గంటా శ్రీనివాస రావుకు పచ్చ జెండా ఊపిన జగన్: తెర వెనక రాయబారం ఈయనే

First Published | Jul 25, 2020, 4:11 PM IST

సైకిళ్ళ స్కాం అనడంతో అందరూ కూడా గంటాను వైసీపీ టార్గెట్ చేసిందని అనుకున్నారు. న్యూస్ చానెల్స్ తో ఇందుకు సంబంధించిన విశ్లేషణలు కూడా వచ్చాయి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ టీడీపీ అంటూ పేర్లు కూడా వినబడ్డాయి. తన మీద రాజకీయపరంగా దాడి జరుగుతున్నప్పటికీ... గంటా మాత్రం వారికెవ్వరికి రిప్లై మాత్రం ఇవ్వలేదు. 

ఆంధ్రప్రదేశ్ లో గంటాశ్రీనివాసరావు గురించిన చర్చ ఇప్పుడు తీవ్ర స్థాయిలో నడుస్తుంది. ఆయన పార్టీలో చేరతారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఊహాగానాల మాట అటుంచితే.... ఉత్తరాంధ్ర ఇంచార్జి గా వ్యవహరిస్తోంది జగన్ ఆత్మ విజయసాయి రెడ్డి. విశాఖకే చెందిన మరో బలమైన నాయకుడు అవంతి శ్రీనివాసరావు. వీరిని కాదని ఎవరి ద్వారా జగన్ దగ్గర గంటా చక్రం తిప్పాడనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కొన్ని రోజుల కిందనే అవంతి శ్రీనివాసరావు, విజయసాయి రెడ్డి ఇద్దరు తీవ్రమైన విమర్శలు చేసారు. గంటా మీద ఈ స్థాయి విమర్శలను చేయడంతో మరో టీడీపీ నాయకుడిని వైసీపీ టార్గెట్ చేసారు అని అంతా అనుకున్నారు. తొలుత విజయసాయి రెడ్డి, ఆతరువాత ప్లాన్డ్ గా ఏదో పథకం ప్రకారంఅన్నట్టుగా అవంతి శ్రీనివాస్ విజయసాయి కి కోరస్ కలిపారు.

సైకిళ్ళ స్కాం అనడంతో అందరూ కూడా గంటాను వైసీపీ టార్గెట్ చేసిందని అనుకున్నారు. న్యూస్ చానెల్స్ తో ఇందుకు సంబంధించిన విశ్లేషణలు కూడా వచ్చాయి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ టీడీపీ అంటూ పేర్లు కూడా వినబడ్డాయి. తన మీద రాజకీయపరంగా దాడి జరుగుతున్నప్పటికీ... గంటా మాత్రం వారికెవ్వరికి రిప్లై మాత్రం ఇవ్వలేదు.
ఈ సంఘటనకు కొన్ని రోజుల ముందునలంద కిషోర్ విషయంలో గంటావైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో... నలంద కిశోర్విషయమప్పటినుంచే గంటాను వైసీపీ నేతలుటార్గెట్ చేయడం మొదలుపెట్టారు అనేవ్యాఖ్యలు వినబడ్డాయి. దానితో విజయసాయి వ్యాఖ్యలను వాటి కొనసాగింపుగానే చూసారు.
కానీ అసలు కథ వేరేది ఉందన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. గంటా వైసీపీలోకి వస్తాడన్న చర్చ ఎన్నికలు ముగిసిన తరువాతి నుంచే వినపడుతున్నాయి. కానీ ఎప్పటికప్పుడు వాటిని కొట్టి పారేస్తూనే ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా గంటా బలమైన నేత. అంగ బలం, అర్థ బలం బలంగా కలిగిన నేత. రాజకీయాల్లో చక్రం తిప్పడం బలంగా తెలిసిన నేత.
ఆయన గనుక వైసీపీలోకి వెళితే..... వైసీపీలో ఉత్తరాంధ్ర ఇంచార్జి విజయసాయికి, విశాఖ కేచెందిన మరో నేత అవంతి శ్రీనివాస్ లకు ప్రాముఖ్యత తగ్గుతుంది. అందుకోసమనే వారు ఎప్పటినుండో గంటాను పార్టీలోకి రానివ్వకుండా అడ్డుపడుతున్నారు అని అంటున్నారు.
కానీ ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ఒక రెండు సంఘటనలు ఇప్పుడు గంటకు కలిసి వచ్చినట్టుగా కనబడుతున్నాయి. జగన్ ఈ మధ్య కాలంలో పార్టీ ఇంచార్జిలను నియమించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా పార్టీ హెడ్ ఆఫీస్ ఇంచార్జి గా విజయసాయిని తొలగించి సజ్జల రామకృష్ణ రెడ్డిని నియమించారు.
గంటా సజ్జల ద్వారా తన మార్గాన్ని సుగమం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. విజయసాయి రెడ్డి తనకు వ్యతిరేకంగా ఉన్నాడన్నవిషయం తెలుసుకున్న గంటా....సజ్జల ద్వారా చక్రం తిప్పి జగన్ ని ఒప్పించినట్టుగా తెలిస్తుంది.
అనుకోకుండా విజయసాయి రెడ్డి కరోనా బారిన పడడంతో.... ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కరోనా తో ఒకింత రెస్ట్ కోసం రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇదే అదునుగా గంటా తన మార్గాన్ని సుగమం చేసుకున్నారు.
గంటా శ్రీనివాసరావు ఈ మొత్తం విషయంలో చాలా సైలెంట్ గా ఉండి పూర్తి పని కానిచ్చినట్టుగా చెబుతున్నారు వైసీపీ అంతర్గత వర్గాలు. ఇప్పుడు గంటా గనుక వైసీపీలోకి ఎంటర్ అయితే.... విశాఖ రాజకీయ ముఖచిత్రం ఏవిధంగా మార్పు చెందుతుందో వేచి చూడాలి..!

Latest Videos

click me!