరిసర గ్రామాల్లో ముఖ్యంగా టీడీపీకి అత్యధిక పట్టు ఉన్న గ్రామాల పక్కన వైసీపీ వారు ఇప్పుడు పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని యోచిస్తున్నారట. అలా ఇండ్లు కట్టించి ఇవ్వడం ద్వారా ఒక్కో గ్రామంలో కనీసం నాలుగు నుంచి 500 మంది కొత్త ఓటర్లు వచ్చి చేరతారు. గ్రామ వోటింగ్ విధాన సరళేఈ దెబ్బకు మారిపోతుందని ప్రతిపక్షం ఆరోపిస్తుంది.
undefined
అధికార విపక్ష వాదనలు అటుంచితే ఒక విషయం మాత్రం వాస్తవం. చంద్రగిరి ఆ చుట్టుపక్కల భూములకు మాత్రం రెక్కలొచ్చాయి. ఏకంగా ప్రభుత్వమే అధిక ధరలు ఇచ్చి కొనుగోలు చేస్తుంది అంటున్నారు.ఏకంగా అమ్మకం హక్కులు లేని (దరఖాస్తు భూములు) డీకేటీ భూములను సైతం ప్రభుత్వం రైతుల దగ్గరి నుండి కొనుగోలు చేస్తుంది. అక్కడ ఎన్నడూ లేని విధంగావెంచర్లు వెలుస్తున్నాయి. ఆ డీకేటీ భూములకు సైతం అక్కడ రెక్కలొచ్చాయి.
undefined
ఈ విధంగా ఇప్పుడు అక్కడ రాజకీయ సమీకరణాలను అన్ని ఊర్లలో మార్చి అక్కడ సైతం తమ జెండాను పాతాలని వైసీపీ యోచిస్తున్నట్టుగా టీడీపీ ఆరోపిస్తుంది. తిరుపతిపరిసరాల్లో భూములు లభ్యమవుతున్నా ఇక్కడే చంద్రగిరి పరిసరాల్లో భూములను పంచడం వెనకున్న ఆంతర్యం చంద్రబాబుకు గట్టి షాక్ ఇవ్వడానికే అని అక్కడ గుసగుసలు వినబడుతున్నాయి.
undefined
click me!