2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక కేటీఆర్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడంతో.... ఆయనకు కేసీఆర్ పగ్గాలు అప్పగించడం తథ్యం అని అంతా అనుకున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళితే.... రాష్ట్రంలో కేటీఆర్ కి పగ్గాలప్పగిస్తారని అంతా భావించారు.
undefined
కానీ కేంద్రంలో బీజేపీ అత్యధిక మెజారిటీ సాధించడంతో.... కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యాడు. అప్పటినుండి కేటీఆర్ పట్టాభిషేకం ఎప్పుడు అనే చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు అప్పుడు అంటూ వార్తలు వినపడుతూనే ఉన్నాయి. కానీ ఏవో ఒక అవరోధాలు ఎదురవుతున్నవేళ... అది పక్కకుపడిపోతూనే ఉంది.
undefined
ఇక రాష్ట్రంలో రెండు రోజుల కింద జరిగిన ఒక సంఘటన కేటీఆర్ కి అధికార బదిలీ జరగబోతుందనేదిశగా ఊహాగానాలు బలపడుతున్నాయి. సాధారణంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప వేరే మంత్రి అధ్యక్షతన సమావేశం జరగదు.
undefined
కానీ నిన్న కేటీఆర్ మాత్రం దాదాపుగా 8గంటలపాటు సమావేశాన్ని నిర్వహించారు.దీనికి అన్ని శాఖల మంత్రులు, సీఎస్, ముఖ్య అధికారులందరూ హాజరయ్యారు. కేబినెట్ భేటీల్లో పాల్గొనే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కూడా పాల్గొన్నారు. కేసీఆర్ మీటింగులు ఎలా యితే జరుగుతాయో... అదే స్టైల్ లో అంతేసేపు నిర్వహించారు.
undefined
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకు సీఎం కాకుండా వేరే మంత్రి క్యాబినెట్ కి అధ్యక్షత వహించిన సందర్భాలు చాలా అరుదు. గతంలో చంద్రబాబు నాయుడు అలిపిరి వద్ద ప్రమాదానికి గురయినప్పుడు దేవేందర్ గౌడ్ పరిస్థితిని సమీక్షించడానికి కాబినెట్ భేటీని నిర్వహించాడు. ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ గల్లంతయినప్పుడు రోశయ్య అధ్యక్షతన ఇటువంటి భేటీలు జరిగాయి. ఆ సమయంలో అత్యవసర పరిస్థితిని సమీక్షించడానికి ఆ కాబినెట్ భేటీలు జరిగాయి.
undefined
కానీ ఇక్కడ కేటీఆర్ అధ్యక్షత వహించిన భేటీ పూర్తిగా 8 గంటల పాటు రాష్ట్రంలోని సాధారణ విషయాలపైన్నే నడవడం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. కేటీఆర్ కి పగ్గాలను అప్పగించే దిశగానే జరిగిందని పలువురుఅంటున్నారు. వాస్తవానికి కొందరయితే....ఒకవేళ కరోనా మహమ్మారి రాకపోయి ఉంటే.... ఈపాటికే కేటీఆర్ కి పట్టాభిషేకం జరిగిపోయి ఉండేదనికూడా అంటున్నారు.
undefined
ఇదివరకు కేటీఆర్ తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించాడు. కానీ అది బడ్జెట్ సమావేశాల ముందు అవడం, పార్టీ అంతర్గత వ్యవహారం అవడంతో అది అంత ప్రాధాన్యత సంతరించుకోలేదు. కానీ ఇప్పుడు ఇది ప్రభుత్వ వ్యవహారం అవడంతో.... ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
undefined
జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెరాస మరోమారు ఘన విజయం సాధించి పరిస్థితులు అనుకూలిస్తే... అప్పుడు కేటీఆర్ కు పగ్గాలప్పగించే అవకాశం ఉందని తెలుస్తుంది.
undefined
కేసీఆర్ తాను అన్ని విధాలుగా ఫిట్ గా ఉండగానే కేటీఆర్ కి పగ్గాలు అప్పగించాలనియు చూస్తున్నారు. ఒకవేళ ఏమైనా అసంతృప్తి వ్యక్తమయినా కేసీఆర్ దాని సంగతి చూసుకోగలడు. ఈ అన్ని పరిస్థితులను గమనిస్తుంటే.. త్వరలోనే యువరాజుకు పట్టాభిషేకం జరగబోతున్నట్టుగానే కనబడుతుంది.
undefined