మూడు రాజధానులపై జగన్ వ్యూహం: అమరావతి రైతులపై శాంతి మంత్రం

First Published | Aug 16, 2020, 6:58 AM IST

కోర్టు విధించిన ఈ స్టేటస్ కో ని కొనసాగిస్తూనే ఉండాలని ఒక పక్క అమరావతి రైతులు కోరుకుంటుంటే... సాధ్యమైనంత తొందరగా ఈ విషయం నుంచి బయటపడాలని జగన్ సర్కార్ ఆకాంక్షిస్తుంది. 

మూడు రాజధానుల అంశం ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. హై కోర్టు తొలుత విధించిన స్టేటస్ కో ను ఈ నెల 27 వరకు పొడిగించడంతో వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతుండగా... అమరావతి ప్రాంత వాసులేమో న్యాయదేవతకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు.
undefined
ప్రజల రియాక్షన్స్ పక్కకుంచితే జగన్ సర్కార్ భయపడినదంతా జరిగింది. తొలుత 16వ తేదీన విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి శంకుస్థాపన చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం సైతం పంపారు. నేరుగా రావడానికి కుదరకపోతే కనీసం వర్చువల్ గా అయినా శంకుస్థాపన చేయాలని కోరారు.
undefined

Latest Videos


కానీ ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండిముహుర్తాన్నిదసరాకి వాయిదా వేశారు. ప్రధాని అపాయింట్మెంట్ కుదరక అని చెప్పినప్పటికీ... న్యాయస్థానాలు తీసుకునేనిర్ణయాలుఅనుకూలిస్తాయో లేవో అనే ఒక అనుమానం కూడా జగన్ సర్కార్ మనసులో ఉండే వాయిదా వేసినట్టుగా వార్తలు వచ్చాయి.
undefined
హై కోర్టు తొలుత 14వ తేదీ వరకు స్టేటస్ కో విధించగా... ప్రభుత్వం సుప్రీమ్ కోర్టులో ఆ స్టేటస్ కో ను సవాలు చేసింది. హైకోర్టు మరోసారి స్టేటస్ కోని పొడగించకున్నా, లేదా సుప్రీమ్ కోర్ట్ అయినా సరే తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందన్న ఆశ ప్రభుత్వానికి ఉండే. కానీ అది జరగకపోతే అనే ఒక అంశం వారిని కలవర పెడుతుండడంతోనే వాయిదా వేశారు.
undefined
ఇక ఇప్పుడు కోర్టు విధించినఈ స్టేటస్ కో ని కొనసాగిస్తూనే ఉండాలని ఒక పక్క అమరావతి రైతులు కోరుకుంటుంటే... సాధ్యమైనంత తొందరగా ఈ విషయం నుంచి బయటపడాలని జగన్ సర్కార్ ఆకాంక్షిస్తుంది.
undefined
హై కోర్టు తీర్పు వెలువడగానే జగన్ సర్కారుకు ఎదురు దెబ్బ, చుక్కెదురు, భారీ షాక్ అంటూ రకరకాల వ్యాఖ్యలు చేసాయి కొన్ని మీడియా చానల్స్. వాస్తవానికి ఇది తాత్కాలికం మాత్రమే. అలాగని అంత త్వరగా అంతేలే అంశం కాదు. రైతుల సమస్యలతో ముడిపడి ఉన్న అంశం.
undefined
సున్నితమైన, అతి కీలకమైన అంశం కాబట్టే కోర్టు స్టేటస్ కో విధించింది. అలాగని స్టే విధించలేదు. జగన్ సర్కార్ చేసిన చట్టం అమల్లో ఉన్నప్పటికీ.... రాజధాని తరలింపు అనే ప్రక్రియ మాత్రం జరగకూడదుఅనే విషయాన్నీ కోర్టు ఇక్కడ చెప్పింది.
undefined
ఒకవేళ తరలింపు జరిగితే.. అప్పుడు వెనక్కి తిరిగి తరలించమంటే వృధా అయ్యేది ప్రజా దానం. ధనంతోపాటు సమయం కూడా వృధా అవుతుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
undefined
మరోపక్క జగన్ సర్కార్ సాధ్యమైనంత త్వరగా కోర్టులో ఈ విషయానికి శుభం కార్డు వేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది. రైతులకు అమరావతిలో ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసి ఇస్తామోచెప్పే ఒక ప్లాన్ ను రూపొందిస్తుంది. అభివృద్ధి ఎలా చేయబోతున్నామో చెబుతూ... ఈ పూర్తి విషయాన్నీ కోర్టు ముందు ప్రభుత్వం ఉంచాలనుకుంటుందని సమాచారం..
undefined
ఇలా కోర్టుకు సమర్పించడం ద్వారా మౌలికంగా రైతులు తమకు అన్యాయం జరిగిందనిచెబుతున్న వాదనకు....ప్రభుత్వం ఈ ప్లాన్ ద్వారా వారికి నష్టం కలగకుండా చూస్తామని కోర్టుకు చెప్పొచ్చని భావిస్తోంది. కోర్టు గనుక ప్రభుత్వవాదనకు అంగీకరిస్తే ఈ వివాదానికి శుభం కార్డు వేయొచ్చు అని భావిస్తుంది.కానీ కోర్టు ఈ వాదనను ఎంతమేర పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి. రాజధాని గనుక అమరావతిలోని ఉన్నట్టయితే... అక్కడ భూముల రేట్లు పెరిగేవి. భూములకు ధరలు వస్తాయన్నఆశమీదనే వారు ప్రభుత్వానికి భూములిచ్చింది.
undefined
రియల్ ఎస్టేట్ పరిభాషలో గనుక మనం మాట్లాడుకుంటే... అభివృద్ధి అంటే రోడ్లెయడం, విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం కాదు కదా. ఒక వేళా అపార్ట్మెంట్ కట్టిన బిల్డర్ కమర్షియల్ స్పేస్ ఇస్తానని రెసిడెన్షియల్స్పేస్ అంతే ఇస్తామంటే మనం ఊరుకోము కదా. మనకు అన్యాయం జరిగిందని కోర్టుకెక్కుతాము.
undefined
అదే ఇక్కడ అమరావతి రైతుల విషయంలో జరిగింది. ప్రభుత్వం ఆశించినట్టు సుప్రీమ్ కోర్టు అనుకూలంగా ఈ స్టేటస్ కో ఎత్తేస్తే సరి లేదంటే ఈ స్టేటస్ కో కొనసాగే విధంగానే కనబడుతుందా, అది ఎప్పటివరకు అనే విషయం పై మాత్రం క్లారిటీ లేదు. కోర్టు ప్రభుత్వ వాదనకు అంగీకరించి స్టేటస్ కో ఎత్తేస్తుందా లేదా కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి.
undefined
click me!