IPL 2021: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పు కొట్టాలంటే ఈ పద్ధతి మారాల్సిందే...

First Published | Apr 3, 2021, 1:03 PM IST

 'ఈ సాల కప్ నమదే' అనుకుంటూ అభిమానులు ప్రతి సీజన్‌ లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుపై ఆశలు పెట్టుకుంటూనే ఉన్నారు. ఈసారైనా కోహ్లీ సేన కప్పు కొట్టగలగడానికి ఉన్న అవకాశాలపై ఒక లుక్కేద్దాం... 

అరివీర భయంకర ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. అయినా, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ కేవలం కాగితంపై ఎదురులేని జట్టుగానే నిలుస్తోంది. 13 ఏండ్ల ఐపీఎల్‌ చరిత్రలో మూడుసార్లు టైటిల్‌ పోరుకు చేరుకున్నప్పటికీ బెంగళూర్‌కు టైటిల్‌ను ముద్దాడే అవకాశం దక్కలేదు. 'ఈ సాల కప్ నమదే' అనుకుంటూ అభిమానులు ప్రతి సీజన్‌పై ఆశలు పెట్టుకుంటూనే ఉన్నారు. మరి విరాట్‌ కోహ్లి ఇప్పుడైనా ఐపీఎల్‌ కప్పు కొడతాడా అనే చర్చ ప్రతిసారి లాగే ఈసారి కూడా మొదలయింది. ఐపీఎల్ ప్రారంభమవుతున్న వేళ ఆర్సీబీ జట్టు బాలలు, బలహీనతలపై ఒక లుక్కేద్దాం...
undefined
ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌. ఈ ఇద్దరూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు తొలి ఐపీఎల్‌ టైటిల్‌ అందించేందుకు సీజన్లుగా అలుపెరుగని విక్రమార్క ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గత సీజన్‌లో లీగ్‌ దశలో మెరుగైన ప్రదర్శన చేసిన కోహ్లిసేన.. ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓడింది.
undefined

Latest Videos


2020 సీజన్‌ను నాలుగో స్థానంతో ముగించిన బెంగళూర్‌.. ఐపీఎల్‌ 14ను టైటిల్‌ కొట్టే సీజన్‌గా భావిస్తోంది. గత సీజన్‌ జట్టు నుంచి పది మంది ఆటగాళ్లను వదిలేసిన ఆర్‌సీబీ.. ఆటగాళ్ల వేలంలో ఎనిమిది మందిని తీసుకుంది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (రూ.14 కోట్లు), కైల్‌ జెమీసన్‌ (రూ.15 కోట్లు)లపై అధిక మొత్తం వెచ్చించి జట్టులోకి తెచ్చుకుంది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ రాకతో మిడిల్‌ ఆర్డర్‌ సమస్యకు చెక్‌ పడనుండగా.. కైల్‌ జెమీసన్‌తో పేస్‌ విభాగానికి మరింత పదును రానుంది. గత సీజన్లతో పోల్చితే ఆర్‌సీబీ ఈ ఏడాది కొత్తగా కనిపిస్తోంది. కోహ్లి, ఏబీ, మాక్స్‌వెల్‌ త్రయం ఆర్‌సీబీ టైటిల్‌ రాత మారుస్తారనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
undefined
ప్రతీ సీజన్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్‌పైనే భారం పడటం ఆర్‌సీబీలో ఆనవాయితీగా వస్తోంది. యువ బ్యాట్స్‌మన్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ గత సీజన్‌లో ఆ సంస్కృతిని మార్చే ప్రయత్నం చేశాడు. టాప్‌ ఆర్డర్‌లో కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌లు ఆడిన పడిక్కల్‌ జట్టుకు కొత్త సమతూకం తీసుకొచ్చాడు. విరాట్‌ కోహ్లి, దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఓపెనింగ్‌ భాగస్వామ్యంపై ఆసక్తి నెలకొంది.
undefined
ఏబీ డివిలియర్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, వాషింగ్టన్‌ సుందర్‌,‌ అలెన్‌లు ఫామ్‌లో ఉండటం ఆర్‌సీబీకి కలిసొచ్చే అంశం. ఆర్‌సీబీ బౌలింగ్‌ విభాగంలో మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైనిలకు తోడు కైల్‌ జెమీసన్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌లు ఉన్నారు. వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వెంద్ర చాహల్‌తో స్పిన్‌ విభాగం మ్యాజికల్‌గా కనిపిస్తోంది. ప్రతి సీజన్‌లో బలహీన బౌలింగ్‌ విభాగంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ.. ఈ సారి బ్యాటింగ్‌ సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం కనిపిస్తోంది. బ్యాటింగ్‌ లైనప్‌లో విరాట్‌ కోహ్లి, దేవదత్‌ పడిక్కల్‌ మినహా మరో ఆకర్షణీయ స్వదేశీ బ్యాట్స్‌మన్‌ కరువ య్యాడు. మ్యా చ్‌ను మలుపుతిప్పగల విదేశీ విధ్వంసకారులు ఉన్నప్పటికీ స్వదేశీ బలం కీలకం అవుతుంది. కోహ్లిసేనను ఇది ఇరకాటంలో పడేసే అవకాశం లేకపోలేదు.
undefined
ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జోశ్‌ ఫిలిప్‌ స్థానంలో న్యూజిలాండ్‌ యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఫిన్‌ అలెన్‌ను తాజాగా బెంగళూర్‌ జట్టులోకి తీసుకుంది. పొట్టి ఫార్మాట్‌లో నిర్దాక్షిణ్య ఇన్నింగ్స్‌లు ఆడటంలో ఫిన్‌ అలెన్‌ దిట్ట. ఇటీవల బంగ్లాదేశ్‌పై పది ఓవర్ల మ్యాచ్‌లో ఉతికారేశాడు. టాప్‌ ఆర్డర్‌లో కోహ్లి.. మిడిల్‌ ఆర్డర్‌లో ఏబీ, మాక్స్‌వెల్‌లు ఉండగా.. లోయర్‌ ఆర్డర్‌లో ఫిన్‌ అలెన్‌ కీలకం కానున్నాడు. లక్ష్యాలు నిర్దేశించటంలో, లక్ష్యాలను ఛేదించటంలో ఫిన్‌ అలెన్‌ బ్యాటింగ్‌ మెరుపులు ఆర్‌సీబీకి ఎక్స్‌ ఫ్యాక్టర్‌. వేచి చూడాలి ఈ సాలా అయినా కప్పు కొడతారో లేదో...
undefined
click me!