సీన్ రిపీట్: రాపాకతో పవన్ కల్యాణ్, రఘురామతో వైఎస్ జగన్

Published : Jul 25, 2020, 08:44 AM IST

రఘురామ విషయంలో ఇప్పుడు జగన్ సహా వైసీపీ అంతా ఒకవైపు, రాజు గారు ఒకవైపు అన్నట్టుగా ఉంది వ్యవహారం. జగన్ కూడా రఘురామను ఏమీ చేయలేకపోతున్నాడు అనే ఇమేజ్ ఇప్పుడు బయట క్రియేట్ అయింది. 

PREV
115
సీన్ రిపీట్: రాపాకతో పవన్ కల్యాణ్, రఘురామతో వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిమ్మగడ్డ అంశం, వైసీపీ- టీడీపీల మధ్య పోరు అంశాలతోపాటుగా  అంతే స్థాయిలో ప్రాముఖ్యత సంతరించుకున్న మరో అంశం రఘురామకృష్ణంరాజు వ్యవహారం. సొంత పార్టీపైన్నే తిరుగుబాటు జెండా ఎగరేసిన రఘురామ ఇమేజ్ ఇప్పుడు ఏపీలో ఒక రేంజ్ లో ఉంది. 

215

ఆయన ఇమేజ్ అటుపక్కనుంచితే ఆయన వైసీపీ ని టార్గెట్ చేస్తూ చాలా వ్యాఖ్యలు చేసారు, చేస్తున్నారు. ఆయనను పర్సనల్ గా టార్గెట్ చేస్తే.... వారిని నానా మాటలు అంటున్నారు. ఆయనను ఒక్క మాటంటే ఆయన తిరిగి నాలుగు మాటలంటున్నాడు. 

315

వైసీపీ అధిష్టానం తమ పార్టీ నేతలను కొన్ని టీవీ ఛానళ్లలో చర్చలకు వెళ్లొద్దు అని చెప్పినప్పటికీ... ఆయా ఛానెళ్లకు చర్చలకు వెళ్లి మరి ఆయన తన పార్టీని తూర్పారబట్టారు. ఇసుక అక్రమ రవాణా నుంచి అవినీతి వరకు ఒక్కటేమిటి అన్ని విషయాల్లోనూ వైసీపీ నేతలను ఏకి పారేశారు, ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు కూడా. 

415

టీటీడీ వ్యవహారంతో మొదలుపెట్టిన రఘురామ, అప్పటినుండి ఇసుక, అమరావతి ఉద్యమం, ఇంగ్లీష్ మీడియం వంటి అనేక విషయాల్లో వైసీపీని ఉతికి ఆరేస్తున్నారు. జగన్ మా నాయకుడు అంటూనే ఆయన అనాలనుకుంటున్నమాటలన్నీ అంటున్నాడు.  

515

ఇక తాజాగా ఆయనకు ఇచ్చిన షో కాజ్ నోటీసు ఏకంగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఆయనను ఇబ్బంది పెడుదాము అనుకున్న వైసీపీనే ఆయన ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించాడు. ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరు మీద తనకు నోటీసు వచ్చిందని, ఆ పార్టీ పేరుతో తనకు నోటీసు ఎలా ఇస్తారని ప్రశ్నించారు రఘురామ. ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి ఏమిటంటూ ఆ షో కాజ్ నోటీసు మీద సంతకం పెట్టిన విజయసాయిని ఎద్దేవా చేసారు రఘురామ. 

615

అక్కడితో ఆగకుండా రఘురామ ఎన్నికల కమిషన్ కి వెళ్లి దపార్టీ పేరుపై ఫిర్యాదు చేసారు. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ భాష.... తమ పార్టీ పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందంటూ కోర్టుకెక్కాడు. 

715

ఆ తరువాత వైసీపీ ఎంపీలంతా ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ ని కలిసి అనర్హత వేటు వేయాలని కోరడం, ఆ తరువాత లోక్ సభలో ఆయన సీటును వెనక్కి మార్చడం ఇత్యాది పనులు చేసినా.... ఆయన మాత్రం ఎక్కడా తగ్గకుండా, సింహం కూర్చున్నదే సింహాసనం వంటి డైలాగ్స్ కొడుతున్నాడు. 

