రూటు మార్చిన పవన్ కల్యాణ్: చంద్రబాబుకు షాక్..?

First Published | Jul 4, 2020, 7:10 AM IST

ఇకపోతే తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయాన్ని పొగిడారు. జగన్ ను వెరీ గుడ్ సీఎం అంటూ కీర్తించారు. ఒకపక్క ప్రతిపక్ష టీడీపీ ఏమో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకిస్తుండగా... పవన్ కళ్యాణ్ ఇలా జగన్ కు మద్దతు తెలపడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేటి రాజకీయ పరిస్థితులకు, రేపటి పరిణామాలకు అసలు పొంతన లేకుండా చాల డైనమిక్ గా మారుతున్నాయి. కరోనా వేళ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడప్పుడు ఎన్నికలు సమీపంలో కూడా లేకున్నప్పటికీ...... రాజకీయ వాతావరణం మాత్రం హాట్ హాట్ గా ఉంటుంది.
undefined
ఇకపోతే తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయాన్నిపొగిడారు. జగన్ ను వెరీ గుడ్ సీఎం అంటూ కీర్తించారు. ఒకపక్క ప్రతిపక్ష టీడీపీ ఏమో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకిస్తుండగా... పవన్ కళ్యాణ్ ఇలా జగన్ కు మద్దతు తెలపడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది.
undefined

