IPL 2021: సన్ రైజర్స్ ఛాంపియన్ గా నిలవాలంటే వీరే కీలకం

First Published | Apr 2, 2021, 5:53 PM IST

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ కప్పు కొట్టడానికి గల అవకాశాలను పరిశీలిస్తూ... జట్టులో కీలకమైన ఆటగాళ్లు, వారి బలాలు, బలహీనతల మీద ఒక లుక్కేద్దాము. 

ఐపీఎల్ 2021 ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమవనుంది. ఎన్నడూ టైటిల్ ఫేవరెట్ గా లీగ్ ని ఆరంభించని ఆరంజ్ ఆర్మీ... 2016లో కప్పు కొట్టడమే కాకుండా, అప్పటినుండి ప్రతి ఏడాది ప్లే ఆప్స్ కి చేరింది. ఈ సారి ప్లే ఆప్స్ వద్దే ఆగిపోకుండా టైటిల్ కొట్టడానికి ఆరంజ్ ఆర్మీకి ఉన్న అవకాశాలు ఏమిటో చూద్దాము...
undefined
సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ విజయాల్లో ముఖ్య భూమిక కెప్టెన్‌ డెవిడ్‌ వార్నర్‌ది. వార్నర్‌ ప్రదర్శనపైనే సన్‌రైజర్స్‌ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. విధ్వంసకర ఓపెనర్‌గా డెవిడ్‌ వార్నర్‌ మెరుపులు సన్నగిల్లుతున్న తరుణంలో ఐపీఎల్‌ 2021లో ఆరెంజ్‌ ఆర్మీ ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరం.
undefined

Latest Videos


ఆటగాళ్ల వేలంలో సన్‌ రైజర్స్‌ వ్యూహం సైతం విమర్శలకు తావిచ్చింది. గత సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ వైఫల్యంలో ప్రధాన పాత్రధారుడు కేదార్‌ జాదవ్‌ను తీసుకుంది. రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబిలతో స్పిన్‌ విభాగం కిక్కిరిపోయినా.. ముజీబ్‌ రెహమాన్‌ రూపంలో మరో అఫ్గాన్‌ స్పిన్నర్‌ను జట్టులోకి చేర్చింది
undefined
భారత్‌తో వన్డే సిరీస్‌లో జానీ బెయిర్‌స్టో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. భారత బౌలర్లపై మెరుపు ఇన్నింగ్స్‌లు నమోదు చేశాడు. బెయిర్‌స్టో తాజా ఫామ్‌ సన్‌రైజర్స్‌ కు కలిసొచ్చే అంశం. గత సీజన్‌ ఆఖర్లో వృద్దిమాన్‌ సాహా, జేసన్‌ హౌల్డర్‌లు తుది జట్టుకు సమతూకం తీసుకొచ్చారు. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న తొలి మూడు జట్లను (ముంబయి ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌) ఓడించాల్సిన పరిస్థితుల్లో సన్‌ రైజర్స్‌ సూపర్‌ ప్రదర్శన చేసింది. గత సీజన్‌ను సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ దూకుడుగా ఆరంభించనుంది.
undefined
బలహీనత...సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు ముఖ్యమైన ఆటగాళ్లు నలుగురు విదేశీయులే. డెవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, జానీ బెయిర్‌స్టో, రషీద్‌ ఖాన్‌లకు తోడు జేసన్‌ హౌల్డర్‌ తోడయ్యాడు. మిడిల్‌ ఆర్డర్‌లో యువ బ్యాట్స్‌మన్‌ ప్రియాం గార్గ్‌, అబ్దుల్‌ సమద్‌లకు గత సీజన్‌లో మంచి అవకాశాలు కల్పించారు. మనీశ్‌ పాండే మిడిల్‌ ఆర్డర్‌లో కీలకం. స్వదేశీ ఆటగాళ్లు నిలకడగా రాణించింది చాలా స్వల్పం. బ్యాటింగ్‌ లైనప్‌లో స్వదేశీ ఆటగాళ్ల అండ దొరికితే.. ఆరెంజ్‌ ఆర్మీకి ఎదురుండదు.
undefined
బౌలర్లే బలంఐపీఎల్‌లో అత్యంత శక్తిమంతమైన బౌలింగ్‌ విభాగం సన్‌ రైజర్స్‌ సొంతం. స్వింగ్‌స్టర్‌ భువనేశ్వర్‌ కుమార్‌, అఫ్గాన్‌ స్పిన్‌ గన్‌ రషీద్‌ ఖాన్‌లు ఆరెంజ్‌ ఆర్మీ బౌలింగ్‌ దళాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. భువనేశ్వర్‌కు కొత్త కెరటం తంగరసు నటరాజన్‌ తోడయ్యాడు. డెత్‌ ఓవర్లలో భువి, నట్టూ జోడీని ఎదుర్కొవటం ప్రత్యర్థులకు సవాల్‌ కానుంది.
undefined
click me!