నలంద కిశోర్ మృతిపై హీటెక్కిన రాజకీయం: గంటా మౌనం వెనక...

First Published | Jul 27, 2020, 6:29 PM IST

నలంద కిషోర్ మరణ వార్త తెలుసుకున్న తరువాత గంటా నలంద కిషోర్ ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వచ్చాడు. అంతే తప్ప, ప్రభుత్వం పై ఒక్క విమర్శ కూడా చేయలేదు. 

ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఏ సంఘటనయినా రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. విశాఖకు చెందిన నలంద కిషోర్వ్యవహారంఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తోంది. ప్రతిపక్ష టీడీపీ ఏమో ఇది ప్రభుత్వ హత్య అని అంటుంటే.... వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ సైతం దొరికిందే తడువుగా నలంద కిషోర్ మరణానికి పోలీసులే కారణం అంటూవిరుచుకుపడ్డారు.
undefined
నలంద కిషోర్ గంటా శ్రీనివాసరావు అనుచరుడు. గత నెలలో ఆయన సోషల్ మీడియాలో మంత్రి అవంతి, విజయసాయి రెడ్డిలకు వ్యతిరేకంగా ఏవో పోస్టులు పెట్టాడన్న నెపంతో ఆయనను అరెస్ట్ చేసారు. విశాఖలో అరెస్ట్ చేసి ఆయన్ను రోడ్డు మార్గం గుండా కర్నూల్ తీసుకెళ్లారు.
undefined

Latest Videos


తన అనుచరుడిని అరెస్ట్ చేయడంతో గంటా శ్రీనివాసరావు అక్కడకు చేరుకొని ప్రభుత్వం పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి తనపై కోపముంటే తనపై నేరుగా తీర్చుకోవాలి కానీ, ఇలా అనుచరులను ఇబ్బంది పెట్టడం ఏమిటని ఆయన ఫైర్ అయ్యారు.
undefined
ఇక మొన్ననలంద కిషోర్మరణ వార్త తెలుసుకున్న తరువాత గంటా నలంద కిషోర్ ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వచ్చాడు. అంతే తప్ప, ప్రభుత్వం పై ఒక్క విమర్శ కూడా చేయలేదు.
undefined
ప్రభుత్వ వైఖరిని అన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నప్పటికీ.... గంటా మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలునోరు మెదపలేదు. అరెస్ట్ చేసినప్పుడే ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించిన గంటా, ఇప్పుడు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
undefined
ఇప్పుడు కిషోర్ మరణం గంటాకు తీవ్ర యిబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చి పెట్టింది. గంటా అనుచరుడు మృతి అని వార్తలొస్తున్న వేళ, ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వ హత్యా ఇది అని ఆరోపిస్తుంటే గంటా మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు.
undefined
గంటా పరిస్థితి ప్రస్తుతానికి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగ ఉంది. ఆయన వైసీపీలో చేరుతున్నాయని వార్తలు వచ్చాయి. అన్ని మీడియా ఛానెళ్ళలోనూ జోరుగా వార్తలు ప్రచారం కూడా అవుతున్నాయి. వార్తలు ప్రసారమవుతున్నప్పటికీ... గంటా మాత్రం వాటిని కొట్టిపారేయకుండా మౌనం వహిస్తున్నాడు.
undefined
గంటా వైసీపీలోకి వెళ్ళడానికి అవంతి శ్రీనివాస రావు, విజయసాయి రెడ్డిలు అడ్డు పడుతున్నారు అనేది వినిపిస్తున్న మాట. ఆయన వైసీపీ లో చేరకుండా వారు ప్రయత్నాలు చేసినప్పటికీ... విజయసాయి రెడ్డి కరోనా వైరస్ వల్ల రెస్ట్ తీసుకుంటున్న తరుణంలో ఆయన మరో సీనియర్ నేత సజ్జలను పట్టుకొని పని కానిచ్చుకున్నాడు.
undefined
అసలే జగన్ చేత ఎస్ అనిపించుకోవడానికి నానా కష్టాలు పడ్డాడు. ఈ సమయంలో ఆయన గనుక వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. వైసీపీ లోకి ఆయన ద్వారాలు శాశ్వతంగా మూసుకుపోతాయి.
undefined
పోనీ మాట్లాడకుండా ఉందామా అంటే... సొంత అనుచరుడు. అరెస్ట్ చేసినప్పుడే అక్కడకు వెళ్లి మరి ఈ అక్రమ అరెస్టులు ఏమిటని నిలదీసాడు. తన మీద శత్రుత్వం ఉంటె తనతోనే తేల్చుకోవాలని అన్నాడు. నలంద కిషోర్ మరణించిన తరువాత మీడియా అంతా గంటా అనుచరుడు అని అంటున్నారు.
undefined
ఈ నేపథ్యంలో గంటా పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కగా మారింది. అటు ప్రభుత్వాన్ని విమర్శించలేక, ప్రధాన అనుచరుడు మరణిస్తాయే, ప్రతిపక్షం అంతా అది ప్రభుత్వ హత్య అని ఆరోపిస్తున్నప్పటికీ... ఆయన మాత్రం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయారు.
undefined
click me!