815

రఘురామ విషయంలో ఇప్పుడు జగన్ సహా వైసీపీ అంతా ఒకవైపు, రాజు గారు ఒకవైపు అన్నట్టుగా ఉంది వ్యవహారం. జగన్ కూడా రఘురామను ఏమీ చేయలేకపోతున్నాడు అనే ఇమేజ్ ఇప్పుడు బయట క్రియేట్ అయింది. 

రఘురామ విషయంలో ఇప్పుడు జగన్ సహా వైసీపీ అంతా ఒకవైపు, రాజు గారు ఒకవైపు అన్నట్టుగా ఉంది వ్యవహారం. జగన్ కూడా రఘురామను ఏమీ చేయలేకపోతున్నాడు అనే ఇమేజ్ ఇప్పుడు బయట క్రియేట్ అయింది. 

915

దీనితో ఇప్పుడు వైసీపీ అధిష్టానం జనసేనాని పవన్ కళ్యాణ్ మార్గాన్ని ఫాలో అవుతున్నట్టుగా కనబడుతుంది.జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎన్నికైన కొద్దీ రోజుల నుంచే వైసీపీకి దగ్గరగా, జనసేనకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. 

1015

బహిరంగంగా జనసేన నేతల మీద విమర్శలు చేయడం దగ్గరినుండి జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయడం వరకు ఆయన అనేక విధాలుగా జనసేనను ఇబ్బంది పెట్టే పనులు చేసారు. 

1115

తొలినాళ్లలో ఆయన మీద తీవ్ర విమర్శలను జనసేన నాయకులు చేస్తే... దానికి రాపాక కూడా తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఆయన జనసేన మీద, జనసేన అధ్యక్షుడి మీద, ఎన్నికల్లో అధినేత ఓటమి దగ్గరి నుండి మొదలు ఫాన్స్ ఓవర్ ఆక్షన్ వరకు అనేక అంశాల మీద విరుచుకుపడ్డారు. 

1215

ఇక రాపాకను పార్టీ నుంచి సస్పెండ్ చేసి వైసీపీలో ఆయన చేరికను సుగమం చేయడం కన్నా కూడా ఆయనను వదిలేస్తేనే కరెక్ట్ అని జనసేన భావించింది. ఆయనను వారు పట్టించుకోకుండా వదిలేసారూ. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం కూడా ఆపేయడంతో ఆయన మీద మీడియా ఫోకస్ తగ్గిపోయింది. 

1315

ఆరంభంలో రాపాక ఏం మాట్లాడిన సెన్సేషన్. ఆయన మాట్లాడడం, దానికి జనసేన కౌంటర్ ఇవ్వడం, మరల దానిపై రాపాక విరుచుకుపడడం అన్ని వెరసి జనసేనకు నష్టం జరగడం తప్ప వేరేది జరగలేదు. ఆయనను పట్టించుకోకుండా వదిలేయడం, ఆయన వ్యాఖ్యలు చేసినప్పటికీ... దాని మీద రెస్పాండ్ కాకపోవడం వల్ల జనసేన కనీసం కొన్ని విమర్శల నుండి తప్పించుకోవడంతోపాటుగా... అధికారపక్షం ప్రయోగించదల్చిన రాపాక అనే బ్రహ్మాస్త్రం కాస్త ఇప్పుడు వృధాగా మిగిలిపోయేలా చేయగలిగారు. 

1415

ఇదే విధంగా ఇప్పుడు రఘురామ కృష్ణం రాజు వ్యవహారంలో కూడా వ్యవహరించాలని భావిస్తున్నారు వైసీపీ నేతలు. ఆయన ను పట్టించుకోకుండా వదిలేయాలని యోచిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలకు ఎవరు రిప్లై ఇవ్వకుండా ఊరుకుంటే మీడియా ఫోకస్ తగ్గుతుంది అని యోచిస్తున్నారు. 

1515

కానీ రాపాక విషయంలో జరిగినట్టు రఘురామ విషయంలో కూడా జరుగుతుందా అనేది వేచి చూడాల్సిన అంశం. అక్కడ జనసేన ఒక్క ఎమ్మెల్యే కలిగిన చిన్న పార్టీ. కానీ వైసీపీ అధికారంలో ఉంది. దానికి తోడు రఘురామ రాపాక లాంటి చిన్న నేత కాదు. బీజేపీ అండ కూడా తోడయింది. వేచి చూడాలి రానున్న కాలంలో ఇది ఎలా వర్క్ అవుట్ అవుతుందో..!

click me!

Recommended Stories