Latest Videos


ఏపీలో వైద్య ఆరోగ్య సదుపాయాలను మరింత పటిష్టం చేసేందుకు గాను ప్రభుత్వం 104, 108 వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జనసేన అధినేత, పవన్ కల్యాణ్ అభినందించారు.
undefined
ప్రస్తుతం కరోనా కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మెడికల్ ఎమర్జెన్సీ లాంటి పరిస్ధితుల్లో అంబులెన్స్‌‌ను ప్రారంభించడాన్ని పవన్ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేసారు.
undefined
ఇక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇలా జగన్ మోహన్ రెడ్డి ని రాజకీయ విశ్లేషణలు వేరే లెవెల్ కి వెళ్లిపోయాయి. ఒక పక్క ప్రతిపక్ష టీడీపీ యేమో ఈ అంబులెన్సుల కొనుగోళ్లలో అక్రామాలు జరిగాయి, ఆరోబిందో కంపెనీకి లాభం చేకూర్చడానికే ప్రభుత్వం ఈ కొనుగోళ్లను చేపట్టింది అని ఆరోపణలు గుప్పిస్తున్న వేళ... మరో ప్రతిపక్ష నేత జనసేనాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సీచర్చనీయాంశమైంది.
undefined
ఇక ఈ పరిస్థితుల్లో కొందరు ఏకంగా పవన్ కళ్యాణ్ వ్యవహారంలో ఏదో మార్పు కనబడుతుంది అని, వైసీపీ ఎంపీలంతా ఢిల్లీ వెళ్లి స్పీకర్ ని కలవడం, అంతకు మునుపు వైసీపీ ఎంపీ బాలశౌరి కేంద్ర మంత్రులతో వరుస సమావేషాలవ్వడంఅన్నిటిని చూపెడుతూ... కేంద్ర వైఖరి వైసీపీ పై మారింది అంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
undefined
కేంద్రం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తాం అనే హామీ ఇవ్వబట్టే రఘురామకృష్ణంరాజు కోర్టును ఆశ్రయించాడని,లేకపోతే.... అనర్హత వేటు వేయడం వేయకపోవడం స్పీకర్ ఇష్టం కదా అంటూ చర్చలను కూడా నిర్వహిస్తున్నారు. రఘురామకు కేంద్రం పూర్తి మద్దతు గనుక ఇచ్చి ఉంటే... ఆయన కోర్టు మెట్లెందుకు ఎక్కుతారని వారు ప్రశ్నిస్తున్నారు.
undefined
ఇక అక్కడితో ఆగకుండా... గతంలో నాగబాబు టీడీపీని కార్నర్ చేస్తూ చేసిన ట్వీట్ల గురించి ప్రస్తావిస్తున్నారు, నాగబాబు గతంలో వైసీపీనే కరెక్ట్ అని అనిపిస్తుందంటూ, టీడీపీ ఎన్నో ఆకృత్యాలకు తెగబడిందని ట్వీట్ చేసారు. అంతే కాకుండా 2024లో అయితే జనసేన - బీజేపీల కూటమి అధికారాన్ని చేపడుతుంది, లేదంటే వైసీపీ గద్దెనెక్కుతుంది అంతే తప్ప టీడీపీకి మాత్రం ఆ అవకాశం లేదని అన్నారు.
undefined
పనిలో పనిగా చిరంజీవిని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ.., తొలుత చిరంజీవి, ఆ తరువాత నాగబాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందరూ వరుసగా క్యూ కడుతున్నారని సోషల్ మీడియాతోపాటుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నిన్న రాత్రి నుండి ఊదరగొడుతున్నారు.
undefined
ఈ అన్ని వాదనలను మనం వినేముందు ఒక చిన్న విషయాన్నీ గమనిస్తే..... పవన్ కళ్యాణ్ నిన్న జగన్ మోహన్ రెడ్డిని పొగిడాడు. కానీ ఆయన తనదైన మార్క్ లో జగన్ రెడ్డి అంటూనే సంబోధించారు. అంతే తప్ప జగన్ మోహన్ రెడ్డి అని మాత్రం వ్యవహరించలేదు.
undefined
పవన్ కళ్యాణ్ తనని తాను ఒక తులనాత్మకంగా విమర్శను మాత్రమే చేసే ఒక ప్రతిపక్ష నేతగా, సమస్య మీద మాత్రమే పోరాడే నాయకుడిగా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అధికార పక్షం ఏం చేసినా దాన్ని విమర్శించకుండా, అందులో మంచి ఉంటే మంచిని మెచ్చుకుంటూ... తప్పు ఉంటే, తప్పు అని నిర్ద్వంద్వంగా చెప్పే ఒక నాయకుడిగా నిరూపించుకునే పనిలో ఉన్నట్టున్నారు.ఇష్యూ టు ఇష్యూ బేసిస్ లోనే అందులోని తప్పొప్పులను ఎంచుతానని ఆయన బాహ్యప్రపంచానికి ప్రకటించుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. అందుకోసమే ఆట్వీట్ చేసారు. ఇలా చెప్పడానికి కారణం కూడా లేకపోలేదు.
undefined
పవన్ కళ్యాణ్ నిన్న జగన్ మోహన్ రెడ్డిని పొగిడాడు అని చర్చించుకోవడం మొదలుపెట్టే లోగానే.... మరో జనసేన నేత నాదెండ్ల మనోహర్ జగన్ ను విమర్శిస్తూ లేఖ రాసారు. అంటే ఇక్కడ పార్టీ మంచిని మంచి అని చెడుని చెడుఅని ఖచ్చితంగా చెబుతుందనే ఒక ఇండికేషన్ ని పవన్ ఇవ్వాలనుకుంటున్నాడు.
undefined
నిన్న ముద్రగడ సైతం జగన్ మోహన్ రెడ్డికి కాపులకు రేజర్వేషన్ల గురించి లేఖ రాసారు. ఆ లేఖలో తమజాతి సానుభూతి ఓట్లను పొందలేదా అని ఘాటుగా విమర్శించారు. ఆయన ఈ సందర్భంలో ఈ లేఖను రాయడం, మొన్ననే పవన్ కళ్యాణ్ సైతం కాపు రాజకీయాల మీద మాట్లాడడం అన్ని చూస్తుంటే పవన్ రాజకీయ ప్రణాళిక ఇక్కడ కనబడుతుంది. అంతే తప్ప జగన్ మోహన్ రెడ్డి పంచన పవన్ చేరిపోయినట్టు కాదు.
undefined
click me!